విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జనసేన లాంగ్‌మార్చ్ సభకు అనుమతి నిరాకరణ...?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Vizag Police Objected Janasena Public Meeting At Vizag || Oneindia Telugu

నవంబర్ 3న విశాఖ మద్దిపాలేంలో ఇసుక కొరతపై జనసేన నిర్వహించనున్న బహిరంగ సభకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం నిర్వహించనున్న సభకు ఏర్పాట్లు చేస్తున్న స్థలానికి చేరుకున్న పోలిసులు సభ ఏర్పాట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

పవన్ లాంగ్ మార్చ్ కు వామపక్షాలు దూరం: మీ వైఖరి ఆమోద యోగ్యం కాదంటూ: జనసేనానికి లేఖ..!పవన్ లాంగ్ మార్చ్ కు వామపక్షాలు దూరం: మీ వైఖరి ఆమోద యోగ్యం కాదంటూ: జనసేనానికి లేఖ..!

ఏపీలో ఇసుక కొరతపై ఆందోళన చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నవంబర్ మూడున లాంగ్‌మార్చ్ నిర్వహించతలపెట్టిన నేపథ్యంలో పెద్దఎత్తున ర్యాలీకి పిలుపునిచ్చారు. దీంతో ఆదివారం సాయంత్రం కొనసాగనున్న సభకు ఏర్పాట్లు జరగుతున్నాయి. కాగా అంతకు ముందే మద్దిపాలేం జంక్షన్ నుండి భారీ ర్యాలీకి ప్రణాళికలు చేశారు. మద్దిపాలేం జంక్షన్ నుండి రామాటాకీస్ మీదుగా బయలు దేరనున్న ర్యాలీ జీవీఎంసీ బిల్డింగ్ ఎదురుగా ఉన్న గాంధి విగ్రహం వరకు చేరుకోనుంది. ర్యాలీ అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఎన్నికల తర్వాత మొదటి సారిగా జరుగుతున్న బహిరంగ సభ కావడంతో ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు సభకు అనుమతి లేదని అభ్యంతరం తెలిపారు.

police have objected the Jana Sena public meeting

ఇక ఇసుక పోరాటంలో భాగంగా పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజులుగా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.... మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షపార్టీలను ఏకం చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేశారు. పవన్‌కళ్యాణ్ స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు బీజేపీ రాష్ట్ర నేతలకు సైతం ఫోన్ చేసి అహ్వానించారు. దీంతో పవన్ సభకు టీడీపీ సీనియర్ నాయకులు హజరుకానున్నట్టు ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పారు. అయితే సభ అనుమతికి సంబంధించి ఉత్కంఠ నెలకొంది. పోలీసులు సభకు అనుమతి ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ ఎలాంటీ నిర్ణయం తీసుకుంటారనేది ప్రధానంగా మారింది.

English summary
The police have objected the Jana Sena public meeting which will be conducted at Maddilapalem on November 3 in Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X