విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైజాగ్ ఘటనలో వారుంటే రాజీనామా చేస్తా: చంద్రబాబుకు రోజా సవాల్

|
Google Oneindia TeluguNews

నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా చంద్రబాబు నాయుడుకు అలాగే టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. ఏపీలో నిన్న చంద్రబాబు వైజాగ్ ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఘటనపై అటు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పోలీసుల సహకారంతోనే వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారని, పులివెందుల రౌడీలు చంద్రబాబుపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారని టీడీపీ నిన్నటి నుండి నిప్పులు చేరుగుతుంది. ఇక దీనిని ఖండించారు రోజా.

చంద్రబాబు,లోకేష్ ల భవిష్యత్ చెప్పిన ఎమ్మెల్యే రోజాచంద్రబాబు,లోకేష్ ల భవిష్యత్ చెప్పిన ఎమ్మెల్యే రోజా

వైజాగ్ రాజధానిగా వ్యతిరేకించిన చంద్రబాబును వైజాగ్ ప్రజలు అడ్డుకుంటే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారని రోజా మండిపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ అధినేత చంద్రబాబుకు బహిరంగ సవాల్ చేశారు. వైజాగ్‌లో ప్రజలు చంద్రబాబును అడ్డుకుంటే నిందలు మాపై నెట్టేందుకు యత్నిస్తున్నారని రోజా మండిపడ్డారు. ప్రజలు అడ్డుకుంటే వైసీపీ నేతలు అడ్డుకున్నారని , కడప రౌడీలు చంద్రబాబు కాన్వాయ్ పై దాడి చేశారని చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు రోజా .

Rojas challenge to Chandrababu... she will resign if kadapa rowdies found in Vizag incident

చంద్రబాబు రాజ్యాంగం గురించి మాట్లాడడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది అంటూ రోజా ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబ్బు చేసినవి ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పారు రోజా . ఇక విశాఖ ఘటనకు సంబంధించి వీడియో క్లిప్స్‌ ఇచ్చేందుకు వైసీపీ సర్కార్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇక ఆ వీడియో ఫుటేజ్ లో ఎక్కడైనా కడప రౌడీలు కనిపిస్తే చూపించాలని చాలెంజ్ చేసిన రోజా ఒకవేళ నిజంగా అలాంటిది ఏదైనా కనిపిస్తే రాజీనామాకు సిద్ధమమని వెల్లడించారు . ఇక టీడీపీ నేతలు రోజా సవాల్ కు ఏం సమాధానం ఇస్తారో ?

English summary
Roja said that one should remember what Chandrababu had done in the past. YCP government has announced that it is ready to give video clips of the Vishakha incident. In the video footage challenged to show Kadapa rowdies anywhere, Roja revealed that she is ready to resign if anything really looks like that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X