విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అరకు ఎమ్మెల్యే కిడారిసర్వేశ్వర్ రావు , సివేరి సోమల హత్యకేసులో చార్జ్ షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ

|
Google Oneindia TeluguNews

ఎవరూ ఊహించని రీతిలో మావోయిస్టుల ఘాతుకానికి బలై తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసు ..అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, టీడీపీ నేత సివేరి సోమల హత్య కేసు.. ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు . శుక్రవారం సాయంత్రం ఎన్ఐఏ కోర్టులో ఎమ్మెల్యే హత్యకు సంబంధించి అభియోగాలతో కూడిన చార్జిషీట్ ను దాఖలు చేశారు..

వివేకా హత్యకేసు..సాక్ష్యాలు తారుమారు వ్యవహారంలో గంగి రెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్ వివేకా హత్యకేసు..సాక్ష్యాలు తారుమారు వ్యవహారంలో గంగి రెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్

 సానుభూతిపరుల సమాచారంతోనే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, టీడీపీ నేత సివేరి సోమల హత్య .. ఎన్ఐఏ చార్జ్ షీట్

సానుభూతిపరుల సమాచారంతోనే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, టీడీపీ నేత సివేరి సోమల హత్య .. ఎన్ఐఏ చార్జ్ షీట్

ఇక ఎన్ ఐఏ దాఖలు చేసిన చార్జ్ షీట్ లో సానుభూతిపరుల సమాచారంతోనే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, టీడీపీ నేత సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేసినట్లు ఎన్ఐఏ అధికారులు నిర్ధారించారు. ముగ్గురిపై అభియోగాలు చేస్తూ చార్జిషీట్ దాఖలు చేశారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన ఎద్దుల సుబ్బారావు, భీమిలి శోభన్, కమలలపై ఎన్ఐఏ ఈ చార్జ్ షీట్ లో అభియోగాలు మోపింది. పక్కా రెక్కీ నిర్వహించి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు సంబంధించి కదలికలను ఎద్దుల సుబ్బారావు మావోయిస్టులకు చేరవేసేవాడని చార్జిషీట్ లో పేర్కొన్నారు.

మావోలకు సమాచారం ఇచ్చిన ముగ్గురి పేర్లను చార్జ్ షీట్ లో పేర్కొన్న ఎన్ఐఏ

మావోలకు సమాచారం ఇచ్చిన ముగ్గురి పేర్లను చార్జ్ షీట్ లో పేర్కొన్న ఎన్ఐఏ


మావోయిస్టులతో టచ్‌లో ఉండి కిడారి కదలికలను సుబ్బారావు ఎప్పటికప్పుడు వారికి తెలిపేవాడని తేల్చారు. సానుభూతిపరులు ఇచ్చిన సమాచారంతోనే కిడారితో పాటు సోమును టార్గెట్ చేసి హత్యచేశారు.ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళిన వారిని గత ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోములను మావోయిస్టులు కాల్చి చంపారు. ఒడిశా సరిహద్దుకు 15 కిమీ దూరంలో ఈ ఘటన జరిగింది. ఇక ఈ కేసులో ఎన్ ఐ ఏ విచారణ జరిపి దాఖలు చేసిన చార్జ్ షీట్ లో విశాఖపట్నంలోని కరకవాని పాలెం గ్రామానికి చెందిన వెంకట రవి చైతన్య అలియా (42), తూర్పు గోదావరిలోని దబ్బపాలెం గ్రామానికి చెందిన జలుమూరి శ్రీను బాబు అలియాస్ రైనో అలియాస్ సునీల్ (40), పశ్చిమ గోదావరిలోని భీమావరం పట్టణానికి చెందిన కామేశ్వరి అలియాస్ చంద్రిక అలియాస్ స్వరూప (40), తూర్పు గోదావరిలోని బురదకోట గ్రామానికి చెందిన జప్పిరాయింగి సత్తి బాబు అలియాస్ దాసు అలియాస్ బాబు అలియాస్ సుదర్శన్ (52) ల పేర్లు ఉన్నాయి , ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నారు. వీరు ఎమ్మెల్యే కిడారి, , మాజీ ఎమ్మెల్యే సోములను లివిటి‌పుట్ గ్రామానికి వెళ్తుండగా వాహనాలనుఆపి కాల్పులకు దిగి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇద్దర్నీ చంపారు. అక్కడ సిగ్నల్ సమస్య ఉండటంతో ఘటన ఎలా జరిగిందనే విషయంపై దర్యాప్తుకు చాలా సమయం పట్టింది. చివరకు కేంద్రం ఈ కేసును ఎన్ఐఏ కు అప్పగించింది.

టీడీపీ నేతల కాల్ డేటాలో దొరికిన సానుభూతిపరులు .. ఇంకా కొందరిని విచారిస్తున్న ఎన్ఐఏ

టీడీపీ నేతల కాల్ డేటాలో దొరికిన సానుభూతిపరులు .. ఇంకా కొందరిని విచారిస్తున్న ఎన్ఐఏ

ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎహ్మెల్యే సివేరి సోమల హత్యకు సంబంధించి కొందరు నేతలు మావోయిస్టులకు సమాచారం ఇచ్చారని పోలీసులు అనుమానించారు. అందులో భాగంగా పలువురు టీడీపీ నేతల కాల్ డేటాను విశ్లేషించారు. అందులో భాగంగా మాజీ ఎంపీటీసీ సుబ్బారావుతో సహా మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. చివరకు ఎద్దుల సుబ్బారావు, భీమిలి శోభన్, కమలలపై ఎన్ఐఏ అభియోగాలు మోపింది. వారే కిడారి సర్వేశ్వర్ రావు , సోముల సమాచారం మావోలకు ఇచ్చారని వీరు ఇచ్చిన సమాచారంతోనే పక్కా ప్లాన్ తో దాడి చేసి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్ రావు ను . సివేరి సోములను కాల్చి చంపారు మావోలు .

English summary
The National Investigation Agency (NIA) on Wednesday filed a charge-sheet before special court for NIA cases in Vijayawada against three CPI (Maoist) sympathizers, including a woman in connection with the murder of Araku MLA Kidari Sarveshwara Rao and former MLA Siveri Soma in 2018 near Livitiputtu village in Visakhapatnam.The three sympathizers include- Yedala Subba Rao (45), Gemmili Sobhan (32) and Korra Kamala (35), all native of Visakhapatnam.In the charge-sheet, the NIA said the four Maoist cadres – Venkata Ravi Chaitanya alias Aruna (42) of Karakavanipalem village in Visakhapatnam, Jalumuri Srinu Babu alias Raino alias Sunil (40) of Dabbapalem village in East Godavari, Kameswari alias Chandrika alias Swarupa (40) of Bhimavaram Town in West Godavari and Jappirayingi Satti Babu alias Dasu alias Babu alias Sudarshan (52) of Buradakota village in East Godavari were absconding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X