విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ రాజధానిగా నో అన్న నేవీ? జగన్ కు హెచ్చరికలు జారీ చేసిందా?

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ మోఃన్ రెడ్డి విశాఖ ను పరిపాలనా రాజధానిగా మార్చాలని, అక్కడ నుండి పాలన సాగించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఏపీలో ఉగాది నుండి విశాఖ వేదికగా పాలన సాగించాలని చూస్తున్న సీఎం జగన్ కు నేవీ షాక్ ఇచ్చిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత బోండా ఉమా. ఇప్పుడు ఆయన వ్యాఖ్యల నేపధ్యంలో విశాఖ రాజధానిగా మారుతుందా లేదా అన్న చర్చ ఏపీలో కొనసాగుతుంది.

సీఎం జగన్ పాలనలో ఆ అక్రమాలపై కూడా సిట్ వెయ్యండి : బోండా ఉమా డిమాండ్ సీఎం జగన్ పాలనలో ఆ అక్రమాలపై కూడా సిట్ వెయ్యండి : బోండా ఉమా డిమాండ్

రాజధానిగా విశాఖను మారిస్తే రక్షణ సమస్యలు ?

రాజధానిగా విశాఖను మారిస్తే రక్షణ సమస్యలు ?

నేవీ అధికారులు విశాఖ రాజధానిగా పనికి రాదనీ, రాజధానిగా విశాఖను మారిస్తే రక్షణకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని సీఎం జగన్ కు హెచ్చరికలు జారీ చేశారని బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో ఆసక్తికర చర్చకు కారణం అవుతున్నాయి. సీఎం జగన్ ఏ క్షణంలో అయినా అమరావతి నుంచి సచివాలయాన్ని విశాఖలోని మిలీనియం టవర్స్ కు తరలించే ఆలోచనలో ఉన్నారని సీఎం తాజా నిర్ణయాలతో తెలుస్తుంది.

నేవీ అధికారులు రాజధానిగా విశాఖకు నో చెప్పారన్న టీడీపీ నేత

నేవీ అధికారులు రాజధానిగా విశాఖకు నో చెప్పారన్న టీడీపీ నేత


అధికార వికేంద్రీకరణ జరిగితేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావించి పరిపాలన రాజధానిగా విశాఖను ఏర్పాటు చెయ్యటానికి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే రాజధానిగా విశాఖను ఏర్పాటు చేసి తీరుతామని ఇప్పటికే ప్రకటించిన సీఎం జగన్ కు నేవీ అధికారులు రాజధానిగా విశాఖకు నో అని చెప్పారని బోండా ఉమా బాంబ్ పేల్చారు .

దేశ రక్షణ కార్యాలయాలు వైజాగ్ లో

దేశ రక్షణ కార్యాలయాలు వైజాగ్ లో

అయితే, విశాఖను పరిపాలన రాజధానిగా మార్చేందుకు నేవి అభ్యంతరాలు చెప్పినట్టుగా టీడీపీ నేత పేర్కొన్నారు. దేశ రక్షణకు సంబంధించిన అనేక కార్యాలయాలు, నేవికి సంబంధించిన పరిశోధన సంస్థలతో పాటు ఐఏఎస్ కళింగ, జలాంతర్గాముల తయారీ కేంద్రాలు అన్ని విశాఖలోనే ఉన్నాయని పేర్కొన్న నేవీ విశాఖ రాజధానిగా సురక్షిత ప్రాంతం కాదని చెప్తున్నట్టు తెలుస్తుంది.

 సీఎం జగన్ కు నేవీ హెచ్చరిక .. బోండా ఉమా వ్యాఖ్యలు వైరల్

సీఎం జగన్ కు నేవీ హెచ్చరిక .. బోండా ఉమా వ్యాఖ్యలు వైరల్

అందుకు కారణం ఒకవేళ విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం మొత్తం జనాలతో నిండిపోతుంది. దీని వలన దేశరక్షణకు సంబంధించిన అనేక సమస్యలు తలెత్తుతాయని భద్రత కొరవడుతుంది అని అందుకే నేవి పరిపాలన రాజధానిగా అభ్యంతరాలు తెలిపిందని టిడిపి నేత బోండా ఉమా పేర్కొన్నారు. నేవి హెచ్చరికలతోనే జగన్ ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గారని బోండా ఉమా చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఇక ఈ వ్యాఖ్యల్లో ఎంత నిజం ఉందో వైసీపీ నేతలు చెప్పాల్సి ఉంది.

English summary
The TDP leader Bonda uma said that the Navy objected to making Vishakha as the administrative capital. Many of the country's defense offices, Navy research institutes, and the IAS Kalinga and submarine facilities are all located in Vizag. so, navy warned jagan not to establish capital in vishakha said bonda uma .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X