విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నికల వేళ! విశాఖ మన్యంలో మావోల అలజడి..శక్తిమంతమైన మందుపాతరలు!

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కోలాహలం నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులు అలజడి సృష్టించడానికి ప్రయత్నించారు. పోలింగ్ రెండు రోజుల కిందటే సరిహద్దుల్లోని ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే సహా అయిదుమందిని హతమార్చిన మావోయిస్టులు.. విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కలకలం రేపారు. మందుపాతరలతో పేలుడు సృష్టించడానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నాలను పోలీసులు వమ్ము చేశారు. మందుపాతరలను కనుగొని, సకాలంలో వాటిని నిర్వీర్యం చేశారు. జిల్లాలోని పెదబయలు మండలం సీకుపనస, మద్దిగరువు అటవీ ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల విధుల్లో పోలీసులు, ఇతర సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాతరలను అమర్చి ఉంటారని జిల్లా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఓటు వేయకుండా దళితులను అడ్డుకున్న టీడీపీ నేతలు: ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపైనా దాడికి యత్నం <br>ఓటు వేయకుండా దళితులను అడ్డుకున్న టీడీపీ నేతలు: ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపైనా దాడికి యత్నం

రాష్ట్రంలో ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో- ఏజెన్సీ ప్రాంతాలపై జిల్లా పోలీసులు నిఘా ఉంచారు. డ్రోన్ల సహాయంతో భద్రతను పర్యవేక్షించారు. దంతెవాడ జిల్లాలో చోటు చేసుకున్న మావోయిస్టుల దాడి ఘటన, గత ఏడాదే అరకు శాసన సభ్యుడు కిడారి సర్వేశ్వరరావు, మాజీ శాసన సభ్యుడు శివేరు సోమలను మావోయిస్టులు కాల్చి చంపిన ఉదంతం నేపథ్యంలో.. సరిహద్దు జిల్లా అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరింపజేశారు ఎన్నికల అధికారులు. సమస్యాత్మక, అత్యంత సున్నిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జిల్లా పోలీసులతో పాటు గ్రేహౌండ్స్‌, పారామిలటరీ, ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లోని ఎన్నికల నిర్వహణకు అవసరమైన హెలికాప్టర్‌, డ్రోన్‌లను వినియోగించారు. పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించారు. మందుపాతరలను గుర్తించే పరికరాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో అణువణువూ గాలించారు.

Maoist land mine found by the greyhounds in Visakhapatnam Agency area, defused

ఈ సందర్భంగా పెదబయలు మండలం సీకుపనస, మద్దగరువు అటవీ ప్రాంతాల మధ్య మూడు శక్తిమంతమైన మందుపాతరలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఈ సమాచారాన్ని జిల్లా ఎస్పీకి అందజేశారు. విశాఖపట్నం నుంచి నిపుణులను రప్పించి, మందుపాతరలను నిర్వీర్యం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మరోసారి మావోయిస్టులు చురుగ్గా కదులుతున్నట్లు వెల్లడైందని, ఏజెన్సీ ప్రాంతాల్లో కూంబింగ్ మరింత ఉధృతం చేస్తామని జిల్లా పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా- మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగిసింది. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలైన అరకు, పాడేరులో పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ముగిసింది. గడువు ముగిసిపోయినప్పటికీ.. అప్పటిదాకా పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు.

English summary
Police, Greyhounds and Paramilitary forces found Three powerful Land mines in Visakhapatnam district Agency areas on Thursday. Three Land mines found in forest area near Seeku Panasa, Maddi Garuvu villages in Pedabayalu Mandal of the District. After found the Three land mines Police immediately defused that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X