విశాఖ స్టీల్ ప్లాంట్ కు మోడీ మార్క్ షాక్ .. ప్రైవేటీకరణపై ఆయన తాజా వ్యాఖ్యల ఆంతర్యం అదే !!
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని మోడీ స్పష్టం చేశారా ? ఎవరెన్ని ఉద్యమాలు చేసినా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కు తగ్గేలా లేదా ? తాజా పరిణామాలు , స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్రం వేస్తున్న అడుగులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయా ? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది .
ఏపీ బీజేపీలో అంతర్మధనం ... విశాఖ స్టీల్ ప్లాంట్ వివాదంతో సహా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలే కారణం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కు తగ్గని కేంద్రం
విశాఖ ఉక్కు కర్మాగారంపై ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గే అవకాశాలు కనిపించటం లేదు . తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ తప్పదని ప్రధాని నరేంద్రమోడీ చాలా స్పష్టంగా చెప్పారు . ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించినప్పటి పరిస్థితులు వేరు , ప్రస్తుత పరిస్థితులు వేరని మోడీ పేర్కొన్నారు . యాభై , అరవై ఏళ్ళ నాటి పరిస్థితులు ఇప్పుడు లేవన్న మోడీ ప్రస్తుతం దేశం అవసరాలు కూడా మారుతూ వచ్చాయని , ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటం కోసం నిధులు కేటాయిస్తూ పోతే దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతుందని ఆయన పేర్కొన్నారు .

నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేమని స్పష్టం చేసిన మోడీ
వారసత్వంగా వస్తున్నాయని , దశాబ్దాల నాటినుండి ఉన్న సంస్థలని ఏదో ఒక కారణంతో వాటిని నడపలేమని స్పష్టం చేశారు . కొంతమందికి మాత్రమే ఉపయోగపడే ప్రభుత్వ సంస్థలను నడపలేమని చెప్పారు. అంతేకాదు ప్రజా సంక్షేమం , ప్రజా వికాసం మాత్రమే ప్రభుత్వం ముందున్న లక్ష్యం అని నరేంద్ర మోడీ స్పష్టంగా చెప్పారు.
ఇప్పటికే మోడీ హయాంలో నష్టాల్లో ఉన్న చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇక తాజా వ్యాఖ్యలను బట్టి మోడీ సర్కార్ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చాలా కచ్చితమైన అభిప్రాయంతో ఉందని తెలుస్తుంది .

విశాఖ ఉక్కు కర్మాగారానికి మోడీ వ్యాఖ్యలు వర్తిస్తాయని చర్చ
ఆర్థిక సంస్కరణలను వేగంగా అమలు చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ పోతుంది. ఇదే సమయంలో చాలా సంస్థలను ప్రైవేట్ పనిచేస్తోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంలో భాగంగా విశాఖ ఉక్కు కర్మాగారం కూడా ప్రైవేటీకరణ కావడం తప్పదని అర్థమవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల ఆంతర్యం కూడా అదే అన్న భావన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పేరుతో పొలిటికల్ హై డ్రామా .. అందరికీ కేంద్రం అంతర్యం తెలుసు
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎన్ని నినాదాలు చేసినా , ఎంతగా ఉద్యమించినా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాబోతుంది అన్నది మోడీ వ్యాఖ్యలతో మరోమారు స్పష్టంగా తెలుస్తుంది . మోడీ తాజా వ్యాఖ్యలు అందుకు బలం ఇస్తున్నాయి . ఈ విషయంలో కేంద్రం తీరు ఏపీలోని రాజకీయ పార్టీలకు స్పష్టంగా అర్ధం అవుతున్నా, రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావటానికి ఉద్యమం చేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు . విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేరం మీదంటే మీది అంటూ ఒకరిపై ఒకరు మోపే ప్రయత్నం చేస్తున్నారు . కేంద్రం ఆంతర్యం తెలిసినా హైడ్రామాలు ఆడుతున్నారు.