• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

భార్గవ్ రేప్ కేసుతో సంబంధం లేదు -ఏడాదిగా అతను కాంటాక్ట్‌లో లేడు: omg నిత్యశ్రీ కీలక సందేశం

|

ఫన్నీ వీడియోలతో తెలుగు రాష్ట్రాల్లోనే కాక అంతర్జాతీయంగానూ పాపులరైన టిక్ టాక్ స్టార్ చిప్పాడ భార్గవ్ అలియాస్ ఫన్ బకెట్ భార్గవ్ దారుణ నేరాలు వెలుగులోకి వచ్చాయి. టిక్ టాక్ లో పరిచయమైన ఓ 14 ఏళ్ల బాలికను, సోషల్ మీడియాలో స్టార్ చేస్తానని, కామెడీ షోల్లో అవకాశాలు కల్పిస్తానని లోబర్చుకున్న భార్గవ్ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడి, గర్భవతిని చేశాడు. ఈ మేరకు నమోదైన కేసులో అతనిని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే బాధితురాలు ఎవరేదానిపై..

చెల్లి అంటూనే రేప్ -బాలికకు గర్భం -నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ -భార్గవ్ గుట్టువిప్పన ప్రేమ్ కాజల్చెల్లి అంటూనే రేప్ -బాలికకు గర్భం -నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ -భార్గవ్ గుట్టువిప్పన ప్రేమ్ కాజల్

బాధితురాలు ఆమేనంటూ..

బాధితురాలు ఆమేనంటూ..

టిక్ టాక్, ఫన్ బకెట్ వీడియోల్లో భార్గవ్ తో పాటు కనిపిస్తూ, ‘ఓ మై గాడ్' బాలికగా పాపులరైంది నిత్య శ్రీ అలియాస్ omg నిత్య. మైనర్ బాలిక అత్యాచారం కేసులో భార్గవ్ అరెస్టు తర్వాత బాధితురాలు నిత్యనే అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోయింది. నిత్య ఫోటోలు, వీడియోలను వాడుతూ ఆమెనే బాదితురాలంటూ పలు యూట్యబ్ చానెళ్లు రూపొందించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో నిత్యశ్రీ నేరుగా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు కీలక సందేశమిచ్చింది. భార్గవ్ కేసుతో సంబంధం లేదంటూ నిత్య ఓ వీడియోను పోస్ట్ చేసింది..

గంటా భార్యను రచ్చలోకి లాగిన వైసీపీ విజయసాయిరెడ్డి -బ్లాక్ టికెట్లతో బతుకు మొదలైందంటూ బాబుపైనాగంటా భార్యను రచ్చలోకి లాగిన వైసీపీ విజయసాయిరెడ్డి -బ్లాక్ టికెట్లతో బతుకు మొదలైందంటూ బాబుపైనా

ఆ మ్యాటర్ నాకు తెలీదు..

ఆ మ్యాటర్ నాకు తెలీదు..

‘‘నేను మీ ముందుకు ఎందుకు వచ్చానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఫన్ బకెట్ భార్గవ్.. మైనర్ అమ్మాయిని రేప్ చేసిన కేసు విషయంలో అరెస్ట్ అయిన మాట నిజమే. కానీ నాకు ఆ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. మీకు ఎలా అయితే సోషల్ మీడియా ద్వారా తెలిసిందో నాక్కూడా అలాగే తెలిసింది. నా ఫాలోవర్స్ నాకు మెసేజ్ చేయడం వల్ల నేను ఆ న్యూస్ చూశాను. చాలామంది నాకు మెసేజ్‌లు చేస్తున్నారు.. ఏం జరిగింది?? అని.. నాకైతే ఏ విషయం తెలియదు.. అసలు నాకు ఆ మ్యాటర్‌కి సంబంధం లేదని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను.

ఆ బాధితురాలు నేను కాదు..

ఆ బాధితురాలు నేను కాదు..

భార్గవ్‌ని చివరిసారిగా కలిసి సంవత్సరం పైనే అయ్యింది. నాకు కాంటాక్ట్‌లో కూడా లేడు. ఇప్పుడు మేం కలిసి వీడియోలు కూడా చేయడం లేదు. మేం హైదరాబాద్‌కి వచ్చేశాం. అయితే ఈ ఇష్యూలో చాలామంది మీమ్స్ చేసేవాళ్లు.. ట్రోలర్స్.. యూట్యూబ్‌ వాళ్లు నా పేరు వాడుతున్నారు. నా ఫొటోలు వాడుతున్నారు. వీళ్లందరూ తెలియక చేస్తున్నారని తెలిసి.. క్లారిటీ ఇస్తున్నా. మీరు నా ఫొటోలు వాడటం లాంటివి కావాలని చేస్తున్నారని అనుకోవడం లేదు. దయచేసి వాటిని డిలీట్ చేయాలని కోరుతున్నా. మీకు రెండు రోజుల్లో అసలు నిజాలు ఏంటో తెలుస్తుంది'' అంటూ నిత్యశ్రీ తన తల్లితో కలిసి వీడియోను విడుదత చేసింది.

English summary
Visakhapatnam City Disha police station ACP Prem Kajal revealed sensational rape case details of Fun Bucket and tiktok fame Bhargav. accused bhargav alleggedly raped a minor girl and made her pregnant, has been arrested. Police also found that bhargav had blackmailed a minor by taking pornographic pictures with a minor as if he was giving her a chance on nearby TV channels. To this extent the accused explained that the case was registered under the posco Act along with the rape.tiktok and fun bucket fame Oh my God girl nitya sri, who was bhargav's duo has clarified on current issues. bhargav alleggedly raped a minor girl and made her pregnant, has been arrested by Visakhapatnam. regardig this issue nitya sri said taht she was not atall involved in this case and requested memurs to not use her pics and videos as victim.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X