విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

13 వేల టన్నుల స్టైరీన్ దక్షిణ కొరియా పంపటానికి మొదలైన తరలింపు ప్రక్రియ

|
Google Oneindia TeluguNews

విశాఖలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగి 12 మంది విషవాయువు స్టైరీన్ ధాటికి మృతి చెందారు. వందల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా అస్వస్థులయ్యారు. ఇక పరిసర గ్రామాలలో ఐదు గ్రామాలకు స్టైరీన్ ఎఫెక్ట్ బాగా పడింది. ఈ ఘటనతో ఏపీ ప్రభుత్వం దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ పాలిమర్స్ సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది.

ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత వారం లీకైన విష వాయువుకు సంబంధించి 13,000 టన్నుల స్టైరిన్ భారీ నిల్వను దక్షిణ కొరియాకు తిరిగి పంపాలని ఎల్జీ పాలిమర్‌ను ఆదేశించింది. ఇప్పటికే రెండు స్టైరీన్ నిల్వలు ఉన్న నాళాల నుండి గ్యాస్‌ను లోడ్ చేసే ప్రక్రియ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ ఐదు రోజుల్లో పూర్తవుతుందని అది దక్షిణ కొరియాకు తిరిగి పంపబడుతుంది అని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ ముఖ్యమంత్రి వై.ఎస్. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశంలో జగన్మోహన్ రెడ్డికి తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరిన్ని లీకేజీలు లేదా ప్రమాదాలు జరిగే అవకాశం తొలగించడానికి ఈ ఆపరేషన్ చేపట్టారు.

process began to transport of 13 thousand tonnes of styrene to South Korea

8,000 మరియు 5,000 టన్నుల సామర్థ్యం గల రెండు నాళాలలో 13,000 టన్నుల స్టైరిన్ ను తిరిగి రవాణా చేయగా, స్థానిక నిల్వ ట్యాంకుల్లో మిగిలిన స్టైరీన్ అప్పటికే తటస్థీకరించబడిందని చెప్పారు. 100% పాలిమరైజ్ చేయబడిందని పేర్కొన్నారు . దక్షిణ కొరియాకు స్టైరిన్ను తిరిగి పంపించనున్న ఏపీ ప్రభుత్వం ప్రమాదకరమైన కెమికల్ ప్లాంట్లను జనావాసాలకు దూరంగా మార్చాలనే ఆలోచనతో ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తుంది. 1961 లో ఈ ప్లాంటును స్థాపించినప్పుడు, ఈ ప్రాంతం పూర్తిగా జనావాసం లేని ప్రాంతం, కాని తరువాత ఈ ప్రాంతం చుట్టూ కాలనీలు, ఊర్లు వెలిశాయి .

English summary
Jolted by the death of 12 persons and hundreds falling sick due to gas leak at LG polymers factory in vishakhapatnam, the state government has begun the process of transporting 13,000 tonnes of styrene gas in two consignments of 8,000 tonnes and 5,000 tonnes to South Korea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X