విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్! నిబద్ధత ఉంటే ఇలా చెయ్యి!; ‘అప్పుడే గొంతు ఎత్తాలి’ అనుకున్నానంటూ పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్రంగా స్పందించారు. జాతీయ పతాకాన్ని గౌరవించలేని వ్యక్తికి జాతికి సేవ చేసిన వారి విలువ ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. జాతికి సేవలు చేసిన వారిని గౌరవించడం తెలియదా? అంటూ నిలదీశారు.

పులివెందులను రాజధాని చేసుకో.. మీకు కలిసివస్తుంది: సీఎం వైఎస్ జగన్‌పై పవన్ కళ్యాణ్ సెటైర్లుపులివెందులను రాజధాని చేసుకో.. మీకు కలిసివస్తుంది: సీఎం వైఎస్ జగన్‌పై పవన్ కళ్యాణ్ సెటైర్లు

ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత పెల్లుబికేసరికి నాకేం తెలియదు అంటూ మాట మార్చారని అన్నారు. మంగళవారం విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో విశాఖ జిల్లా జనసేన కార్యకర్తలతో సమావేశం అయ్యారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

కలాం పేరు మార్చి మీ నాన్న పేరా?

కలాం పేరు మార్చి మీ నాన్న పేరా?

విద్యార్థులకు ఇచ్చే ప్రతిభ పురస్కారానికి అబ్దుల్ కలామ్ పేరు మార్చడం సమంజసం కాదు. దేశానికి మిసైల్ పరిజ్ఞానం ఇచ్చిన మహనీయులు కలాం. ఆయన పేరిట ఉన్న పురస్కారానికి ఏపీ సీఎం వారి నాన్న పేరు ఎలా పెడతారు. మీ నాన్న గారి పేరు చాలా పథకాలకు పెట్టారు కదా. కావాలంటే కొత్త పథకాలకు పెట్టుకోండి అని పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి సూచించారు.

జగన్.. మీకు నిబద్ధత ఉందా?

జగన్.. మీకు నిబద్ధత ఉందా?

‘మీ నాన్న, అమ్మ పేర్లు పెట్టుకోవడమేనా? ప్రకాశం పంతులు లాంటి గొప్పవారి లేవా పెట్టడానికి. కలామ్ పేరు మార్చగానే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసరికి నాకేం తెలియదు అంటున్నారు. అంటే ఎవరికి వాళ్లే ఇష్టానుసారం పని చేస్తున్నారా? మీరు చెప్పే మాటల్లో నిజంగా నిబద్ధత ఉంటే జీవో ఇచ్చిన వారిని తక్షణం సస్పెండ్ చేయండి. సస్పెండ్ చేయలేదు అంటే జాతికి సేవ చేసిన వారికి ఈ ప్రభుత్వం ద్రోహం చేసినట్లే' అని పవన్ కళ్యాణ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు.

మీరే పార్టీ జీవం.. నమ్మితీరాలి..

మీరే పార్టీ జీవం.. నమ్మితీరాలి..

‘అందరం ఒక తల్లి కడుపున పుట్టనప్పటికీ జన సైనికులు అంతా నా అన్నదమ్ములు. నేను పదే పదే ఒక మాట చెబుతాను. నేను పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు నేను నమ్మింది నాయకుల్ని కాదు నా ఆడపడచులు అన్నదమ్ముల్నే. జనసేన పార్టీకి మీరే జీవం. ఇది మనస్ఫూర్తిగా మీరు నమ్మి తీరాలి' అని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు స్పస్టం చేశారు.

అప్పుడే గొంతు ఎత్తాలి అనుకున్నా..

అప్పుడే గొంతు ఎత్తాలి అనుకున్నా..


‘25ఏళ్ల ప్రయాణం చేయడానికి వచ్చానంటే నా అంతిమ లక్ష్యం ఓట్లు కాదు. మార్పే నా అంతిమ లక్ష్యం. తొలి నుంచి నా వ్యక్తిగత్వం మీద దాడులు మాత్రం ఉన్నాయి. వ్యక్తిగతంగా ఇబ్బందులు లేకపోయినా సాటి మనిషి కష్టం నాకు బాధ కలిగిస్తుంది. మొదట డబ్బు సంపాదించి కొద్దిమందికి సాయం చేస్తే తృప్తి వచ్చేస్తుంది అనుకునేవాణ్ని. రోజు రోజుకీ సమస్యలు పెరిగి పెద్దవి అవుతున్నప్పుడు గొంతు ఎత్తాలి అనుకున్నా' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

English summary
Janasena Party president Pawan Kalyan speech in Visakhapatnam cadre meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X