విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మొద్దు శ్రీను హంతకుడు మృతి... ఓ సాధారణ లారీ క్లీనర్.. అనూహ్యంగా క్రైమ్ వరల్డ్‌ లోకి...

|
Google Oneindia TeluguNews

జూలకంటి శ్రీనివాస రెడ్డి అలియాస్ మొద్దు శీను హత్య కేసులో దోషి మల్లెల ఓం ప్రకాష్ అనారోగ్యంతో మృతి చెందాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను... సోమవారం(జూలై 27) ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుది శ్వాస విడిచాడు. ఓ సాధారణ లారీ క్లీనర్‌గా మొదలైన ఓం ప్రకాష్ ప్రస్థానం.. ఆ తర్వాత దొంగతనాలు,హత్యల వరకూ వెళ్లింది. మొద్దు శ్రీను హత్యతో తెలుగు రాష్ట్రాల్లో అతని పేరు మారుమోగిపోయింది. అలాంటి ప్రకాష్ క్రైమ్ బ్యాక్ గ్రౌండ్‌ను ఈ సందర్భంగా ఒకసారి పరిశీలిద్దాం.

Recommended Video

వామ్మో.. ఇది ఆటోనా.. ఎంతమందిని ఎక్కించావు నాయనా..! (వీడియో)
నవంబర్ 8,2009...

నవంబర్ 8,2009...

పరిటాల రవి హత్య కేసులో అనంతపురం జైల్లోని యమునా బ్యారక్స్‌లో శిక్ష అనుభవిస్తున్న మొద్దు శ్రీనును... అదే బ్యారక్స్‌లో శిక్ష అనుభవిస్తున్న ఓం ప్రకాష్ నవంబర్ 8,2009 ఉదయం 4.40గం. ప్రాంతంలో హత్య చేశాడు. డంబుల్స్‌తో శ్రీను తలపై విచక్షణారహితంగా దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. ఈ హత్య జరిగిన రెండేళ్లకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి కేవి విజయ కుమార్ ఓం ప్రకాష్‌కు జీవిత ఖైదు విధించారు. 2016 నుంచి అతను విశాఖపట్నం సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.

మొద్దు శ్రీనును ఎందుకు హత్య చేశాడు..?

మొద్దు శ్రీనును ఎందుకు హత్య చేశాడు..?

ఓం ప్రకాష్ మూడు హత్య కేసులతో పాటు ఒక దోపిడీ కేసులో అనంతపురం జైలుకు వెళ్లాడు. అక్కడ శ్రీను,ప్రకాష్ ఒకే బ్యారక్‌లో ఉండటంతో... ఇద్దరి మధ్య తరుచూ వివాదాలు,గొడవలు తలెత్తినట్లు జైలు అధికారులు అప్పట్లో వెల్లడించారు. శ్రీను త్వరగా నిద్రపోయేవాడని,కానీ ఓం ప్రకాష్ మాత్రం పుస్తకాలు చదువుకునేందుకు,రామకోటి రాసుకునేందుకు లైట్ ఆన్ చేసి ఉంచేవాడని... దీంతో లైట్ విషయంలో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవ జరిగిందని అప్పట్లో అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో శ్రీను ఓసారి ఓం ప్రకాష్‌ను చెంపదెబ్బ కూడా కొట్టాడని చెప్పారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఓం ప్రకాష్ మొద్దు శ్రీనును హత్య చేశాడన్న ప్రచారం ఉంది. అయితే ఇది రాజకీయ హత్య అని,దీని వెనకాల కొంతమంది రాజకీయ నేతల హస్తం ఉందన్న ఆరోపణలు కూడా అప్పట్లో బలంగా వినిపించాయి.

సాధారణ లారీ క్లీనర్... రాజకీయాల్లోకి కూడా...

సాధారణ లారీ క్లీనర్... రాజకీయాల్లోకి కూడా...

చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన మల్లెల ఓం ప్రకాష్ మొదట్లో ఓ సాధారణ లారీ క్లీనర్. ఏడో తరగతి వరకు చదువుకున్న ఓం ప్రకాష్... చిన్న వయసులోనే కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. ఇద్దరు పిల్లల తండ్రి అయిన ప్రకాష్... రాజకీయాల్లోకి కూడా వచ్చే ప్రయత్నం చేశాడు. 2000 సంవత్సరంలో మదనపల్లె మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరుపున తన భార్య శ్యామలకు టికెట్ ఇప్పించుకున్నాడు. కానీ ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు.

అలా దోపిడీ దొంగగా,హంతకుడిగా మారాడు....

అలా దోపిడీ దొంగగా,హంతకుడిగా మారాడు....


సాధారణ లారీ క్లీనర్‌గా పనిచేస్తున్న ఓం ప్రకాష్.. ఓసారి 'జిలకర' లోడ్‌ను దొంగలించడం ద్వారా దోపిడీ దొంగగా అవతారమెత్తాడు. జిలకర లోడ్‌తో గుజరాత్‌ వెళ్తున్న ఓ లారీ నుంచి ఆ గూడ్స్‌ని దొంగిలించాడు. ఆ తర్వాతి కాలంలో లారీ డ్రైవర్లపై దాడులు చేసి ఆ వాహనాలను తీసుకెళ్లి కర్ణాటకలో అమ్మేసేవాడు. ఈ క్రమంలో ఓ లారీ డ్రైవర్,ప్యాసింజర్,క్లీనర్‌ను హత్య చేశాడు. పరమ దైవ భక్తి కలిగిన ఓం ప్రకాష్... తాను నేరం చేసే ప్రతీసారి దైవాన్ని ప్రార్థించేవాడని చెబుతారు. ఓం ప్రకాష్‌కు విపరీతమైన దైవ భక్తి ఉండేదని అతని కుటుంబ సభ్యులు కూడా పలుమార్లు వెల్లడించారు.

English summary
Mallela Om Prakash,who was murdered Moddu Srinu alias Julakanti Srinivas Reddy was died on Monday with some kidney related disease in KGH in Vishakapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X