నవవధువు మృతి కేసులో ట్విస్ట్: శరీరంలో విష పదార్థం, ట్యాబ్లెట్ కూడా..
విశాఖలో నవ వధువు మృతి చర్చకు దారితీసింది. ఆమె అలసిపోయిందని.. గుండెపోటు రావడంతో చనిపోయిందనే వార్తలు వచ్చాయి. కానీ దీనిని ధృవీకరించలేదు. కానీ ఆమె శరీరంలో విష పదార్థం ఉందనే అంశం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమె శరీరంలోకి విష పదార్థం ఎలా వచ్చిందనే అంశానికి సంబంధించి క్లారిటీ లేదు. పీటల మీద కుప్పకూలిన సృజనను ఆస్పత్రికి తరలించగా ఆమె మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సృజన మృతదేహాన్ని కేజీహెచ్‌కు పోస్ట్ మార్టం కోసం తరలించారు.
మరో వాదన ఉంది. వివాహానికి నెలసరి అడ్డం వస్తుందని సృజనకు వారి తల్లిదండ్రులు ఓ ట్యాబ్ లైట్ ఇచ్చారని తెలిసింది. అది వికటించి చనిపోయి ఉంటుందని సృజన బంధువులు చెబుతున్నారు. కానీ దీని వల్లే ఆమె చనిపోయిందా..? ఒత్తిడి వల్ల సృహ తప్పిపోయిందా అనే అంశాలపై క్లారిటీ లేదు. ఏం జరిగిందో పూర్తిగా తెలియాలంటే పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

విశాఖ మధురవాడలో నిన్న రాత్రి 7 గంటలకు తెలుగు యువత అధ్యక్షుడు శివాజీ-సృజన పెళ్లి జరగాల్సి ఉంది. ముహూర్తం సమయానికే అన్నీ ఏర్పాట్లు చేశారు. ఇంకేముంది అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వరుడు.. వధువు ఇద్దరూ పెళ్లి పీటలెక్కారు. కల్యాణం తంతు జరుగుతుంది. కీలక ఘట్టం అయిన జీలకర్ర బెల్లం ప్రక్రియ మొదలవనుంది. వధువు తలపై జీలకర్ర బెల్లం పెడుతుండగా సృహ కోల్పోయింది. పీటలపైనుంచి కింద పడిపోవడంతో అంతా కంగారు పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆమె చనిపోయింది.
ఈ మధ్య గుండెపోటు అనేది.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వస్తోంది. స్ట్రెస్, ఆహారం తీసుకోవడం.. నిద్ర ఇంపార్టెంట్.. దీనిపై వైద్యులు పదే పదే సూచన చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు పెడచెవిన పెడుతున్నారు. అలా చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.