విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ ఫలితాల వేళ ట్విస్ట్.. కోడి కత్తి శీనుకు బెయిల్

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఎన్నికల ఫలితాల రోజున అనుకోని మలుపు ఒకటి చోటు చేసుకుంది. వైసీపీ అధినేత జగన్ పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి చేసి ప్రస్తుతం జైలులో ఉన్న శ్రీనివాస్‌కు ఎన్ఐఏ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వాదనలు విన్న న్యాయమూర్తి శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చారు. మరో రెండు రోజుల్లో శ్రీనివాస్ జైలు నుంచి బెయిలుపై విడుదల అయ్యే అవకాశం ఉంది.

విశాఖపట్నం విమానాశ్రయంలో లాంజ్‌లో కూర్చుని ఉండగా శ్రీనివాస్ అనే వెయిటర్.. కత్తి దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానని చెప్పి దగ్గరకు వచ్చిన శ్రీనివాస్ తనతో పాటు తెచ్చుకున్న కోడికత్తితో జగన్ పై దాడి చేశారు.వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది వెయిటర్ శ్రీనివాస్‌ను పోలీసులకు అప్పగించారు. ఇక పోలీసు కస్టడీలో ఉన్న శ్రీనివాస్ జగన్ పై తానే దాడిచేసినట్లు చెప్పాడు. తన వెనక ఎవరూలేరని , జగన్ పై దాడి చేయాల్సిందిగా ఎవరూ తనకు చెప్పలేదని శ్రీనివాస్ చెప్పాడు.

Srinivas who is accused in Jagans attack case granted bail by NIA court

జగన్ పై దాడి ఘటన కేసుపై కోర్టును ఆశ్రయించింది వైసీపీ. దీంతో ఎన్‌ఐఏతో విచారణ చేయించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక కోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఎన్ఐఏ శ్రీనివాస్‌ను విచారణ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై వాదనలు గురువారం ముగిశాయి. వాదనలు విన్న ఎన్ఐఏ కోర్టు శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

English summary
The accused in YCP chief Jagan's attack case Srinivas was granted bail by NIA court here on Thursday. Srinivas who works as a waiter attacked Jagan with a Knife in October last year. He was in custody with the National investigating agency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X