విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్కే బీచ్ లో విగ్రహాల తొలగింపు.. అసలు అభ్యంతరం హరికృష్ణ విగ్రహం వల్లేనట..

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో విగ్రహాలను తొలగించారు జీవీఎంసి అధికారులు . సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల విగ్రహాల తొలగింపుకు కారణం ఏంటి ? ఎందుకు ఈ విగ్రహాల ప్రతిప్ఠాపనపై తీవ్ర వివాదం చెలరేగుతూ వచ్చింది ? విగ్రహాల తొలగింపు వ్యవహారం కోర్టు మెట్లెక్కటానికి కారణం ఏమిటి ?

ఆర్కే బీచ్ లో హరికృష్ణ విగ్రహం విషయంలోనే అసలు అభ్యంతరం ..

ఆర్కే బీచ్ లో హరికృష్ణ విగ్రహం విషయంలోనే అసలు అభ్యంతరం ..

విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో సోమవారం అర్థరాత్రి మూడు విగ్రహాలను జీవిఎంసి అధికారులు కూల్చేశారు. ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు, ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వర రావుతో పాటు తెలుగుదేశం మాజీ పార్లమెంటు సభ్యుడు హరికృష్ణ విగ్రహాలను తొలగించారు . అయితే అక్కినేని నాగేశ్వరరావు , దాసరి నారాయణ రావు విగ్రహాల విషయంలో ఎవరికీ పెద్ద అభ్యంతరం లేదు కానీ హరికృష్ణ విగ్రహం విషయంలోనే అక్కడ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం అయ్యింది .

దాసరి, అక్కినేని ఇరువురూ సినీ, సామాజిక రంగాల్లో కృషి చేసిన వారు

దాసరి, అక్కినేని ఇరువురూ సినీ, సామాజిక రంగాల్లో కృషి చేసిన వారు

దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వర రావు ఇద్దరు కూడా సినీ, సామాజిక రంగాల్లో విశేషంగా కృషి చేసినవారు. దాసరి నారాయణ రావు సినీ దర్శక నిర్మాత మాత్రమే కాకుండా రచయిత, నటుడు, గిన్నీస్ రికార్డులోకి ఎక్కిన వ్యక్తి. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇక అక్కినేని నాగేశ్వర రావు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత . వారిద్దరి విగ్రహాలు ఏర్పాటు చెయ్యటానికి నియమాలు ఉల్లంఘించినప్పటికీ వారి విగ్రహాలపై పెద్దగా అభ్యంతరం ఉండేది కాదంటున్నారు స్థానికులు. అయితే, వారి విగ్రహాలతో పాటు హరికృష్ణ విగ్రహం ప్రతిష్టించటంతోనే ఇబ్బంది అని అంటున్నారు .

హరికృష్ణ జాతీయ స్థాయిలో పేరున్న నేత కాదు స్థానికుడు కాదు .. అందుకే విగ్రహాల తొలగింపు

హరికృష్ణ జాతీయ స్థాయిలో పేరున్న నేత కాదు స్థానికుడు కాదు .. అందుకే విగ్రహాల తొలగింపు

హరికృష్ణ స్థానికుడు కాదు. పైగా పెద్దగా జాతీయ స్థాయిలో పేరు గడించిన నేత కూడా కారు. సినీ పరిశ్రమలోనూ దాసరి, అక్కినేని అంత కీర్తి గడించిన నటుడు కాదు. దాంతో ఆ విగ్రహ ప్రతిష్టాపనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విగ్రహాల ఏర్పాటుకు జీవీఎంసి నుంచి అనుమతులు కూడా తీసుకోలేదు. అది కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. దీంతో విగ్రహాలను తొలగించాల్సిందేనని ఉద్యమాలు చేశారు. దాంతో చివరకు ఆ మూడు విగ్రహాలను అధికారులు కూల్చేశారు. హరికృష్ణ విగ్రహం పెట్టటం వల్లే మూడు విగ్రహాల తొలగింపు జరిగిందని స్థానికుల అభిప్రాయం .

English summary
Three statues were removed Monday late night in Visakhapatnam Ramakrishna Beach. Famous director producer Dasari Narayana Rao, Phalke awardee Akkineni Nageswara Rao and former Telugu Desam Member Harikrishna. However, no one has any objection to the idols of Akkineni Nageshwara Rao and Dasari Narayana Rao but there is a serious objection in the statue of Harikrishna.Harikrishna is not a native and also not a famous personality in national level. The locals were angry at that statue. because of Harikrisha statue the three statues were removed .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X