• search
 • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అసలైన పోరాటం పవన్ కళ్యాణ్‍‌దే, విశాఖ ప్లాంట్ సందర్శనకు వచ్చే నెలలో: నాదెండ్ల కీలక వ్యాఖ్యలు

|

అమరావతి: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా అక్టోబర్ నెలలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించి కార్మిక సంఘాలతో సమావేశం కానున్నట్టు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన సమయం ఆసన్నమైందనీ, తెలుగు ప్రజల ఆత్మాభిమానం దెబ్బతినకుండా మన ప్రాంతానికి నష్టం కలిగించకుండా ప్రతి ఒక్కరూ సమష్టిగా పోరాటం చేయాలని నాదెండ్ల కోరారు. ఈ ప్రాంతానికి మేలు చేయాలన్న కోరిక పవన్ కళ్యాణ్‌కు బలంగా ఉందన్నారు నాదెండ్ల.

పవన్ కళ్యాణ్ అప్పుడే ఢిల్లీ పెద్దలతో మాట్లాడారు

పవన్ కళ్యాణ్ అప్పుడే ఢిల్లీ పెద్దలతో మాట్లాడారు

ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా మంగళవారంలో విశాఖపట్నంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ‘విశాఖ ప్రాంతం ప్రజలు ఎప్పటినుంచో ఘనంగా చెప్పుకునే అంశం విశాఖ స్టీల్ ప్లాంట్. గతంలో 32 మంది బలిదానాలతో మొదలైన ఉద్యమం ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని మనమంతా గర్వపడే స్థాయిలో ఆ రోజు ఈ ప్రాంతంలో వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇది మన చరిత్రతో ముడిపడిన అంశంగా మారిపోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని మాత్రం దయచేసి ఇతర ప్రభుత్వ రంగ సంస్థలతో ముడిపెట్టవద్దు. ఇక్కడ చరిత్ర, ప్రజల త్యాగం, తెలుగు వారి ఆత్మాభిమానం అనే అంశాలు ముడిపడి ఉన్నాయన్న అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా గుర్తించాలి. జనవరి 27వ తేదీన కేంద్ర ప్రభుత్వం పాలసీ నిర్మాణంలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా ఫిబ్రవరిలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రకటించారు. ఆ వెంటనే ఫిబ్రవరి 8, 9, 10 తేదీల్లో ఢిల్లీలో పవన్ కళ్యాణ్ పర్యటించి కేంద్ర అగ్ర నాయకత్వాన్ని కలిశారు. ప్రతి సమావేశంలో బలంగా ఒకటే స్టాండ్ తీసుకుని మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పుకోవద్దు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. ఇది పార్టీలకు సంబంధించిన అంశం కాదు. ప్రజలకు సంబంధించిన విషయం అని బలంగా చెప్పారని నాదెండ్ల తెలిపారు.

పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజల భావోద్వేగం తెలిపారు

పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజల భావోద్వేగం తెలిపారు

ఈ రోజుకీ నిర్వాసితులు ఎంతో మంది ఆ రోజుల్లో భూములు ఇచ్చేశాం కనీసం ఉద్యోగం రాలేదు. కుటుంబాలకు కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు. బిడ్డలకు ఉపాధి లేక ప్రాంతానికి ఉపయో గపడని పరిస్థితుల్లో ఈ విధమైన కఠిన నిర్ణయం మమ్మల్ని కలచి వేసింది. కొన్ని రాజకీయ పార్టీలు విచిత్రంగా ఇక్కడొక మాట ఢిల్లీకి వెళ్లి అక్కడొక మాట మాట్లాడుతున్నాయి. ఆ పార్టీ నాయకులు పార్లమెంటులో ఒక రకంగా ప్రవర్తిస్తారు. రాష్ట్ర స్థాయిలో రకరకాల పాదయాత్రలు మొదలు కూడా పెట్టారు. ఇవన్నీ కేవలం ఓట్ల కోసం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం చేసిన ప్రయత్నాలు తప్ప వారి ప్రయత్నంలో నిజాయతీ లేదు. ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఒక నిండు మనసుతో ఏ నాడు ప్రయత్నించింది లేదు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాని కలిశారు. అన్నీ వివరించారు. కేవలం రాష్ట్ర ప్రజల ఆవేదన, భావోద్వేగాన్ని వారికి తెలపాలన్న ఉద్దేశ్యంతోనే ఢిల్లీ వెళ్లి వారికి వినతిపత్రం ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ లో చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించవద్దు అని విన్నవించాం. తర్వాత కేంద్ర మంత్రుల్ని, పార్లమెంటులో పెద్దల్ని కలిశాం. సీనియర్ నాయకుల్ని, సీనియర్ మీడియా మిత్రుల్ని కలిశాం. అందరికీ విన్నవించింది ఒక్కటే ఈ విషయంలో అంతా కలసి రావాలని నాదెండ్ల వెల్లడించారు.

అక్టోబర్‌లో పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శన

అక్టోబర్‌లో పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శన

భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాం కాబట్టి ఆ పార్టీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ అభ్యర్ధనను గౌరవించారు. వారితో చర్చించినప్పుడు మాకు కూడా ఒక నమ్మకం కలిగింది. ఈ అంశంలో కేంద్ర నాయకత్వాన్ని ఒప్పిస్తామన్న నమ్మకం మాకుంది. అదే సమయంలో అకస్మాత్తుగా జీవీఎంసీ ఎన్నికలు వచ్చాయి. పార్టీ పెద్దలతో పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భాల్లో ప్రచారానికి రావాలన్న ఒత్తిడులు వచ్చాయి. స్టీల్ ప్లాంట్ వ్యవహారం నడుస్తున్నప్పుడు కేవలం ఓట్ల కోసం ప్రచారానికి రాకూడదని ఆయన భావించారు. ఒక మంచి నిర్ణయం తీసుకుని, భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో నిజాయితీగా ముందుకు వెళ్దామని ఆ సందర్భంలోనే చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా రెండు రోజుల క్రితం 30 కార్మిక సంఘాలతో చర్చించిన తర్వాత, మా పార్టీ పెద్దలంతా స్థానికంగా తీసుకున్న నిర్ణయం మేరకు వచ్చే నెలలో స్టీల్ ప్లాంట్ సందర్శించి ఈ వ్యవహారంలో జనసేన పార్టీ తరఫున చేసిన ప్రయాణం, భవిష్యత్తులో వారికి ఏ విధంగా అండగా ఉండబోతున్నాం అన్న అంశాలను వివరించనున్నారు.

ఎన్నికల్లో అడుగడుగునా ఏపీ సర్కారు దౌర్జన్యాలు

ఎన్నికల్లో అడుగడుగునా ఏపీ సర్కారు దౌర్జన్యాలు

ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఒక ముఖ్యమైన ఘట్టం. స్వపరిపాలన స్థానిక సంస్థల ఎన్నికలతోనే మొదలవుతుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీగా చాలా బలంగా తన మొదటి అడుగును వేయగలిగాం. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, అహంకారం. కనీ విని ఎరుగని రీతిలో పొలిటికల్ పవర్ ని ఉపయోగించుకుని ఇంత దారుణంగా ఉపయోగించి ప్రత్యర్ధుల మీద దాడులు చేయడాన్ని చూశాం. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. అద్భుతంగా ఫలితాలు వచ్చాయి. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టామని చెబుతున్నారు. నోటిఫికేషన్ వచ్చిననాడు మంత్రులు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ఏవిధంగా ఊళ్ల మీద పడి నామినేషన్లు చించేసి ఏకగ్రీవాలు చేయమని ఎందుకు బెదిరించారు? ఇవాళ 80 శాతం గెలిచాం.. 90 శాతం గెలిచామని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏం గెలిచారు మీరు? అసలు ఎందుకు ఏకగ్రీవాలకు ప్రయత్నించారు? అని నాదెండ్ల ప్రశ్నించారు.

  Manchu Manoj Urges Justice For Sugali Preethi | Women Safety
  జనసైనికులు అద్భుతంగా నిలబడ్డారు

  జనసైనికులు అద్భుతంగా నిలబడ్డారు

  యువతకు భరోసా ఇస్తూ, ప్రజల్లో ధైర్యం నింపుతూ సమాజంలో మార్పు రావాలన్న ఏకైక లక్ష్యంతో కొత్త తరం రాజకీయాలకు ఆహ్వానం పలుకుతూ 2014లో జనసేన పార్టీని ఏర్పాటు చేసిన దానికి ఈ రోజు ఫలితం వచ్చింది. యువకులు, మహిళలు జనసేన జెండా పట్టుకుని ఒక్కొక్కరుగా ఇంటింటికీ తిరుగుతూ పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానాలు, జనసేన పార్టీ చిత్తశుద్దిని వివరిస్తూ బరిలో నిలిచినప్పుడు నాడు సర్పంచ్ ఎన్నికల్లో సైతం ఇదే విధమైన ఫలితాలు వచ్చాయి. మహిళలు బయటకు వచ్చి అద్భుతంగా నిలబడ్డారు. ఇప్పుడేమో ముఖ్యమంత్రి యంత్రాంగం మొత్తాన్ని ఉపయోగించుకుని జిల్లా స్థాయి అధికారుల్ని రంగంలోకి దించి ఎన్నికలు చేసి ఇప్పుడు వచ్చిన స్థానాలు లెక్కపెట్టుకుంటూ సమయం వృధా చేస్తున్నారు. రాజకీయాల్లో జనసేన పార్టీ వేసింది తొలి అడుగు అయినా చాలా బలమైన అడుగు. రాజకీయాల్లో ఎన్నికలు నిజమైన స్ఫూర్తిని చూపిస్తాయంటారు. పవన్ కళ్యాణ్ మా అందరిలో అదే విధమైన స్ఫూర్తిని నింపారు అని నాదెండ్ల వ్యాఖ్యానించారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని, పీఏసీ సభ్యులు కోన తాతారావు, అధికార ప్రతినిధులు సుందరపు విజయ్ కుమార్, పరుచూరి భాస్కర రావు, పార్టీ నాయకులు డాక్టర్ సందీప్ పంచకర్ల, పసుపులేటి ఉషాకిరణ్, పి.వి.ఎస్.ఎన్. రాజు, గడసాల అప్పారావు, బోడపాటి శివదత్ తదితరులు పాలొన్నారు.

  English summary
  Pawan Kalyan will visit visakha steel plant next month: Nadendla Manohar.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X