• search
 • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఫలితాల ముందు ఏపీకి తుఫాను దెబ్బ! తట్టుకునేది ఎవరు... కొట్టుకుపోయేది ఎవరు?

|
  ఫలితాల ముందు ఏపి కి తుఫాను దెబ్బ...! || Oneindia Telugu

  విశాఖపట్నం: మూలిగే నక్క మీద తాటికాయ పడటం అంటే ఇదే.. ఏపి పై ప్రక్రుతి ప్రకోపించబోతోంది. తుపాను రూపంలో మరో విపత్తు ఏపిని అతలాకుతలం చేయబోతోంది. ఎన్నికల తర్వాతే ఏదైనా అనే భావనలో ఉన్న రాజకీయ పార్టీల నేతలు తుపాన్ వస్తే ముందుండి ప్రజల ప్రాణాలు ఎంతవరకు కాపాడతారనేది కూడా ప్రశ్నార్థకంగానే మారింది. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రానికి అనుకోని విపత్తు ఎన్నికల ఫలితాల ముందు వస్తే నాయకులు ఎంతవరకు రాష్ట్రాన్ని కాపాడతారనేది కూడా ఆసక్తిగా మారింది.

  ఏపికీ మరో విపత్తు..! కన్నెర్ర చేయబోతున్న ప్రకృతి..!!

  ఏపికీ మరో విపత్తు..! కన్నెర్ర చేయబోతున్న ప్రకృతి..!!

  ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. హిందూ మహాసముద్రానికి అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది. శ్రీలంకలోని ట్రింకోమలీకి 1140 కి.మీ తూర్పు ఆగ్నేయంగా, చెన్నైకి 1490 కి.మీ ఆగ్నేయంగా, మచిలీపట్నానికి 1760 కి.మీ దక్షిణ ఆగ్నేయంగా వాయుగుండం కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

  ఫలితాల ముందు తుఫాను దెబ్బ..! ఏ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది..!!

  ఫలితాల ముందు తుఫాను దెబ్బ..! ఏ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది..!!

  రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం శనివారం రాత్రికి తుఫానుగా మారనుందని ఐఎండీ పేర్కొంది. అనంతరం 96 గంటల్లో శ్రీలంక తీరానికి వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 30వ తేదీన ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తాంధ్రల మద్య తుఫాన్‌ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురువనున్నాయి.

  తుఫాను వల్ల కకావికలం కానున్న ఏపి..! ఇంతవరకూ తీసుకోని ముందు జాగ్రత్తలు..!!

  తుఫాను వల్ల కకావికలం కానున్న ఏపి..! ఇంతవరకూ తీసుకోని ముందు జాగ్రత్తలు..!!

  మే 1వ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్‌ కారణంగా తీరప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయి. తుఫాను తీరం దాటే నాటికి తీవ్రత మరింత పెరిగి, పెను గాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో పాటు.. అలలు సాధారణం కంటే ఒక మీటర్‌ ఎగసిపడే అవకాశం ఉంది.

  దూసుకొస్తున్న తుపాను..! మరో రెండు రోజుల్లో ఉగ్రరూపం..!!

  దూసుకొస్తున్న తుపాను..! మరో రెండు రోజుల్లో ఉగ్రరూపం..!!

  ఈ నేపథ్యంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు రేపటిలోగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు హెచ్చరించారు. ఫణి తుఫాన్ ....ఈ తుఫానుకు బంగ్లాదేశ్‌ సూచించిన ఫణి పేరును ఖరారు చేయనున్నారు. దీనికి ముందు 2018 డిసెంబర్‌ మూడో వారంలో తుఫాను ఏర్పడింది. ఆ తుఫానుకు పెథాయ్‌ పేరును థాయ్‌లాండ్‌ సూచించింది. ఆ తర్వాత క్రమంలో బంగ్లాదేశ్‌ సూచించిన ఫణిని ప్రకటించనున్నారు. నిబంధనల ప్రకారం తుఫానుగా మారాకే పేరు పెడతారు. ఆ లెక్కన ఇప్పుడు ఏర్పడబోయే తుఫానుకు ఫణిగా శనివారం అధికారికంగా ప్రకటించనున్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Another storm threatened to Andhra Pradesh. A severe deterioration in the south-eastern Bay of the Indian Ocean became depleted Friday. According to the Indian Meteorological Department, 1140 km east-southeast of Sri Lanka, 1490 km southeast of Chennai and 1760 km south-east of Machilipatnam.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more