• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

విశాఖలో ఏర్పాట్లు ముమ్మరం: ఉత్తర్వులు లేకుండానే: ప్రభుత్వ వ్యూహం ఏంటి..!.

|

వికేంద్రీకరణ బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లాయి. విచారణ పూర్తయ్యేదాకా తరలించడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. న్యాయ పరమైన వివాదాలు కొనసాగుతున్నాయి. ఆలస్యం అవుతుందేమో కానీ.. విశాఖ కు పరిపాలనా రాజధాని తరలింపు ఆపటం ఎవరి వల్లా కాదని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇవ్వలేదు. కానీ, ఎక్కడ ఏ కార్యాలయం ఉండాలి...ఎక్కడ ఎవరికి వసతి కల్పించాలనే దాని పైన దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు. తదనుగుణంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రధానంగా ఆంధ్రా యూనివర్సిటీ బంగళాల పైన ప్రభుత్వం ఆరా తీస్తోంది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం మొదలు..ఇతర ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేయాలనే దాని పైన ఒక అంచనాకు వచ్చినట్లు కనిపిస్తోది. ఎక్కడా న్యాయ పరమైన ఉల్లంఘనలు లేకుండా...కొత్త చిక్కులు లేకుండా ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

విశాఖలో కార్యాలయాలకు తుది రూపు..

విశాఖ నుండి పరిపాలనా రాజధాని కొంత ఆలస్యమే కానీ..ఏర్పాటు ఖాయమని ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతున్నారు. దీనిలో భాగంగా..విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు పలు శాఖల అధికారులు సన్నాహాలు చేసుకుంటున్నారు. అధికారికంగా ఎటువంటి ఆదేశాలు లేవంటూనే.. భవనాల కోసం అన్వేషణ మొదలెట్టారు. గవర్నర్‌, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి మంత్రులు, శాఖాధిపతులకు కార్యాలయాల వరకు పలు భవనాలు పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంగా పోర్టు గెస్ట్‌హౌస్ ను ఇప్పటికే పరిశీలించినట్లు తెలుస్తోంది. రుషికొండ సమీపంలో సముద్ర తీరానికి ఆనుకుని ఒక హోటల్‌ నిర్మాణం జరుగుతోంది. అది పూర్తయితే కొంత భాగాన్ని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. తిమ్మాపురం సమీపంలో బావికొండ దిగువన ముఖ్యమంత్రికి శాశ్వత కార్యాలయం నిర్మించే యోచన ఉన్నట్లు సమాచారం. అధికారులు ఈ స్థలాన్ని కూడా పరిశీలించినట్లు సమాచారం.

Officials speed up the action plan in Vizag to set as executive capital

ఏయూ భవనాల వినియోగం పైనా..

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వెంటనే వినియోగానికి వీలుగా ఉన్న భవనాల గురించి అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఉపకులపతి, రిజిస్ట్రార్‌ భవనాలు విశాలంగా ఉండడమే కాకుండా ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత ఇన్‌చార్జి వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి బంగళాకు మారలేదు. పూర్తిస్థాయిలో నియామకం ఖరారయ్యాక అక్కడకు వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ బంగళాల విస్తీర్ణమెంతో వివరాలివ్వాలని ప్రభుత్వం నుంచి ఏయూ అధికారులకు సమాచారం వచ్చినట్లు తెలిసింది. డీజీపీ కార్యాలయం కోసం మధురవాడ పరిసరాల్లో పెద్ద భవంతులు పరిశీలిస్తున్నారు. మారికవలస సమీపంలో ఒక కార్పొరేట్‌ కళాశాల నడుస్తున్న భవనాన్ని ఇటీవల అధికారులు చూసివెళ్లారు. ఇంకా నగరంలోని పలు ప్రైవేటు, ప్రభుత్వ భవనాలను ఆయా విభాగాల ఉన్నతాధికారులు పరిశీలించి ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. అయితే ఏ అధికారీ విశాఖలో కార్యాలయాల పరిశీలన జరుగుతున్నా..ఇవన్నీ ముందస్తు చర్యలే అని..ఎక్కడా న్యాయ పరమైన ఉల్లంఘనలకు అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీటికి సంబంధించి ఎక్కడా అధికారిక ఉత్వర్వులు సైతం ఇవ్వలేదు.

English summary
AP Govt searching for Accomidation for CM and ministers in Vizag. In Rushikonda CM Camp office may established. Andhra University builidings also utilise by the govt for offices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more