• search
 • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వైజాగ్ దివ్య హత్య కేసులో కొత్త ట్విస్ట్ .. తెరమీదికి ఒక రౌడీ షీటర్ .. మరో నలుగురు అరెస్ట్

|

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వైజాగ్ దివ్య దారుణ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. వ్యభిచారంలో పోటీతో దివ్యను హతమార్చారు వ్యభిచార ముఠా. అత్యంత కిరాతకంగా గుండు గీసి, కనుబొమ్మలు గీసి, భోజనం పెట్టకుండా చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీశారు. ఇక ఈ కేసులో మరి కొంతమందిని అరెస్ట్ చేశారు పోలీసులు .

  వైజాగ్ దివ్య హత్య కేసులో వెలుగు చూస్తున్న దారుణాలు, అత్యంత పాశవికంగా...!!

   వైజాగ్ దివ్య హత్యకేసులో కొత్త కోణాలు .. భర్తే దివ్యను అమ్మేసి వ్యభిచార కూపంలో నెట్టాడా? వైజాగ్ దివ్య హత్యకేసులో కొత్త కోణాలు .. భర్తే దివ్యను అమ్మేసి వ్యభిచార కూపంలో నెట్టాడా?

  దివ్య హత్యకేసులో మరో నలుగురు అరెస్ట్

  దివ్య హత్యకేసులో మరో నలుగురు అరెస్ట్

  ఇక ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులతో కస్టడీలో ప్రధాన నిందితురాలు వసంతతో పాటు ఆమె చెల్లి గీత అనేక సంచలన విషయాలు బయటపెడుతున్నారు. దివ్య భర్త తో పాటు మరికొంత మంది కోసం గాలిస్తున్న పోలీసులు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో నలుగురు నిందితులను ఫోర్త్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వసంత మరిది సంజయ్ తో పాటు మంజు, ధనలక్ష్మీ, క్రాంతివేణిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

   రెండు రోజుల కస్టడీకి నిందితులు

  రెండు రోజుల కస్టడీకి నిందితులు

  నలుగురిని కోర్టులో హాజరుపర్చగా రెండు రోజులపాటు పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది. ఇప్పటికే కస్టడీలో ఉన్న ప్రధాన నిందితురాలు వసంత, గీతలను కస్టడీకి మరో రోజు పొడిగించింది కోర్టు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీపీ మీనా ఆరుగురు నిందితులను స్వయంగా విచారిస్తూ కీలక విషయాలు రాబడుతున్నారు. ఈ క్రమంలోనే దివ్య హత్య కేసులో ఓ రౌడీషీటర్ పాత్ర కూడా ఉన్నట్టు ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది . ఇక ఒక రౌడీ షీటర్ ఆమె హత్యలో ఎందుకు ఇన్వాల్ అయ్యారన్నది పోలీసులు దర్యాప్థూ హేస్తున్నారు.

  స్వయంగా విచారిస్తున్న సీపీ మీనా

  స్వయంగా విచారిస్తున్న సీపీ మీనా

  మరోవైపు వసంత మరిది సంజయ్ ఫోన్‌లోని డేటా డిలీట్‌ చేసేందుకు సహకరించిన దొండపర్తిలోని ఓ సెల్‌‌షాపు యజమానిని పోలీసులు విచారించారు. అయితే సంజయ్ నుంచి అన్ని వివరాలు తెలుసుకున్నాకే డేటా డిలీట్ చేశానని, అంతకుమించి ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అతడు పోలీసులకు చెప్పాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీపీ మీనా నిందితులను స్వయంగా విచారిస్తూ కీలక విషయాలు రాబడుతున్నారు.

   తెరమీదకి రౌడీ షీటర్ పేరు

  తెరమీదకి రౌడీ షీటర్ పేరు


  ఇక దివ్య హత్య కేసుతో పాటు ఆమె కుటుంబసభ్యుల హత్య కేసులు కూడా విచారిస్తున్న పోలీసులకు రౌడీ షీటర్ వ్యవహారం కేసులో కొత్త ట్విస్ట్ కు కారణం అయ్యింది. దివ్య అమ్మ, అమ్మమ్మ, తమ్ముడు హత్యకు గురికావడం, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వదిలేయడంతో ఒంటరైన దివ్య పిన్ని ఇంటికి వెళ్ళిందని , ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న పిన్ని దివ్యను వైజాగ్‌లో ఉండే వసంత ఇంటికి పనిమనిషిగా పంపింది అని పేర్కొన్నారు సీపీ మీనా. అయితే అందంగా ఉండే దివ్యతో వ్యభిచారం చేయిస్తే బాగా డబ్బులు సంపాదించొచ్చని భావించిన వసంత ఆమెకు డబ్బు ఆశ చూపించి వ్యభిచారంలోకి దించింది.

  దివ్య కేసుతో పాటు దివ్య కుటుంబం హత్యపై కూడా పోలీసుల ఫోకస్

  దివ్య కేసుతో పాటు దివ్య కుటుంబం హత్యపై కూడా పోలీసుల ఫోకస్

  ఇక దివ్యని హతమార్చటంలో ఆమెను వివాహం చేసుకున్న వీరబాబుకు కూడా ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నామని ఆయన పేర్కొన్నారు . దివ్య తల్లి సుబ్బలక్ష్మి, సోదరుడు గణేష్‌ అమ్మమ్మ నాగమణి ఓ రౌడీషీటరు చేతిలో హత్యకు గురయ్యారని, అతనికి ఈ హత్యకు సంబంధం ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో ఆ కోణంలోనూ విచారణ సాగిస్తున్నాం అని పేర్కొన్నారు సీపీ మీనా .

  English summary
  The main accused in custody with the police investigating the divya murder case, along with Vasantha, is revealing many sensational issues. Four other people have been arrested by the Fourth Town Police in connection with the case. Manju, Dhanalakshmi and Krantiveni arrested along with Vasantha's relative Sanjay
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X