విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైజాగ్ క్రేన్ ప్రమాదంపై మంత్రి అవంతి కీలక ప్రకటన: రూ.50 లక్షల పరిహారం చెల్లించేలా

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖపట్నంలో చోటు చేసుకున్న క్రేన్ ప్రమాదంలో మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని చెల్లించేలా హిందుస్తాన్ షిప్‌యార్డ్ సంస్థ యాజమాన్యాన్ని ఒప్పించింది. మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని చెల్లించేలా చర్యలను తీసుకున్నామని అన్నారు. ఈ దిశగా హిందుస్తాన్ షిప్‌యార్డు యాజమాన్యంతో పాటు ఆయా ఉద్యోగులు పనిచేస్తోన్న కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో జిల్లాకు చెందిన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ భేటీ అయ్యారు.

క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. మృతుల కుటంబాలను ఆర్థికంగా ఆదుకోవడానికి హిందుస్తాన్ షిప్‌యార్డ్, కాంట్రాక్టు సంస్థలకు ఆదేశాలను జారీ చేశామని అన్నారు. ఒక్కో కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. క్రేన్ కుప్పకూలిన ఘటనపై హిందుస్తాన్ షిప్‌యార్డు యాజమాన్యం దర్యాప్తు చేపట్టిందని, దీనికోసం ఓ కమిటీని నియమించిందని అన్నారు. ప్రభుత్వం తరఫునా ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టినట్లు తెలిపారు.

Rs 50 lakh exgratia to deceased persons families from the Hindustan Shipyard: Avanti Srinivas

హిందుస్తాన్ షిప్ యార్డులో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ భారీ క్రేన్ శనివారం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వెంకటరావు, చైతన్య, రమణ, పీవీ రత్నం, పీ నాగ, సతీరాజు, శివకుమార్, కాకర్ల ప్రసాద్, జగన్, పీ భాస్కర్ అనే ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్‌గ్రేషియో అందజేయాలంటూ సీఐటీయూ, ఏఐటీయూసీ వంటి కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఆయా కార్మిక సంఘాలకు చెందిన నేతలు విధులను బహిష్కరించారు. నిరసన కార్యక్రమాలను చేపట్టారు.

Recommended Video

Amaravati భూముల పై Pawan Kalyan వీడియో వైరల్ | Amaravati Farmers || Oneindia Telugu

ఈ పరిస్థితుల మధ్య మంత్రి అవంతి శ్రీనివాస్ కొద్దిసేపటి కిందట హిందుస్తాన్ షిప్ యార్డు యాజమాన్యంతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బాధితులకు భారీగా ఆర్థిక పరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వం తరఫున హిందుస్తాన్ షిప్‌యార్డు యాజమాన్యానికి ఆదేశించినట్లు చెప్పారు. ఇదొక దురదృష్టకర ఘటన అని చెప్పారు. బాధితులను ఆదుకోవడంలో రాజీ పడొద్దని యాజమాన్యానికి సూచించినట్లు అవంతి పేర్కొన్నారు. 50 లక్షల పరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

English summary
Andhra Pradesh Tourism minister Avanti Srinivas told that Rs 50 Lakh exgratia will pay to the deceased persons in huge new crane collapsed while the management was conducting a trial run to know its capacity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X