• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

విజయసాయి రెడ్డికి మర్యాదగా చురకలంటించిన బాలయ్య చిన్నల్లుడు .. ఏమన్నారంటే

|

నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ ఆస్తులను ఆంధ్రా బ్యాంక్ వేలం వెయ్యనుందని, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, విశాఖ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీభరత్ కుటుంబం రూ.13 కోట్లు పైచిలుకు బకాయి పడ్డట్టు ఆంధ్రా బ్యాంక్ పేపర్లలో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చింది అని విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ఇక అంతే కాదు మెస్సర్ వి.బి.సి రెన్యువేబిల్ ఎనర్జీ సంస్థతోపాటు,బాలయ్య చిన్న కూతురు తేజస్విని, అల్లుడు శ్రీ భరత్‌, వంకిన రమేశ్ చంద్ర చౌదరి, జాస్తి రామకృష్ణ చౌదరి, బిశ్వజిత్ మిశ్రా తదితరుల పేర్లను ఆంధ్రా బ్యాంక్ ఈ ప్రకటనలో పేర్కొందని ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడుకు సంబంధించిన దొంగల ముఠా, ఆయన బీజేపీలోకి పంపిన నలుగురు ఎంపీలు వాళ్లు అంతా కలిసి లక్ష కోట్ల మేరకు బ్యాంకులను ముంచారని ఆయన ట్విట్టర్లోపేర్కొన్నారు.

Sri Bharath counter to Vijayasai reddy

విజయసాయి రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై స్పందించిన శ్రీభరత్ విజయసాయిరెడ్డికి రివర్స్ కౌంటర్ ఇచ్చారు భరత్. విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణల పై సోషల్ మీడియా వేదికగా ని బహిరంగ లేఖ రాశారు శ్రీ భరత్ . అంతేకాదు విజయసాయి చేసిన వ్యాఖ్యల పై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఏపీ ట్రాన్స్ కో నుండి రావాల్సిన బకాయిలు మూడు కోట్ల రూపాయలు ఇప్పటివరకు రాలేదని,ఇప్పటివరకు లోన్ బకాయిలు వాయిదా మొత్తం రెండు కోట్ల రూపాయలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ట్రాన్స్ కో లు సరైన సమయం లో బకాయిలు చెల్లించి ఉంటే ఋణ వాయిదాలు మేము కూడా చెల్లించేవాళ్ళమని చెప్పిన ఆయన కానీ ఇపుడు చెల్లించే స్థితిలో లేమని తెలిసి ఇలా నిందలు వేయడం చాల విచారకరం అని అన్నారు.

మీరు మీ ప్రభుత్వంలో బాధ్యతగల పదవిలో ఉన్నారు. అంతే బాధ్యతగా మాట్లాడాలని బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ విజయసాయిరెడ్డికి హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది వ్యాపారస్తులకు ప్రభుత్వం బిల్లులు సకాలంలో చెల్లించలేదని,ఉద్యోగులకు జీతాలు సైతం చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన పేర్కొన్నారు.ఇక విజయసాయిరెడ్డి సలహాలు సూచనలు రాష్ట్రానికి చాలా అవసరమని తనకు వ్యక్తిగతంగా సలహా ఇవ్వాల్సిన అవసరం లేదని ఇలాంటి వ్యాఖ్యలు సమాజానికి మంచిది కాదని నా అభిప్రాయం అంటూ శ్రీ భరత్ చాలా మర్యాదగా చురకలంటించారు. మీకు వీలైతే ఔత్సాహిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి కానీ ఇలా అవమానించకండి అంటూ బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ విజయ్ సాయి రెడ్డి చేసిన ట్వీట్ కు సమాధానమిచ్చారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Responding to the allegations leveled by Vijayasai Reddy, Sri bharat wrote an open letter in the social media platform. He was embarrassed by Vijayasai's comments. He said the outstanding dues from AP Trans Co had not come up to Rs 3 crore and the total amount of loan dues so far has been Rs 2 crore. He said if The Trans Co pay the dues we would pay the installments at the right time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more