విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Nutan naidu: విలువలు, నైతిక హక్కులు ఏవీ, శిరోముండన ఘటనపై నెటిజన్ల ప్రశ్నలు

|
Google Oneindia TeluguNews

నూతన్ నాయుడు.. నిర్మాత, నటుడు, వైసీపీ నేత.. కానీ బిగ్ బాస్ వల్ల ప్రపంచానికి తెలిశాడు. ఇక అందులో నీతులు, విలువల గురించి చెప్పేశాడు. తోటి కంటెస్టెంట్ కౌశల్‌తో మంచి, మనస్తత్వం, వ్యక్తిత్వం తొక్క, తోటకూర అంటూ తెగ హడావిడి చేశాడు. బిగ్ బాస్ చూసిన తెలుగు ప్రేక్షకులకు ఇవన్నీ గుర్తుండే ఉంటుంది. అయితే ఆయన ఇంట్లో.. ఓ దళిత యువకుడికి శిరోముండనం ఘటన కలకలం రేపింది. ఘటన తర్వాత మెల్లగా జారుకున్న నూతన్ నాయుడిని.. పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. దీంతో నూతన్ నాయుడును విమర్శిస్తూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఇదివరకు టీవీ షోలలో.. ఇంటర్వ్యూలలో చెప్పిన నీతి సూత్రాలు ఏమయ్యాయి బాబూ.. అంటూ ప్రశ్నిస్తున్నారు.

నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం: లోకేష్ మండిపాటు, ముగ్గురి అరెస్ట్..నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం: లోకేష్ మండిపాటు, ముగ్గురి అరెస్ట్..

అప్పుడు నీతులు వల్లించి..


బిగ్ బాస్ హౌజ్‌లో మాత్రం నీతులు వల్లించి.. తన ఇంట్లో పనిచేసే వారి వద్ద ఇలా వ్యవహరిస్తారా అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. చెప్పేది శ్రీరంగ నీతులు.. చేసేది ఏంటీ అంటూ ఫైరయ్యారు. చాలా ఇంటర్వ్యూలలో నీతులు, విలువల గురించి మాట్లాడి.. తన ఇంట్లో ఇలా చేయడం ఏంటీ అని విరుచుకుపడ్డారు. మంచి మాటలు చెప్పడానికి పనిచేస్తాయా అంటూ ధ్వజమెత్తారు. అలా చేయడానికి సిగ్గు అనిపించలేదా అని కామెంట్ చేశారు.

ఉడిపిలో నక్కి..

ఉడిపిలో నక్కి..

దళితుడికి శిరోముండనం కేసులో నూతన్ నాయుడును అరెస్టు చేశామని విశాఖపట్టణం పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా వెల్లడించారు. కర్ణాటకలోని ఉడిపిలో అరెస్టు చేశామన్నారు. మధ్యాహ్నాం 2.54కి మధుప్రియకు నూతన్ నాయుడు ఫోన్ చేశారని.. కాల్ డేటా ఆధారంగా నూతన్ నాయుడు అని గుర్తించామన్నారు. నూతన్‌ని ఉడిపి కోర్టులో హాజరుపరిచామని.. తమకు అప్పగించాలని కోర్టును కోరామని పేర్కొన్నారు. అతని వద్ద నుంచి 5 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ట్రాన్సిట్ వారెంట్‌పై విశాఖపట్నం తీసుకొస్తామని సీపీ మనీష్ కుమార్ సిన్హా వెల్లడించారు.

రిటైర్డ్ ఐఏఎస్ పేరుతో ఫోన్లు..

రిటైర్డ్ ఐఏఎస్ పేరుతో ఫోన్లు..


శిరోముండనం కేసులో కాక.. నూతన్ నాయుడు మరికొందరి పేర్లు వాడుకుని మోసాలకు పాల్పడినట్టు తెలిసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరుతో పోలీసులకు ఫోన్లు చేసి బ్లాక్ మెయిల్ చేయాలని చూశారని సీపీ వెల్లడించారు. అయితే పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో దొరికిపోయాడని సీపీ వెల్లడించారు. నూతన్ నాయుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు చేస్తున్నామని వెల్లడించారు. నూతన్ నాయుడు భార్య మధు ప్రియ సహా ఏడుగురిని పెందుర్తి పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

Recommended Video

Kangana Ranaut Slams Shiv Sena MP Sanjay Raut || Oneindia Telugu
ఏం జరిగిందంటే..

ఏం జరిగిందంటే..

విశాఖపట్టణం సుజాతనగర్‌లో బిగ్ బాస్ ఫేం నూతన్‌ నాయుడు దంపతులు ఉంటున్నారు. ఇతని వద్ద గిరిప్రసాద్ నగర్‌కి చెందిన కర్రి శ్రీకాంత్ పనిచేసేవాడు. 4 నెలలు పనిచేసి.. ఇటివలే మానేశాడు. దీంతో నూతన్ నాయుడు మనుషులు.. అతని పిలిచి మాట్లాడారు. గతంలో ఇంటికి వచ్చిన బ్యూటీషియన్‌ సెల్‌ఫోన్‌ హ్యాక్‌ చేశారని చెప్పారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారని కూడా తిట్టిపోశారు. సెల్ ఫోన్ పోయిందని నెపం వేశారు. తర్వాత మంగళిని పిలిపించి.. గుండు కొట్టించారు. తర్వాత శ్రీకాంత్‌ పెందుర్తి పోలీసులకు శిరోముండనం ఘటన గురించి ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఏడుగురిని అరెస్ట్ చేయగా.. తాజాగా నూతన్ నాయుడిని అరెస్ట్ చేశారు.

English summary
Nutan naidu: netizens slams nutan naidu for dalit man incident. where is ethics and values, netizens asked nutan naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X