విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓదార్పు యాత్ర చేసిన నేతకు కార్మికుల కష్టాలు తెలీవా ? జగన్ టార్గెట్ గా మెగా బ్రదర్ నాగబాబు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతతో నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడ్డారు. పనుల్లేక పస్తులు ఉండే పరిస్థితి వచ్చింది.అంతేకాదు ఇప్పటికే నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ సందర్భంలో రాష్ట్రంలో భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలపై జనసేన పార్టీ సమరశంఖం పూరించింది. విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించి ప్రభుత్వంలో చలనం తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది.

జనసేనకు దగ్గరవ్వాలని చూస్తున్న టీడీపీ: పవన్ లాంగ్ మార్చ్ పై తెలుగు తమ్ముళ్ళ వ్యూహం ఇదేనా ?జనసేనకు దగ్గరవ్వాలని చూస్తున్న టీడీపీ: పవన్ లాంగ్ మార్చ్ పై తెలుగు తమ్ముళ్ళ వ్యూహం ఇదేనా ?

అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలను లాంగ్ మార్చ్ కు ఆహ్వానించిన పవన్

అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలను లాంగ్ మార్చ్ కు ఆహ్వానించిన పవన్

విశాఖలో 'లాంగ్ మార్చ్' పేరిట ర్యాలీ నిర్వహించేందుకు జనసేన సన్నాహాలు చేస్తోంది. కార్మికుల కోసం అందరం కలిసి పోరాటం చేద్దామని బిజెపి, టిడిపి, వామపక్ష పార్టీలను సైతం లాంగ్ మార్చ్ కు ఆహ్వానించారు జనసేనాని పవన్ కళ్యాణ్. అయితే బిజెపి ఎవరి దారి వారిదే అని తేల్చి చెప్పేసింది. టిడిపి మాత్రం జనసేన పార్టీతో కలిసి నిర్మాణ రంగ కార్మికుల కోసం పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉంది.

ఒడార్పుయాత్ర చేసిన నేతకు కార్మికుల కష్టాలు తెలీవా ? అని ప్రశ్న

ఒడార్పుయాత్ర చేసిన నేతకు కార్మికుల కష్టాలు తెలీవా ? అని ప్రశ్న

పవన్ కళ్యాణ్ ఇసుక కొరత నేపధ్యంలో నిర్మాణ రంగ కార్మికుల కోసం చేయతలపెట్టిన లాంగ్ మార్చ్ పై మెగాబ్రదర్ నాగబాబు తన స్పందన తెలియజేశారు. సీఎం జగన్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఓదార్పు యాత్ర చేసిన నేతకు భవన నిర్మాణ రంగ కార్మికుల కష్టాలు తెలియవా? అంటూ నాగబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏర్పాటైన ఇంత తక్కువ కాలంలోనే పోరాటాలు చెయ్యాల్సి వస్తుందని పవన్ అనుకోలేదని నాగబాబు పేర్కొన్నారు. ప్రజలకు మంచి పాలన అందించటంలో వైసీపీ ఫెయిల్ అయ్యిందని చెప్పుకొచ్చారు. కష్టాల్లో చిక్కుకున్న కార్మికులకు అండగా నిలిచేందుకే జనసేన పార్టీ 'లాంగ్ మార్చ్' నిర్వహిస్తున్నట్టు మెగా బ్రదర్ నాగబాబు వెల్లడించారు.

పవన్ కు సామాజిక స్పృహ ఎక్కువ.. అందుకే కార్మికుల కోసం పోరుబాట అన్న నాగబాబు

పవన్ కు సామాజిక స్పృహ ఎక్కువ.. అందుకే కార్మికుల కోసం పోరుబాట అన్న నాగబాబు

తన సోదరుడైన పవన్ కళ్యాణ్ కు సామాజిక స్పృహ ఎక్కువని, సమస్యలపై స్పందించే వ్యక్తి అని అందుకే రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తనదైన స్టైల్లో స్పందిస్తారని పేర్కొన్నారు. భవన నిర్మాణ రంగ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడడం చాలా బాధ కలిగించిందని నాగబాబు తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన చేస్తున్న పోరాటాన్ని మన కోసం మనం చేసే పోరాటంగా భావించాలని మెగా బ్రదర్ నాగబాబు పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో గెలవడానికి చూపించిన ఉత్సాహంలో కేవలం 35 శాతం ఈ ఇసుక కొరతను తగ్గించడానికి చూపించినా పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు నాగబాబు

విశాఖ నగరంలోనే నిర్మాణ రంగంలో 1.2 లక్షల మంది కార్మికులున్నారన్న నాగబాబు

విశాఖ నగరంలోనే నిర్మాణ రంగంలో 1.2 లక్షల మంది కార్మికులున్నారన్న నాగబాబు

నవంబర్ 3వ తేదీన విశాఖలో తలపెట్టిన లాంగ్ మార్చ్ కు ప్రతి ఒక్కరూ తరలివచ్చి నిర్మాణ రంగ కార్మికుల సమస్యల కోసం జనసేన తో కలిసి ముందుకు సాగాలని నాగబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నా పట్టించుకోకపోవడం దారుణం అన్నారు.ఒక్క విశాఖ నగరంలోనే భవన నిర్మాణ రంగంలో 1.2 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నందున వారందరినీ కలుపుకొని వెళతామన్నారు. విశాఖలో ఈ నెల మూడున నిర్వహించనున్న లాంగ్‌ మార్చ్‌ నేపథ్యంలో విశాఖలోని పౌర గ్రంథాల యంలో కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

విశాఖలో లాంగ్ మార్చ్ ఏర్పాట్ల సమీక్షలో నాగబాబు

విశాఖలో లాంగ్ మార్చ్ ఏర్పాట్ల సమీక్షలో నాగబాబు


మూడో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు మద్దిలపాలెం కూడలిలోని తెలుగు తల్లి విగ్రహం నుంచి స్వర్ణభారతి, రామా టాకీస్‌, ఆర్‌టిసి కాంప్లెక్స్‌ మీదుగా జివిఎంసి గాంధీ విగ్రహం వరకూ లాంగ్‌ మార్చ్‌ జరగనుందని తెలిపారు. అనంతరం ఉమెన్స్‌ కళాశాల ఎదురుగా బహిరంగ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు. ఈ లాంగ్‌ మార్చ్‌కు రాజకీయ పార్టీల నుండి, ప్రజా సంఘాల నుండి మద్దతు లభిస్తోందని మెగా బ్రదర్ నాగబాబు పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి నిర్వహిస్తున్న ఈ లాంగ్ మార్చ్ ను సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నాగబాబు పేర్కొన్నారు.

English summary
Jana Sena Party leader and actor K Nagababu stated that the YSRCP Government has failed on all fronts. Nagababu said the YSRCP Government was not making even one-fourth of effort towards the development of state as it used to take to ensure its victory in the recent elections.Admitting that the JSP was not inclined towards criticising the YSRC Government, Nagababu said it's a fact that the construction industry and its allied sectors have suffered a serious setback across the state. The leader who had conducted 'Vodarpu yatra' in the past and reached out to people failed to lend an ear to people's woes now, he pointed out.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X