విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒక్క దానికే దిక్కు లేదు! మూడు రాజధానులా?: వైఎస్ జగన్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై మంగళవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. సౌతాఫ్రికాకు కూడా మూడు రాజధానులున్నాయన్న జగన్... ఏపీలో కూడా మూడు రాజధానులు ఉంటే తప్పేంటని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.

 ఇక నాశనమే: పవన్ కళ్యాణ్‌పై మాజీ నేత రాజు రవితేజ సంచలన వ్యాఖ్యలు ఇక నాశనమే: పవన్ కళ్యాణ్‌పై మాజీ నేత రాజు రవితేజ సంచలన వ్యాఖ్యలు

ఒక్క అమరావతికే దిక్కు లేదు..

ఒక్క అమరావతికే దిక్కు లేదు..

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. తినడానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే.. కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట. అలాగా, ఒక్క అమరావతి రాజధానికే దిక్కు దివాణం లేదు ఇప్పటి దాక.. మరి జగన్ రెడ్డికి మూడు అమరావతి నగరాలు అసలు అయ్యేనా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

ఇక కమిటీలు ఎందుకు? అంటూ..

ఇక కమిటీలు ఎందుకు? అంటూ..

పాలకుల వలన, రాష్ట్ర విభజన మొదలుకొని, ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అనిశ్చితి, అశాంతి, అభద్రత తప్ప ఇంకేమీ ఒరగలేదని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కమిటీ రిపోర్ట్ రాకమునుపే, జగన్రెడ్డి గారు, మూడు రాజధానులు ప్రకటించే కాడికి , అసలు కమిటీలు వెయ్యడం దేనికి? నిపుణుల్ని అపహాస్యం చెయ్యటం దేనికి?'అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబుతారా?

రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబుతారా?

‘ప్లీనరీలో అమరావతికి ఓకే అన్నందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబుతారా?. మాట తప్పను..మడమ తిప్పను అంటే ఇదేనా?. కేంద్రం అమరావతిని గుర్తించింది. మ్యాప్ లో మార్పు చేసింది. ఏపీ నూతన రాజధానిగా కేంద్రం నోటిఫై చేయాలంటే మూడు ప్రాంతాల్లో దేన్ని నోటిఫై చేయాలి' అని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఎలా సాధ్యం?

ఎలా సాధ్యం?

‘హై కోర్ట్ కర్నూల్ లో ఉంటే శ్రీకాకుళం నుండి కర్నూల్ కి వెళ్లాలా ? అనంతపురం నుండి ఉద్యోగులు విశాఖపట్నం వెళ్లి ఉద్యోగాలు చేయాలా? సామాన్య ప్రజలకు ఏదైనా కోర్టు, లేదా సెక్రటేరియట్ లో పని ఉంటే వెళ్ళటం సాధ్యమయ్యే పనేనా ?' అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

సౌతాఫ్రికా మాదిరి 3 రాజధానులంటూ..

సౌతాఫ్రికా మాదిరి 3 రాజధానులంటూ..

మంగళవారం అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ రాజధానిపై కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి మూడు రాజధానులు ఉండవచ్చు కదా అన్నారు. సౌతాఫ్రికా మాదిరిగా మనకు కూడా మూడు రాజధానులు ఉంటే మంచిదే కదా అన్నారు. సౌతాఫ్రికాలో కూడా మూడు రాజధానులు ఉన్నాయన్నారు. ఒకటి అమరావతి, మరోటి విశాఖపట్నం, ఇంకోటి కర్నూలు అని ప్రతిపాదించారు.

మూడు రాజధానుల్లో..

మూడు రాజధానుల్లో..


మొదటి రాజధాని అమరావతిలో అసెంబ్లీ ఏర్పాటు చేస్తామని, రెండో రాజధాని విశాఖపట్నంలో సచివాలయం, మూడో రాజధాని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని జగన్ చెప్పారు. వారంలో రాజధానిపై నిపుణుల కమిటీ వస్తుందని, ఆ వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సీఎం జగన్ తెలిపారు. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలంటే మూడు రాజధానులు ఉండాలని ఆయన అభిప్రాయపపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్నారు. మూడు రాజధానులు చేయడం వల్ల రాయలసీమ, ఉత్తరాంధ్రకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

English summary
pawan kalyan hits out at ys jagan for 3 capital cities statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X