విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ ప్రభుత్వానికి పీటీ ఉష, సానియా మిర్జాలకు తేడా తెలియకపోతే ఎట్టా? హాయ్ రబ్బా స్మిత

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: జాతీక క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం బీచ్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ.. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలకు దారి తీసింది. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ఈ ఒక్క ఫ్లెక్సీపై ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చుకునేంత పరిస్థితి ఏర్పడింది.

జగన్ ను అనుసరిస్తోన్న బీజేపీ..టీడీపీని ఫాలో అవుతున్న కాంగ్రెస్: ఎందుకు? జగన్ ను అనుసరిస్తోన్న బీజేపీ..టీడీపీని ఫాలో అవుతున్న కాంగ్రెస్: ఎందుకు?

ఇంతకీ ఏమిటా ఫ్లెక్సీ? ఏముంది అందులో? మనదేశ స్టార్ టెన్నిస్ ప్లేయర్, హైదరాబాదీ సానియా మిర్జాను పీటీ ఉషగా గుర్తిస్తూ ముద్రించడమే ఈ దుమారానికి కారణమైంది. అసలు కార్యక్రమం పక్కదారి పట్టింది. కొసరు వ్యవహారం తెరమీదికి వచ్చింది. ఈ ఫ్లెక్సీపై తెలుగు పాప్ సింగర్, హాయ్ రబ్బా స్మిత సైతం విమర్శలు చేయడం చెప్పుకోదగ్గ విషయం.

ఘాటు విమర్శలు..

ఘాటు విమర్శలు..

రాష్ట్ర క్రీడలు, యువవజన సర్వీసుల మంత్రిత్వశాఖ అధికారికంగా ముద్రించిన ఫ్లెక్సీ అని చెబుతున్నారు నెటిజన్లు. అలాంటి ఫ్లెక్సీలోనే ఈ తప్పిదం చోటు చేసుకోవడాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు ప్రతిపక్ష రాజకీయ పార్టీల అభిమానులు, కార్యకర్తలు. ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. విమర్శలతో ఎద్దేవా చేస్తున్నారు. ప్రఖ్యాత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని ఏటా ఆగస్టు 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాలు పేరిట నజరానాలు అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

ముఖ్యఅతిథిగా పీటీ ఉష

ముఖ్యఅతిథిగా పీటీ ఉష

దీనికోసం విశాఖపట్నంలో పోర్ట్ ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ బీచ్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ ఈ వివాదానికి కేంద్రబిందువైంది. నిజానికి- ప్రోత్సాహకాలను అందజేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పీటీ ఉష హాజరు కావాల్సి ఉంది. ఆమె పేరును ఫ్లెక్సీలో ముద్రించారే గానీ.. చీఫ్ గెస్ట్ అనే పదాలను చేర్చడాన్ని మరిచిపోయారు. దీనితో సానియా మిర్జా ఫొటో కింద పీటీ ఉష పేరు ముద్రితమైంది. దీనిపై నెటిజన్లు తమ విమర్శలుక పదును పెట్టారు. ఈ ఫ్లెక్సీపై తెలుగు పాప్ సింగర్, `హాయ్ రబ్బా` స్మిత సైతం విమర్శలు చేశారు. ఫొటోను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు.

వైసీపీ సోషల్ మీడియా కౌంటర్ ఎటాక్

మరోవైపు- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు, అభిమానులు.. తెలుగుదేశంపై ఎదురుదాడికి దిగుతున్నారు. శేఖర్ చౌదరి అనే పెయిడ్ ఆర్టిస్ట్ ను తీసుకొచ్చి.. రైతుగా చిత్రీకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇలాంటి నకిలీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం చిటికెలో పని అంటూ విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు పార్టీల సోషల్ మీడియా కార్యకర్తల మధ్య ఈ ఫ్లెక్సీ కేంద్రంగా ఓ మినీ యుద్ధమే కొనసాగుతోంది. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిపెట్టడానికి ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు ఎంతకైనా తెగిస్తారనే విషయం ఈ ఫ్లెక్సీతో మరోసారి రుజువైందని ధ్వజమెత్తుతున్నారు.

English summary
Andhra Pradesh government will celebrate National Sports Day on a grand scale on September 29 by honouring sports persons who brought laurels to the State. Announcing this during a video conference with Collectors on Tuesday, Chief Minister YS Jaganmohan Reddy said all the medalists of national level events would be honoured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X