విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెడ్ టెక్ జోన్ క్రెడిట్ కోసం వైసీపీ, టీడీపీ ఆరాటం.. నిన్న మొన్నటి వరకూ..

|
Google Oneindia TeluguNews

విశాఖలో గత టీడీపీ హయాంలో ప్రారంభమైన ఏపీ మెడ్ టెక్ జోన్ పై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. టీడీపీ ప్రారంభించిన మెడ్ జోన్ లో అక్రమాలు జరుగుతున్నాయని, తమకు కావాల్సిన వారికే ఇక్కడ పరిశ్రమలు కట్టబెడుతున్నారని అప్పట్లో వైసీపీ ఆరోపణలు చేస్తే... తాజాగా వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టు నిర్వీర్యం అయిపోయిందని టీడీపీ ఆరోపించని రోజు లేదు. కానీ తాజాగా మెడ్ టెక్ జోన్ నుంచి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి రావడంతో ఇప్పుడు దీన్ని ఓన్ చేసుకునేందుకు ఇరు పార్టీలు పోటీపడుతున్నాయి.

 విశాఖ మెడ్ టెక్ జోన్..

విశాఖ మెడ్ టెక్ జోన్..


2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో వైద్య పరికరాలు, కిట్ల తయారీ కోసం వివిధ పరిశ్రమల సముదాయంగా ఏర్పాటు చేసిన విశాఖ మెడ్ టెక్ జోన్ ఆ తర్వాత ఆశించిన రీతిలో అభివృద్ధి చెందలేదు. ఇందుకోసం నిధుల కొరత ఓ కారణం కాగా.. ఏపీకి వచ్చేందుకు పరిశ్రమలు అంతగా ఆసక్తి చూపకపోవడం మరో కారణం. దీంతో దేశీయంగా ఉన్న పరిశ్రమలనే ఇందులో భాగస్వాములుగా చేస్తూ మెడ్ టెక్ జోన్ ను ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించింది. కానీ ఇందులో టీడీపీ ప్రభుత్వం భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని అప్పట్లో విపక్షంలో ఉన్న వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసేది.

వైసీపీ అధికారంలోకి వచ్చాక..

వైసీపీ అధికారంలోకి వచ్చాక..

ఏపీలో గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చాక మెడ్ టెక్ జోన్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందీ లేదు, అలాగని నిర్వీర్యం చేసిందీ లేదు. దీనికి ప్రధాన కారణం నిధుల కొరతే. అయితే టీడీపీ హయాంలో ఇక్కడ అనుమతులు తెచ్చుకున్న పరిశ్రమలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అయితే కరోనా రాక ముందు వరకూ మెడ్ టెక్ జోన్ నుంచి పెద్దగా ఉత్పత్తులేవీ బయటికి వచ్చినట్లు కనిపించలేదు. కానీ కరోనా విజృంభణ నేపథ్యంలో ఇక్కడి కంపెనీలకు చేతి నిండా పని దొరికింది. దీంతో మెడ్ టెక్ జోన్ సీఈవోగా ఉన్న జితేందర్ శర్మకు ప్రభుత్వం కాస్త ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. దీంతో ఆయన తనకు కావాల్సిన అనుమతులన్నీ తెచ్చుకుని కరోనా నిర్దారణ కిట్ల తయారీ ప్రారంభించారు.

రాకెట్ వేగంతో ర్యాపిడ్ కిట్ల తయారీతో మారిన పరిస్ధితి..

రాకెట్ వేగంతో ర్యాపిడ్ కిట్ల తయారీతో మారిన పరిస్ధితి..

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా టెస్టింగ్ కిట్ల కొరత ఏర్పడింది. ఈ సమయంలో మెడ్ టెక్ జోన్ హుటాహుటిన అనుమతులు తెచ్చుకుని ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల తయారీకి పూనుకుంది. అత్యంత తక్కువ సమయంలో వెయ్యి ర్యాపిడ్ కిట్లను తయారు చేసి ఇవాళ ప్రభుత్వానికి అందించింది. అంతే కాదు మరో నెల రోజుల్లో వేల సంఖ్యలో పర్సనల్ ప్రొటెక్షన్ కిట్లతో పాటు వెంటిలేటర్లను తయారు చేసి ఇస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. దీంతో మన రాష్ట్రంలో రాజకీయ పార్టీలే కాదు దేశంలో పలువురి దృష్టీ మెడ్ టెక్ జోన్ పై పడింది.

మెడ్ టెక్ జోరు- రంగంలోకి పార్టీలు..

మెడ్ టెక్ జోరు- రంగంలోకి పార్టీలు..

విశాఖ మెడ్ టెక్ జోన్ కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ఉత్పత్తితో పాటు పంపిణీ కూడా ప్రారంభించిన నేపథ్యంలో ఇదంతా చంద్రబాబు ఘనతే అంటూ టీడీపీ, కాదు కాదు మేం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రోత్సాహమే అంటూ వైసీపీ ప్రచారం ప్రారంభించేశాయి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన మెడ్ టెక్ జోన్ కు అప్పట్లో అడ్డుపడింది వైసీపీయేని టీడీపీ విమర్శలు చేస్తుండగా.. వైసీపీ కూడా దానికి కౌంటర్ గా మొన్నటి వరకూ టీడీపీ చేసిన విమర్శలను గుర్తుచేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ మైలేజ్ గేమ్ ఏ స్ధాయికి వెళ్తుందో చూడాల్సిందే.

English summary
mileage game starts among political partiess in andhra pradesh over visakhapatnam med tech zone. ap med tech zone had started in previous tdp regime and producing fruits in ysrcp regime. so, both ysrcp and tdp tries to own the prestigious med tech project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X