విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పుడు చెప్పులు వేసుకుంటే తప్పులేదు... ఇప్పుడు ఎందుకు ..మంత్రి అవంతి

|
Google Oneindia TeluguNews

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిర్ణయంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య తీవ్ర మాటల యుద్దం కొనసాగుతున్న విషయం తెలిసిందే... దీంతో ఇరు పార్టీల నేతలు వ్యక్తిగత దూషణలకు దిగారు. ఒక దశలో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వంశీల మధ్య తీవ్ర పదజాలం కొనసాగింది. మరోవైపు దేవినేని ఉమా, మరియు మంత్రి కొడాలి నానిల మధ్య ఇదే స్థాయిలో తీవ్రంగా విమర్శించుకున్నారు.

అయితే అయ్యప్ప స్వామిమాలలో ఉన్న ఎమ్మెల్యే వంశీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని టీడీపీ తీవ్ర విమర్శలు చేపట్టింది. దీంతో వైసీపీ నేతలు మతాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని పలువురు నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే మంత్రి అవంతి శ్రీనివాస్ సైతం అయ్యప్ప దీక్షలో ఉండి చెప్పుులు వేసుకున్నారని తీవ్రంగా దుయ్యబట్టింది. పార్టీ నేతలు మతాన్ని కించపరుస్తున్నారంటూ ధ్వజమెత్తింది.

Minister Avanthi Srinivas explanation on tdp comments

దీంతో తనపై వచ్చిన విమర్శలపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. హిందూ మతంలోనే పుట్టాను... హిందూ మతంలోనే చనిపోతానని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. తనకంటే హిందూమతాన్ని ప్రేమించే వారు లేరని ఆయన చెప్పారు. తనకు షుగర్ ఉండడం వల్లే చెప్పులు వేసుకున్నానని వివరించారు. అయితే టీడీపీలో ఉన్నప్పుడు తాను ఇలాగే అది కూడ ఎంపీగా ఉన్నప్పుడు సైతం దీక్షలో ఉన్నప్పుడు చెప్పులు వేసుకుని నడిచానని చెప్పారు. దీంతో తాను టీడీపీలో ఉన్నప్పుడు చెప్పులు వేసుకున్నా.. పవిత్రంగా ఉన్న తాను ఇప్పుడు పార్టీ మారే సరిగా అపవిత్రుడిగా మారానా అంటూ ఆయన టీడీపీ శ్రేణులను ప్రశ్నించారు. మరోవైపు టీడీపీ మాజీ ఎంపీ మురళి మోహన్ సైతం దీక్షలో ఉన్నప్పుడు చెప్పులు ధరించేవారని గుర్తు చేశారు.

English summary
Minister Avanti Srinivas said there is no one who loves Hinduism more than him. Born in Hinduism he clears that "I will die in Hinduism'' he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X