విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బురదలో కూరుకుపోయిన మంత్రి అవంతి వాహనం: అనూహ్య ఘటనతో: తోసిన పోలీసులు

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖపట్నంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఊహించని విధంగా చోటు చేసుకున్న ఈ ఘటనతో మంత్రి కొద్దిగా కంగారు పడ్డారు. అనంతరం కుదురుకున్నారు. దేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరిస్తోన్న సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదం: పెద్ద కుట్ర: జగన్‌ ఇమేజ్‌కు డ్యామేజ్: మా నమ్మానికీ: హీరో రామ్స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదం: పెద్ద కుట్ర: జగన్‌ ఇమేజ్‌కు డ్యామేజ్: మా నమ్మానికీ: హీరో రామ్

ఈ ఉదయం విశాఖపట్నంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ప్రత్యేక వాహనంలో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించడానికి బయలుదేరారు. గౌరవ వందనాన్ని స్వీకరిస్తోన్న సమయంలో.. ఆ వాహనం బురదలో కూరుకుపోయింది. ముందుకు కదల్లేకపోయింది. దీన్ని గమనించిన పోలీసులు పరుగెత్తుకుంటూ వచ్చి, వాహనాన్ని ముందుకు తోశారు. దీనితో అది బురదలో నుంచి బయటికి వచ్చింది. ముందుకు కదిలింది.

Minister Avanti Srinivas Police vehicle stuck in mud, police push the vehicle

విశాఖపట్నంలో భారీ వర్షాలు కురిశాయి. ఏకధాటిగా వర్షం కురిసింది. నగరాన్ని ముంచెత్తింది. ఆ తరువాత కూడా అడపా దడపా చినుకులు పడుతూనే ఉన్నాయి. ఫలితంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం ముస్తాబు చేసిన గ్రౌండ్ చిత్తడిగా మారింది. దీనితో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్పటికప్పుడు గ్రౌండ్‌ను పొడిగా మార్చారు. ఇసుక, కంకరను తెచ్చి బురద ఉన్న చోట వేశారు. అయినప్పటికీ.. గ్రౌండ్‌లో చాలా చోట్ల చిత్తడి కనిపించింది. మంత్రి గౌరవ వందనాన్ని స్వీకరిస్తోన్న సమయంలో వాహనం బురదలో కూరుకుపోయింది. ముందుకు కదల్లేకపోయింది.

Recommended Video

Independence Day విషెస్ తెలిపిన టాలీవుడ్ స్టార్స్ || Oneindia Telugu

ఈ ఘటన అనంతరం అవంతి శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు. జిల్లాలో సుమారు మూడు లక్షల‌మంది అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని అన్నారు. వైఎస్సార్ రైతు భరోసా వల్ల జిల్లాలో 3.48 లక్షలమందికి తొలి విడతగా 194.42 కోట్ల రూపాయలు అందించామని అన్నారు.

English summary
AP Tourism Minister's vehicle stuck in the mud while he was taking the guard of honour. Police staff had pushed the vehicle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X