• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పవన్ కళ్యాణ్‌కు ఆ కర్మ పట్టలేదు! నేను మీలా గడ్డి తినలేను: సీఎం జగన్, మంత్రులపై జనసేనాని నిప్పులు

|

విశాఖపట్నం: జాతీయ పతాకాన్ని గౌరవించలేని వ్యక్తికి జాతికి సేవ చేసిన వారి విలువ ఏం తెలుస్తుందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. జాతికి సేవలు చేసిన వారిని గౌరవించడం తెలియదా? అంటూ ప్రశ్నించారు. ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబికేసరికి నాకేం తెలియదు అంటూ మాట మార్చారన్నారు. విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో విశాఖ జిల్లా జనసేన కార్యకర్తలతో సమావేశం అయ్యారు.

బీజం పడింది విశాఖలోనే..

బీజం పడింది విశాఖలోనే..

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 2009 నుంచి 2014 మధ్య ఉన్న పరిస్థితుల్లో పార్టీ పెట్టడానికి అంతా భయపడుతున్న సమయంలో మిగిలిన వాళ్లు భయపడే పరిస్థితుల్లో నేను ముందు వచ్చా. ఇప్పుడు పార్టీలు పెట్టిన వారిలో తండ్రులు ముఖ్యమంత్రులు అయితే వారి వారసత్వం నుంచి వచ్చిన వారు ఉన్నారు. నేను ఓ సాధారణ కానిస్టేబుల్ కొడుకుని పార్టీ పెట్టాలి అంటే ఎంత కష్టపడాలి. నేను చేపట్టిన పోరాట యాత్రకు బీజం పడింది విశాఖపట్నంలోనే. సమస్యలను చెప్పడం ఎలా అన్నది నాకు నేర్పింది విశాఖ నగరమేనని వ్యాఖ్యానించారు.

జగన్! నిబద్ధత ఉంటే ఇలా చెయ్యి!; ‘అప్పుడే గొంతు ఎత్తాలి' అనుకున్నానంటూ పవన్ కళ్యాణ్

నేను మీలా గడ్డి తినలేను

నేను మీలా గడ్డి తినలేను

ముఖ్యమంత్రి జగన్ వేల కోట్లు కుంభకోణాలతో కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతుంటే ఎవరూ అడిగే వారు ఉండరు. కానీ పవన్ రాజకీయాల్లో ఉంటాడా., సినిమాల్లోకి వెళ్లిపోతాడా అనేది మాత్రం అడుగుతారు. మనకి డిఫెండ్ చేసుకునే దమ్ము లేదు. నా చుట్టూ ఉన్న వాళ్లే నన్ను ప్రశ్నిస్తుంటే ఏం చేయాలో అర్ధం కావడం లేదు. వాళ్లు అన్ని తప్పులు చేసి డిఫెండ్ చేసుకుంటున్నారు. నేను మీ కోసం పోరాడుతుంటే కనీసం నా కోసం గొంతు కూడా ఎత్తకపోతే ఎలా... అనిపిస్తుంది. రాజకీయాల్లో ఉన్న అంతా వ్యాపారాలు చేసుకోవడం లేదా. భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్ జగన్ రెడ్డి గారికి లేవా, కాంట్రాక్టులు, పాల పరిశ్రమలు లేవా? వ్యాపారాలు లేని వారు ఎంత మంది ఉన్నారు. అంతా పూర్తిగా రాజకీయాలే చేస్తున్నారా? నాకు వ్యాపారాలు చేయాలని ఉన్నా నేను మీలా గడ్డి తినలేను అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్‌కు ఆ కర్మ పట్టలేదు

పవన్ కళ్యాణ్‌కు ఆ కర్మ పట్టలేదు

పవన్ కళ్యాణ్ 100 కోట్లు సంపాదించాలి అంటే సినిమాలు చేస్తే వస్తాయి. మన ప్రత్యర్ధులు ఎవరైనా డబ్బు సంపాదించాలి అంటే కంపెనీలకు సంతకాలు పెట్టాలి. పవన్‌కు మాత్రం ఆ కర్మ లేదు. అవకతవకలు చేయగా వచ్చిన పెట్టుబడులతో వారు వ్యాపారాలు చేస్తూ మనల్ని వెటకారాలు చేస్తున్నారు. బి టీం అనీ... మరోటీ అని అంటున్నారు. మీరంతా మాట్లాడండి. ఎదురు తిరగండి విమర్శలను గట్టిగా తిప్పికొట్టండి. మీరు భయపడితే మనల్ని బతకనివ్వరు. నేను పార్టీ పెట్టిందే సమాజంలో ధైర్యం నింపడానికి. ఎవరో రాజకీయ నాయకులు, గూండాలు వచ్చి మన స్థలాలు లాక్కుపోతూ ఉంటే మనం భయపడతామా? మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏమిటి? తెగించేవాడే సమాజానికి కావాలి.

ప్రధానితో గొడవ పెట్టుకోవడం సరదా కాదు..

ప్రధానితో గొడవ పెట్టుకోవడం సరదా కాదు..

ఇన్ని కేసులు ఉన్న మీరే తెగించి తిరుగుతుంటే ఆశయాల కోసం వచ్చిన మేం తెగించమని ఎందుకు అనుకుంటున్నారు. మీరు మాట్లాడితే మేం మాట్లాడలేమా? నేను ఓటమితో కుంగిపోతా అనుకున్నారు. నేను చాలా మొండివాడిని. ఒక భావజాలాన్ని నమ్మి ముందుకు వెళ్లే వారికి వచ్చే శక్తి వేరే ఉంటుంది. ఓ పర్వతాన్ని ఢీ కొట్టే శక్తి వస్తుంది. 151 మంది మనకి ఓ లెక్కా? 151 ఎమ్మెల్యేల అత్యధిక మెజారిటీ ఉన్న పార్టీ ఒక్క ఎమ్మెల్యే ఉన్న జనసేన పార్టీతో గొడవ పెట్టుకుంది. అంటే ప్రజల్లో బలం ఎవరికి ఉందో ఆలోచించండి. 2014 ఎన్నికల సమయంలో విశాఖ వచ్చినప్పుడు ప్రధాని నా గురించి ఏం మాట్లాడారో మీకు తెలుసు. అలాంటి ఆయనతో గొడవ పెట్టుకోవడం నాకు సరదా కాదు. అందరిలో కోపం ఉంది కాబట్టి ఆ ఆశయం కోసం నేను అంతే బలంగా నిలబడ్డా అని పవన్ కళ్యాణ్ అన్నారు.

వెన్నుపోట్లు పొడిపించుకోవడానికి సిద్ధంగా లేము..

వెన్నుపోట్లు పొడిపించుకోవడానికి సిద్ధంగా లేము..

ప్రజలు నాతో కలసిరాకున్నా, నాకు జేజేలు కొట్టే యువత నాతో నిలబడనప్పటికీ నేను వారితో నిలబడతా. పోరాట యాత్రకు వచ్చిన యువతలో 70 శాతం ఓట్లు వేసినా జనసేనకు 70 సీట్లు వచ్చేవి. నేను 25 ఏళ్లు అని చెప్పేది ఎందుకు అంటే మనుషుల్ని మార్చడానికి అంత సమయం పడుతుంది. వెన్నుపోటు లేకుండా రాజకీయాలు ఉండవు. నాకు గాంధీజీ ఆశయాలు తీసుకువెళ్లాలని ఉన్నా ఈ కుళ్లిపోయిన కుతంత్రాలతో నిండిన సమాజంలో బలంగా ఉండాలి అంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. వెన్నుపోటు పొడుస్తా అంటే పొడిపించుకోవడానికి మేం సిద్దంగా లేమిక్కడ. ఇంత ఓటమి ఎదురుయ్యాక 6 నెలల వరకూ ఎవరూ బయటకు రారు. నేను భగవంతుడు నాకు ఇచ్చిన పనిని సవ్యంగా చేశానా లేదా అని మాత్రమే ఆలోచిస్తా. ఒకసారి ఓ కూల్ డ్రింక్ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా చేశాను. నా గొంతు ప్రజా సమస్యలకు బ్రాండ్ అంబాసిడర్ కావాలి గానీ కంపెనీలకు కాకూడదు అని నిర్ణయించుకున్నాను. ఆ రోజు నాకు ఓట్లతో పని లేదు. నన్ను ఎవరూ అడగరు. అడ్వర్టైజ్ మెంట్లు చేసి వచ్చినా ఎవరూ అడగరు. ఇది నా ఆలోచనా విధానం. మన మార్గం ఇది. జనసేన పార్టీ సామాన్యుడి గొంతు వినిపిస్తుంది. మన వేదికల నుంచి జన సామాన్యం సమస్యలపై గళమెత్తి ప్రశ్నిస్తాం. ఉన్న పరిస్థితుల్లో దెబ్బతిన్నా ఒక అడుగు వెనక్కి వేసినా పది అడుగులు ముందుకు వేస్తాం తప్ప వెనక్కి వేసే వాళ్లం కాదు అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

మీరు నన్ను నమ్మండి...

మీరు నన్ను నమ్మండి...

బైబిల్ వాడి రాజకీయాల్లోకి వస్తారో లేదో గానీ. బైబిల్ తాలూకు సత్యాన్ని పాటించే వ్యక్తిని నేను.. మా స్కూల్ టీచర్ చెప్పింది తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అని హెచ్చింపబడిన వాడు తగ్గింపబడతాడు అని. అది నాకు బాగా గుర్తుండిపోయింది. అనవసర భేషజాలకుపోతే అధఃపాతాళానికి తొక్కేస్తారు. ముందు మన అహంకారం తగ్గించుకోవడానికి తగ్గించుకుంటా. మొన్నటి లాంగ్ మార్చ్ కి మద్దెలపాలెం జంక్షన్ కి వచ్చేసరికి 5 వేల మంది ఉంటారు అనిపించింది. అలాంటిది లక్ష మంది పైచిలుకు జన సమూహం. తిరిగి వచ్చి వీడియో చూస్తే ఆశ్చర్యం కలిగింది.. ఏ ముఖ్యమంత్రి స్థానం దీనికంటే పెద్దది.. ఓడిపోయిన వ్యక్తికి ప్రజా సమస్యల మీద వస్తే ఇంతగా రిసీవ్ చేసుకుంటారు కదా అనిపించింది. అలాగే ఇంత రావడానికి ప్రేరణ ఒక ప్రేమ అనే భావం. మీ అందరికీ ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నా. పార్టీ నిర్మాణం చాలా కష్టమైనది. ఓ కుటుంబ పెద్దకి కుటుంబాన్ని నడపడం ఎంత కష్టమో.. పార్టీని నడపడం అంతే కష్టం. 24 క్యారెట్ల బంగారం ఉంటే నగ చేయలేం... కొంత రాగి కలవాలి. జనసేన మిశ్రమాల లోహం అవ్వాలి గానీ పరిపూర్ణమైన బంగారం అయితే పనికి రాదు. వీళ్లు రాకూడదు వాళ్లు రాకూడదు అంటే కుదరదు.. కానీ పార్టీ తాలూకు ఇంటిగ్రిటీనీ నేను కాపాడుతా.. నేను ఎవర్ని నిలబెట్టినా మీరు నన్ను నమ్మండి అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

ప్రభుత్వానికో హెచ్చరిక

ప్రభుత్వానికో హెచ్చరిక

పాలిటిక్స్ లో ప్రత్యర్ధులు అవసరం ప్రత్యర్ధి లేకపోతే పోరాటం చేసేవారు ఉండరు. అన్ని పార్టీలు బలంగా ఉంటేనే మనం బలంగా ఉంటాం. ఇప్పుడు 150 మంది వాళ్లే అయ్యేసరికి వాళ్లలో వాళ్లే కొట్టుకుంటున్నారు. మొన్నటి మన మీటింగ్ ప్రభుత్వానికి ఓ హెచ్చరిక. ఒళ్లు దగ్గర పెట్టుకుని పాలన చేయండి. కర్నూలు నుంచి లాయర్లు వచ్చి హైకోర్టు కావాలి అంటే జగన్ రెడ్డి గారిని వెళ్లి అడగమన్నాను. కర్నూలుకు కోర్టు మారిస్తే ఆయనకు పులివెందుల నుంచి హాజరయ్యేందుకు దగ్గర అవుతుంది. పులివెందులనే రాజధానిగా మారిస్తే అసలు గొడవే లేకుండా పోతుంది. అక్కడే పెట్టుకొంటారేమో? రాజధాని ఎక్కడ పెట్టాలి అనే అంశం జగన్ రెడ్డి గారికి, బొత్స గారికి రెండు ఆప్షన్లు ఇవ్వాలి అన్నది నా ఉద్దేశం. బొత్స గారిని అడిగితే చీపురుపల్లిలో పెడదాం అంటారు' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

తిరగబడాలి..

తిరగబడాలి..

‘ప్రభుత్వాలు ప్రజల కోసం పని చేయాలి తప్ప, కొన్నికుటుంబాల కోసం కాదు. జనసేన పార్టీ చేపట్టిన లాంగ్ మార్చ్ ను విఫలం చేయడానికి చాలామంది కుయుక్తులు పన్నారు. రకరకాల రూమర్లు సృష్టించారు. కానీ జనసైనికుల నిస్వార్ధమైన శ్రమ, క్రమశిక్షణ వల్ల కార్యక్రమం విజయవంతమైంది. లాంగ్ మార్చ్ కు ముందు రోజు వేదిక నిర్మించకుండా కొంతమంది అధికారులు అడ్డంకులు సృష్టిస్తే, ఆడపడుచులు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు వేదిక వద్దే కూర్చొని అధికారులను అడ్డుకున్నారు. భీమవరం నుంచి వచ్చిన కొంతమంది జనసైనికులు దాదాపు 10 వేల మందికి టీ, బిస్కెట్లు ఉచితంగా అందించారు. ఇలాంటి కమిట్ మెంట్ ఉన్న వ్యక్తుల వల్లే లాంగ్ మార్చ్ వంటి భారీ కార్యక్రమం విజయవంతమైంది. పార్టీపైన, అధ్యక్షుల పైన వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. అంటువంటి ప్రచారంపై తిరగబడాలి. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి వచ్చిన ఆయన ఆశయాలకు అనుగుణంగా జనసైనికులు పని చేయాలి. విభేదాలను పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కష్టపడి పార్టీ విజయం కోసం కృషి చేయాలి' అని పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి శ్రీ సత్య బొలిశెట్టి పాల్గొన్నారు.

English summary
Janasena president Pawan Kalyan hits cm ys jagan and his ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X