విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ టీడిపి లోకి ప్ర‌ముఖ బీజేపి నేత‌..! ఆ ఎంపీ సీటు ఇస్తే చేరిపోవ‌డానికి రెడీ...!!

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి/ హైద‌రాబాద్ : ఏపిలో య‌జ్ఞం జ‌రుగుతోంది. సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముంచుకొస్తున్న త‌రుణంలో రాజ‌కీయ నాయ‌కులు త‌మ ప‌ద‌వుల‌కోసం పార్టీల‌క‌తీతంగా య‌జ్ఞం చేస్తున్నారు. ఏ పార్టీ త‌మ‌కు అనుకూల సీటు కేటాయిస్తే ఆ పార్టీలోకి చేరి పోయేందుకు రెఢీ ఐపోతున్నారు. ఈ నేప‌థ్య‌లో ఏపి లో విచిత్ర ప‌రిణ‌మాలు చోటు చేసుకుంటున్నాయి. అదికార టీడిపిని వీడేందుకు కొంత మంది నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తుంటే అదే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మ‌రి కొంత మంది నేత‌లు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్నారు. ఏపి బీజేపి చెందిన ప్ర‌ముఖ నేతకు సీటు విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌స్తే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు,

అశోక్ అమెరికా లో ఉన్నా.. : డేటా ఎవ‌రిచ్చార‌నేది ముఖ్యం : ఐటి గ్రిడ్స్‌లో తెలంగాణ డేటా: స‌్టీఫెన్.. అశోక్ అమెరికా లో ఉన్నా.. : డేటా ఎవ‌రిచ్చార‌నేది ముఖ్యం : ఐటి గ్రిడ్స్‌లో తెలంగాణ డేటా: స‌్టీఫెన్..

ఆస‌క్తిక‌రంగా ఏపి రాజ‌కీయాలు..! సీట్ల పై క‌న్నేసిన నేత‌లు..!!

ఆస‌క్తిక‌రంగా ఏపి రాజ‌కీయాలు..! సీట్ల పై క‌న్నేసిన నేత‌లు..!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు సమయం మించిపోతుండడంతో రాజకీయ పార్టీలతో పాటు, నేతలు కూడా స్పీడు పెంచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో పార్టీలు.. సీటు దక్కించుకుని గెలవాలన్న కసితో నాయకులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో సీటు ఆశిస్తున్న చాలా మంది నాయకులు అధిష్ఠానాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పార్టీతో సంబంధం లేకుండా చాలా మంది ఇదే పద్దతిని ఫాలో అయిపోతున్నారు. ఇందులో భాగంగానే చాలా మంది ఇప్పటికే తమ తమ పార్టీలకు రాజీనామాలు కూడా చేసి మ‌రో పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.

విశాఖ ఎంపీ సీటుపై క‌న్నేసిన బీజేపి నేత‌..! బాబు ఆదేశాల కోసం వెయిటింగ్..!!

విశాఖ ఎంపీ సీటుపై క‌న్నేసిన బీజేపి నేత‌..! బాబు ఆదేశాల కోసం వెయిటింగ్..!!

తాజాగా ఈ జాబితాలోకి భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వచ్చి చేరబోతున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. అయితే, ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి బాగోకపోవడంతో ఆయన పార్టీని వీడేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.

విశాఖ ఎంపీ స్థానం పై తీవ్ర పోటీ..! ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్న నేత‌లు..!!

విశాఖ ఎంపీ స్థానం పై తీవ్ర పోటీ..! ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్న నేత‌లు..!!

ఈ భేటీలో విశాఖపట్నం ఎంపీ స్థానాన్ని తనకు కేటాయించాలని విష్ణు, సీఎంను కోరారని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ బీజేపీకి చెందిన కంభంపాటి హరిబాబు ఎంపీగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ తల్లి విజయమ్మపై ఆయన గెలిచారు. ఇప్పుడు ఈ స్థానం నుంచి టీడీపీలో పోటీ చేసే వారి సంఖ్య చాలానే ఉంది. అయినా, తన సిట్టింగ్ స్థానం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో టికెట్ కోసం టీడీపీ నేతలు చాలా మంది పోటీలో ఉండడంతో విష్ణుకుమార్ రాజు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

విశాఖ ఎంపీ సీటు ఆశిస్తున్న బీజేపి నేత‌..! బాబు స‌మ్మ‌తికోసం ఎదురుచూస్తున్న వీకే రాజు..!!

విశాఖ ఎంపీ సీటు ఆశిస్తున్న బీజేపి నేత‌..! బాబు స‌మ్మ‌తికోసం ఎదురుచూస్తున్న వీకే రాజు..!!

వాస్తవానికి బీజేపీతో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకున్న తర్వాత ఉత్తర నియోజవర్గానికి టీడీపీ అభ్యర్థి ఎవరు అనే ప్రశ్న తలెత్తింది. ప్రస్తుతం ఈ టిక్కెట్‌పై టీడీపీకి చెందిన నలుగురు నేతలు ఆశపెట్టుకున్నారు. ప్రస్తుత టీడీపీ జిల్లా అధ్యక్షుడు, యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే, ఇదే స్థానం నుంచి బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్‌ కూడా పోటీ చేస్తారని అంటున్నారు. అందుకే విష్ణుకుమార్ రాజు ఎంపీగా పోటీ చేస్తానని చంద్రబాబు ముందు ప్రతిపాదన పెట్టినట్లు చ‌ర్చ జ‌రుగుతోంది. ఎంపీ సీటును విష్ణుకుమార్ రాజుకు కేటాయిస్తే ఏపిలో బీజేపికి చెందిన బిగ్ వికెట్ తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ల‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

English summary
The MLA of the Bharatiya Janata Party, Vishnu Kumar, comes to the rescue. In the last election, he was elected from the Vishakha North constituency and won the election to the YCP candidate. But now he is planning to leave the party due to the BJP's failure in the state. In this manner he met with Andhra Pradesh Chief Minister and Telugu Desam Party president Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X