విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందుకే ఇలాంటి ప్రమాదాలు: విశాఖ గ్యాస్ లీకేజీపై రాజకీయాలు వద్దంటూ పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

అమరావతి: విశాఖపట్నం పరిధిలోని ఎల్జీ పాలిమార్స్ లో విష వాయువులు విడుదలై ప్రజలు భీతావహులు అయిన విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ దుర్ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారని.. వారందరికి ధైర్యం చెప్పాలని జనసేన నాయకులు, శ్రేణులకు పిలుపునిచ్చారు. ఒక్కసారిగా ఇళ్లు వదిలి బయటకు వచ్చేశారు... కల్యాణ మంటపాల్లోనో, సమావేశ మందిరాల్లోనో భోజన, వసతి సదుపాయం కల్పించి అండగా ఉండాలన్నారు.

తీరని వేదన: విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై విజయశాంతి ఏమన్నారంటే?తీరని వేదన: విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై విజయశాంతి ఏమన్నారంటే?

సాయమందించండి..

సాయమందించండి..

ఆసుపత్రుల దగ్గర హెల్ప్ సెంటర్స్ ఏర్పాటు చేసి విష వాయువులు పీల్చి ఇబ్బందిపడుతున్న రోగులకు వైద్యులు, అధికారులతో సమన్వయం చేసేలా సహాయపడాలని జనసేనాని శ్రేణులకు చెప్పారు. గురువారం మధ్యాహ్నం ఎల్జీ పాలిమర్స్ ఘటనపై పార్టీ ప్రధాన కార్యదర్శులు, విశాఖపట్నం జిల్లా నాయకులు, అధికార ప్రతినిధులతో పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఘటన వివరాలపై చర్చించారు. ఈ కాన్ఫరెన్స్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

రాజకీయాలు వద్దు.. అండగా ఉందాం

రాజకీయాలు వద్దు.. అండగా ఉందాం

ఇలాంటి సమయంలో మనం రాజకీయాలు గురించి మాట్లాడకూడదు. విష వాయువుల ప్రభావంతో ఆందోళనలో ఉన్న ప్రజలను సాధారణ స్థితికి తెచ్చేందుకు అవసరమైన చర్యల్లో పాల్గొనడం మన బాధ్యత. విశాఖపట్నం ప్రాంత జనసేన నాయకులు, శ్రేణులు స్పందించిన విధానం అభినందనీయం. భయకంపితులైన ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో యంత్రాంగానికి సేవలు చేశారు. ఇదే రీతిలో ఈ ఘటన తాలూకు బాధితులకు అండగా నిలవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

Recommended Video

Vizag Gas Leak : Pawan Kalyan Response On Vizag Gas Tragedy
అందుకే ఇలాంటి దుర్ఘటనలు..

అందుకే ఇలాంటి దుర్ఘటనలు..


జనసేన పారిశ్రామికీకరణకు, అభివృద్ధికీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు. అయితే పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వాటి పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు పారిశ్రామికీకరణలో భాగంగా ఉన్నాయి. వాటిని అమలు చేయడంలో, సేఫ్టీ ఆడిట్ విషయంలో శ్రద్ధ చూపడం లేదు. కాలుష్య నియంత్రణ మండలి, పర్యవేక్షణ విభాగాలు ప్రభావవంతంగా పని చేయడం లేదు. అందుకే ఇలాంటి దుర్ఘటనలు సంభవిస్తున్నాయి. విశాఖ పర్యటన సమయంలోనూ ఈ ప్రాంతంలో పరిశ్రమల నుంచి వస్తున్న వాయువులు, కాలుష్యం వల్ల తలెత్తుతున్న సమస్యలను తెలియచేస్తూ వీటిపైనా దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ అన్నారు.

English summary
No politics: pawan kalyan on vizag gas leak incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X