విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జవాన్లను దెబ్బతీసేలా పాకిస్తాన్‌కు అనుకులంగా మాట్లాడుతావా: బాబుపై మోడీ! పవన్ కళ్యాణ్‌కూ ఝలక్

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: పుల్వామా ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా ప్రస్తావించారు. చంద్రబాబు పేరు చెప్పకుండా తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కొందరు నేతల వ్యాఖ్యలు దాయాది పాకిస్తాన్ దేశానికి అనుకూలంగా ఉన్నాయని విమర్శించారు.

పుల్వామా ఘటనపై చంద్రబాబు అనుమానాలు లేవనెత్తారు. ప్రధాని మోడీ మాటలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కూడా తాకుతాయని అంటున్నారు. ఎన్నికలకు ముందు యుద్ధం అంటూ రెండేళ్ల క్రితమే పలువురు జోస్యం చెప్పారని జనసేనాని వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మోడీ తన విశాఖ పర్యటనలో నేతలపై మండిపడ్డారు.

 కొందరు నేతలు పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు

కొందరు నేతలు పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు

ఇక్కడ ఉన్న కొందరు నేతల వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కొందరు నేతలు పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీలో బలమైన ప్రభుత్వం ఉంటేనే దేశం బాగుపడుతుందని చెప్పారు. భావసారూప్యత లేని పార్టీలు కూటమి కట్టాయన్నారు. బలమైన సర్కారు ఉంటే కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చునని చెప్పారు.

నరేంద్ర మోడీ విశాఖ పర్యటన: యూటర్న్, పుల్వామా ఘటన: చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మోడీ నరేంద్ర మోడీ విశాఖ పర్యటన: యూటర్న్, పుల్వామా ఘటన: చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మోడీ

సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడుతున్నారు

సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడుతున్నారు

ఇక్కడున్న కొందరు నేతలు దారుణంగా మాట్లాడి, వారు పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు. ఈ నేతల మాటల వల్ల సైనికుల స్థైర్యం దెబ్బతింటుందన్నారు. దేశాన్ని కించపరిచే నేతలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నేతలు తమ మాటల ద్వారా భారత్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రపంచదేశాలు పాక్‌ను ఏకాకిని చేస్తే, ఇక్కడి నేతలు వారికి అనుకూలంగా

ప్రపంచదేశాలు పాక్‌ను ఏకాకిని చేస్తే, ఇక్కడి నేతలు వారికి అనుకూలంగా

ప్రపంచ దేశాలు పాకిస్తాన్‌ను ఏకాకి చేసిన మాట్లాడితే, ఇక్కడి నేతలు మాత్రం వారికి అనుకూలంగా మాట్లాడటం దారుణమని మోడీ టీడీపీ అధినేతను ఉధ్దేశించి వ్యాఖ్యానించారు. బలమైన కేంద్రంతోనే జవాన్లు, రైతులు బాగుంటారని మోడీ అన్నారు. ఢిల్లీలో బలమైన కేంద్ర ప్రభుత్వం ఉంటేనే దేశం బాగుపడుతుందని చెప్పారు.

English summary
Prime Minister Narendra Modi fired at Andhra Pradesh chief minister Nara Chandrababu Naidu and Janasena chief Pawan Kalyan for their comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X