విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్రైన్, హెలికాప్టర్ వద్ద ఫోటో దిగితే మనదవుతాయా..? అయ్యన్న కామెంట్లపై మంత్రి జయరాం ఫైర్

|
Google Oneindia TeluguNews

ఏపీ ఈఎస్ఐ స్కాంలో మంత్రి గుమ్మనూరు జయరాంపై మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జయరాం కుమారుడు ఈశ్వర్‌కు బర్త్ డే సందర్భంగా ఏ-14 నిందితుడు కార్తీక్ బెంజ్ కారు గిప్ట్ ఇచ్చారని పేర్కొన్నారు. దీనిపై మంత్రి జయరాం ఖండించారు. అయ్యన్న పాత్రుడు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్రైన్, హెలికాప్టర్ పక్కన ఫోటో దిగితే..

ట్రైన్, హెలికాప్టర్ పక్కన ఫోటో దిగితే..


ఈశ్వర్ పక్కనున్న బెంజ్‌ కారు తమది కాదని స్పష్టంచేశారు. కారు పక్కన ఈశ్వర్ ఫోటో మాత్రమే దిగాడని వివరించారు. అలాకాక హెలికాఫ్టర్, ట్రైన్ పక్కన ఫోటోలు దిగితే అవీ మనవే అవుతాయా అని మండిపడ్డారు. ఆ కారు తమదే అని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. మంత్రి జయరాం శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరులో మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి తనకేం సంబంధం అని ప్రశ్నించారు.

బీసీలు, మైనార్టీలకు..

బీసీలు, మైనార్టీలకు..

గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు సీఎంగా ఉండగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏమైనా పదవులు ఇచ్చారా అని జయరాం ప్రశ్నించారు. కానీ సీఎం జగన్‌ మాత్రం బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేశారని గుర్తుచేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాయల ఫకీర్ అని ధ్వజమెత్తారు. అందరికీ సమన్యాయం చేశారని తెలిపారు

బెంజ్ కారు గిప్ట్ అంటూ..

బెంజ్ కారు గిప్ట్ అంటూ..

ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరు జయరాంపై మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈఎస్ఐ స్కాంలో ఏ-14 నిందితుడు మంత్రి కుమారుడికి కాస్ట్లీ కారు కొనిచ్చారని ఆరోపణలు చేశారు. మంత్రి కుమారుడు ఈశ్వర్‌కు.. తెలకపల్లి కార్తీక్ కారు అందజేసిన ఫోటోలను మీడియాకు చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపరులపై ఫిర్యాదు చేసేందుకు ప్రేవేశపెట్టిన 11440కు లైవ్‌లో కాల్ చేసి మంత్రి కుమారుడు ఈశ్వర్‌పై ఫిర్యాదు చేశారు.

Recommended Video

YSRCP Social Media Cadre Opposing The Joining Of TDP Leader Jupudi Prabhakar In The Party
జయరాం కౌంటర్

జయరాం కౌంటర్


ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టయిన ఏ-14 నిందితుడు కార్తీక్ అని అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈశ్వర్ బర్త్ డే రోజున బెంచ్ కారు ఇచ్చారని, దానికి సంబంధించిన ఫోటోలను చూపారు. కారును ఎందుకు గిప్ట్‌గా ఇచ్చారో మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ-14 కార్తీక్.. మంత్రి జయరాంకు బినామీ అని ఆరోపించారు. అందుకోసమే పుట్టినరోజు సాకు చూపి.. మంత్రికి లంచం ఇచ్చారని ఆరోపించారు. వాస్తవానికి కార్మిక శాఖలో అవినీతికి పాల్పడింది మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కాదని.. మంత్రి జయరాం అని ఆరోపించారు. దీనిపై మంత్రి జయరాం కౌంటర్ ఇచ్చారు.

English summary
take a photo beside train, helicopter those are ours minister jayaram asks ayyannapatrudu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X