విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాజీ జేడీ లక్ష్మీనారాయణ పవన్ పార్టీలో చేరిన కారణం ఇదే .. గాజువాక వైసీపీ ఎమ్మెల్యే తిప్పల సంచలనం

|
Google Oneindia TeluguNews

పవన్ కళ్యాణ్ పార్టీలో పవన్ కళ్యాణ్ తో పాటు ఇక పవన్ పార్టీలో ప్రభావం చూపించగల నేతగా , సిన్సియర్ ఆఫీసర్ గా గుర్తించబడిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సైతం ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత ఒఅక్తి రెండు సందర్భాల్లో స్పందించిన లక్ష్మీ నారాయణ ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. కానీ తాజాగా ఆయన విషయంలో ఏపీలో రసవత్తరమైన చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఆయన జనసేనలో ఉన్నప్పటికీ పార్టీ మారతారా అన్న చర్చ జరుగుతున్న వేళ జనసేన పార్టీలో లక్ష్మీనారాయణను సిఫార్సు చేసింది చంద్రబాబేనని గాజువాక వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు .

పవన్ కోటరీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పీవీఆర్ .. పార్టీకి రాజీనామా ...కారణం ఇదేపవన్ కోటరీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పీవీఆర్ .. పార్టీకి రాజీనామా ...కారణం ఇదే

ఎన్నికలు గడిచి ఇంతకాలమైనా జనసేన మీద పడుతున్న రాళ్ళు

ఎన్నికలు గడిచి ఇంతకాలమైనా జనసేన మీద పడుతున్న రాళ్ళు

2019 ఆంధ్ర రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే మొట్టమొదటి సారిగా ఎన్నికల పోటీలో నిలిచిన జనసేన పార్టీ ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందా అని అంతా భావిస్తే ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది . ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక మరియు భీమవరం నుంచి పోటీ చెయ్యడం అలాగే అదే పార్టీలో మాజీ జేడీ వీవీ లక్ష్మి నారాయణ, మెగా బ్రదర్ నాగబాబు వంటి వారికి టికెట్లు ఇవ్వటంతో ఖచ్చితంగా గెలుపొందుతామని వారు అనుకున్నారు.కానీ అనూహ్యంగా పవన్ తో పాటు జేడీ కూడా ఓటమి పాలవడం ఆ పార్టీకి పెద్ద షాక్ గా మారింది. ఇక ఇప్పటికీ ఆ బాధ అలాగే వున్న జనసేన పార్టీ మీద , జేడీ మీద సంచలన ఆరోపణలు చేశారు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి

మాజీ జేడీ జనసేనలో చేరింది ఆయన సిఫార్సు తోనే అన్న గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి

మాజీ జేడీ జనసేనలో చేరింది ఆయన సిఫార్సు తోనే అన్న గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి

గాజువాకలో పవన్ పై చేసి గెలుపొందిన వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాజీ జేడీ లక్ష్మీ నారాయణ జనసేన పార్టీలో చేరటం వెనుక చంద్రబాబు వ్యూహం ఉందని పేర్కొన్నారు. పవన్ మరియు జేడీ లు వారి సామాజికవర్గ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కదా అని ఆయా స్థానాల నుండి పోటీ చేసారని, నిజానికి ఇదంతా చంద్రబాబు స్క్రిప్టే అని ఆయన పేర్కొన్నారు. జనసేన , టీడీపీ రెండో వేరు కాదని, ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే జనసేన చంద్రబాబుతో కలిసి పని చేసేదని ఆయన ఆరోపించారు. ఓ మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు చెప్పటంతోనే పవన్ మాజీ జేడీ ని తన పార్టీలోకి చేర్చుకున్నాడని అంతే కాకుండా పవన్ పార్టీ నుండి కాస్త ముఖ్యమైన నేతలు పోటీ చేసే చోట టీడీపీ పోటీ లేకుండా కూడా చేశారని ఆరోపించారు.

జనసేనపైన ఎవరికి తోచింది వారు చెప్తున్న తీరుతో ప్రజల్లో అనుమానాలు

జనసేనపైన ఎవరికి తోచింది వారు చెప్తున్న తీరుతో ప్రజల్లో అనుమానాలు

అసలు ఎన్నికల్లో ఓడిపోయి కష్టాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ మీద ఎవరికి తోచినట్టు వాళ్ళు వ్యాఖ్యలు చెయ్యటం పార్టీకి చాలా డ్యామేజ్ చేస్తుందనే భావన ఉంది. కానీ జనసేన పార్టీ నుండి నాయకులు పార్టీపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టటంలో విఫలం అవుతున్నారు . కొంత కాలం బీజేపీతో కొంతకాలం టీడీపీతో ఇలా ఎవరికి తోచిన విధంగా వారు సంబంధాలు ఉన్నాయని చెప్తుంటేనే పార్టీ విషయంలో జనాల్లో అనుమానాలు పెరిగేది .

English summary
Former YCP MLA Thippala Nagi Reddy, who won over Pawan in Gajuwaka, has claimed that former JD Lakshmi Narayana was joined the Janasena party because of chandrababu . He claimed that Pawan and EX JD had contested from their seats because their community votes were high, in fact all these were Chandrababu's script.He alleged that Janasena and TDP were not the second separation, and that Janasena would work with Chandrababu if TDP won the election. Speaking to a media channel, Tippala alleged that Pawan had joined the former JD in his party with the plan of Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X