విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హ‌రికృష్ణ‌..ఏఎన్ఆర్‌..దాస‌రి విగ్ర‌హాల‌ తొలిగింపు : అభిమానుల ఆందోళ‌న : విశాఖ‌లో ఉద్రిక్త‌త‌..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

విశాఖ‌లో హ‌రికృష్ణ‌,ఏఎన్ఆర్‌,దాస‌రి విగ్ర‌హాల‌ తొలిగింపు || Oneindia Telugu

విశాఖ న‌గ‌రంలో అర్ద‌రాత్రి ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన విగ్ర‌హాల్లో మూడింటిని అధికారులు అర్ద‌రాత్రి తొలిగించారు. దీంతో..అభిమానులు ఆందోళ‌నకు దిగారు. నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ఏర్పాటు చేసిన విగ్ర‌హాల‌నే తొలిగించాల్సి వ‌చ్చింద‌ని..అది కూడా హైకోర్టు ఆదేశాల మేర‌కు తొలిగించాల‌మ‌ని విశాఖ న‌గ‌ర పాల‌క అధికారులు చెబుతున్నారు.

విశాఖ‌లో విగ్ర‌హాల తొలిగింపు..
విశాఖ న‌గ‌రంలోని బీచ్ రోడ్డులో అర్ద‌రాత్రి ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఆర్కే బీచ్ వ‌ద్ద అనుమ‌తి లేదంటూ మూడు విగ్ర‌హాల‌ను అధికారులు తొలిగించారు. నంద‌మూరి హ‌రికృష్ణ‌..అక్కినేని నాగేశ్వ‌ర రావు..దాస‌రి నారాయ‌ణ‌రావు విగ్ర‌హాల‌ను అధికారులు తొలిగించాల‌ని అర్ద‌రాత్రం బీచ్ రోడ్డుకు చేరుకున్నారు. ఉద‌యం స‌మ‌యంలో వీటిని తొలిగించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తే..అభిమానుల నుండి నిర‌స‌న‌లు వ్య‌క్తం అయ్యే అవ‌కాశాలు ఉండ‌టంతో అర్ద‌రాత్రి స‌మ‌యంలో వీటిని తొలిగించాల‌ని నిర్ణ‌యించారు.

Statues Removing in RK beach in Visakha caused for Tension : High court order for removing..

విశాఖ న‌గ‌ర పాల‌క అధికారులు ఈ మూడు విగ్ర‌హాల‌ను తొలిగించారు. దీంతో..విష‌యం తెలుసుకున్న అభిమానులు ఆందోళ‌నకు దిగ‌టంతో ఉద్రిక్త‌త ప‌రిస్థితి త‌లెత్తింది. అయితే, న‌గ‌ర‌పాల‌క అధికారులు మాత్రం న‌గ‌ర పాలక సంస్థ‌ల నిబంధ‌ల‌న‌కు వ్య‌తిరేకంగా ఉన్న విగ్ర‌హాల‌ను తొలిగించామ‌ని..దీని పైన కోర్టు ఉత్త‌ర్వులు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేసారు.

కోర్టు ఆదేశాలు ఏంటంటే..
విశాఖ న‌గ‌రంలోని కీల‌క‌మైన ఆర్కే బీచ్ రోడ్డులో న‌గ‌ర పాల‌క సంస్థ అనుమ‌తి లేకుండా విగ్ర‌హాలు ఏర్పాటు చేయటానికి వీలు లేదు. న‌గ‌ర పాల‌క సంస్థ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఏర్పాటు చేయాలి. విశాఖ న‌గ‌ర పాల‌క సంస్థ లో చేసిన తీర్మానం మేర‌కు ఉత్త‌రాంధ్ర ప్రాంతానికి చెందిన ప్ర‌ముఖుల విగ్ర‌హాల‌ను మాత్ర‌మే..స‌మాన‌మైన ఎత్తులో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి విగ్ర‌హాల ఏర్పాటుకు న‌గ‌ర పాల‌క సంస్థ పాల‌క వ‌ర్గ అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి.

Statues Removing in RK beach in Visakha caused for Tension : High court order for removing..

ఈ మూడు విగ్ర‌హాల‌కు సంబంధించి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఏర్పాటు చేయగా.. వాటిని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. వీరికి నోటీసులు కూడా పంపారు. ఇదే స‌మ‌యంలో హైకోర్టులో వీటీ ఏర్పాటు పైన పిల్ దాఖ‌లైంది. దీని పైన విచారించిన హైకోర్టు విగ్ర‌హాల‌ను తొలిగించాల‌ని ఆదేశించింది. ఎన్నిక‌ల విధుల్లో ఉన్న అధికారులు ఉత్త‌ర్వుల అమ‌లుకు ఆల‌స్యం చేసారు. కోర్టు ఉత్త‌ర్వులు అమ‌ల్లో భాగంగానే..విగ్ర‌హాల‌ను తొలిగించామ‌ని అధికారులు వివ‌రించారు.

English summary
Three statues in Visakha RK Beach removed by Vizag Muncipal Corportion officers in mid night. Fans of Harikrishna, ANR, Dasari Narayana Rao protestd mid night near beach. Officers clarified that implementing hi court orders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X