విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Nutan naidu: ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరి నుంచి రూ.12 కోట్లు వసూల్..?

|
Google Oneindia TeluguNews

నూతన్ నాయుడు.. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా ఎంత పేరు గడించాడో.. శిరోముండనం ఘటనతో అంతే లైమ్ లైట్‌లోకి వచ్చారు. దాదాపుగా జనాలు అందరికీ తెలిసిపోయారు. అయితే శిరోముండనం ఘటన తర్వాత నూతన్ నాయుడు చేసిన మోసాలు కూడా వెలుగుచూస్తున్నాయి. బ్యాంక్ ఉద్యోగాల పేరుతో భారీగా నగదు వసూల్ చేసినట్టు తెలిసింది. అదీ కూడా రూ.కోట్లలో వసూల్ చేయడం కలకలం రేపుతోంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శిరోముండనంఘటనలో కస్టడీలో ఉన్న ఆయన మోసం కేసులో కూడా విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు.

Recommended Video

Nutan Naidu: శిరోముండనం ఘటన తర్వాత Bigg Boss Fame నూతన్ చేసిన మరిన్ని మోసాలు వెలుగులోకి...
వ్యాపారంలో పరిచయం.. క్యాష్ చేసుకొని..

వ్యాపారంలో పరిచయం.. క్యాష్ చేసుకొని..

విశాఖపట్టణం జిల్లా రావికమతానికి చెందిన నూకరాజు, తెలంగాణలోని చేవెళ్లకు చెందిన శ్రీకాంత్ రెడ్డి స్నేహితులు. నూకరాజు సీసీ కెమెరాలు, శ్రీకాంత్ రెడ్డి స్ధిరాస్తి వ్యాపారం చేసేవారు. వీరికి నూతన్ నాయుడితో పరిచయం ఏర్పడింది. వారి వద్ద డబ్బు ఉంది అని నూతన్ నాయుడు గ్రహించాడు. ఎస్బీఐలో మంచి ఉద్యోగాలు అని బురిడీ కొట్టించాడు. దక్షిణ భారత రీజియన్ డైరెక్టర్ పోస్టు కోసం శ్రీకాంత్ రెడ్డి రూ.12 కోట్లు, ఉద్యోగం కోసం నూకరాజు రూ.5 లక్షలు ఇచ్చారు. అయితే తమ జాబ్ గురించి అడిగితే అప్పుడు.. ఇప్పుడు అని కాలం వెళ్లదీశారు. అలా రెండేళ్లు గడిచిన.. వారి ఉద్యోగాలు రాలేదు.

అక్షరాల రూ.12 కోట్ల 5 లక్షలు....

అక్షరాల రూ.12 కోట్ల 5 లక్షలు....


దీంతో ఇటీవల శిరోముండనం ఘటన జరగడం.. నూతన్ నాయుడు పారిపోవడంతో వారికి అనుమానం వచ్చింది. తమకు ఉద్యోగం దక్కదని గ్రహించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే శ్రీకాంత్ రూ.12 కోట్లు ఇచ్చానని చెబుతుండటంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంత మొత్తంలో ఇచ్చే కెపాసిటీ శ్రీకాంత్‌కు ఉందా అని ఆరాతీస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని మహారాణిపేట పోలీసులు తెలిపారు. అయితే వ్యవహారంలో నూతన్ నాయుడికి సహకరించిన శశికాంత్ అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. శిరోముండనం కేసులో అరెస్టైన నూతన్ నాయుడిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తారు. అతనిపై ఛీటింగ్ కేసు కూడా విచారణ చేస్తామని చెబుతున్నారు.

శిరోముండనం ఘటనతో..

శిరోముండనం ఘటనతో..


విశాఖపట్టణం సుజాతనగర్‌లో బిగ్ బాస్ ఫేం నూతన్‌ నాయుడు దంపతులు ఉంటున్నారు. ఇతని వద్ద గిరిప్రసాద్ నగర్‌కి చెందిన కర్రి శ్రీకాంత్ పనిచేసేవాడు. 4 నెలలు పనిచేసి.. ఇటివలే మానేశాడు. దీంతో నూతన్ నాయుడు మనుషులు.. అతని పిలిచి మాట్లాడారు. గతంలో ఇంటికి వచ్చిన బ్యూటీషియన్‌ సెల్‌ఫోన్‌ హ్యాక్‌ చేశారని చెప్పారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారని కూడా తిట్టిపోశారు. సెల్ ఫోన్ పోయిందని నెపం వేశారు. తర్వాత మంగళిని పిలిపించి.. గుండు కొట్టించారు. తర్వాత శ్రీకాంత్‌ పెందుర్తి పోలీసులకు శిరోముండనం ఘటన గురించి ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఏడుగురిని అరెస్ట్ చేయగా.. తాజాగా నూతన్ నాయుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

English summary
Nutan naidu cheat two men for offer jobs. collected rs 12.05 crore in that person.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X