• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

విశాఖ గ్యాస్ లీకేజీలో కొత్త కోణం: ఎన్జీటీ నివేదిక: అవుట్ డేటెడ్ ట్యాంక్..టెంపరేచర్ సెన్సర్స్

|

విశాఖపట్నం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఉదంతంలో ఓ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ దుర్ఘటన చోటు చేసుకోవడానికి సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం ఓ ప్రధాన కారణమని తేలింది. కనీస భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం, గ్యాస్‌ను నిల్వ ఉంచడానికి ఏర్పాటు చేసిన ట్యాంకులకు నియంత్రణ పరికరాలను అమర్చకపోవడం వంటి కారణాలు అనేకం ఉన్నట్లు నిర్ధారితమైంది.

వైజాగ్ నాట్ ఫర్ సేల్: భూముల అమ్మకానికి నిరసనగా ఉద్యమిస్తోన్న విశాఖ: టీటీడీపై వెనక్కి తగ్గడంతో

13 మంది ప్రాణాలను బలి తీసుకున్న గ్యాస్

13 మంది ప్రాణాలను బలి తీసుకున్న గ్యాస్

విశాఖపట్నం రూరల్ జిల్లా పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో కిందటి నెల 7వ తేదీన విషవాయువులు వెలువడిన విషయం తెలిసిందే. స్టైరిన్ అనే గ్యాస్ లీక్ కావడం వల్ల 13 మంది మరణించారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రుల పాలయ్యారు. భోపాల్ గ్యాస్ లీకేజీ ఉదంతాన్ని గుర్తుకు తీసుకొచ్చిన ఈ ఘటన పట్ల రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. యావత్ దేశం ఉలిక్కిపడింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ ఉదంతం పట్ల తమ ఆందోళనను వ్యక్తం చేశారు.

ఎన్జీటీ నిపుణుల కమిటీ

ఎన్జీటీ నిపుణుల కమిటీ

గ్యాస్ లీకేజీ సంభవించడానికి గల కారణాలను అన్వేషించడానికి పలు జాతీయ సంస్థలు రంగంలోకి దిగాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ తన వైపు నుంచి కార్యకలాపాలను చేపట్టింది. అదే సమయంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు గల ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి గ్యాస్ లీక్ కావడానికి గల కారణాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) దర్యాప్తు కొనసాగిస్తోంది. దీనికోసం అయిదుమంది సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించింది. మాజీ న్యాయమూర్తి శేషశయన రెడ్డి ఈ కమిటీకి సారథ్యాన్ని వహిస్తున్నారు.

మానవ తప్పిదాలే కారణమంటూ..

మానవ తప్పిదాలే కారణమంటూ..

ఇటీవలే ఎల్జీ పాలిమర్స్ కంపెనీని సందర్శించిన ఈ కమిటీ అక్కడ కొన్ని భద్రతాపరమైన లోపాలను గుర్తించింది. వాటిని తన నివేదికలో పొందుపరిచింది. స్టైరిన్ గ్యాస్ లీకేజీ మానవ తప్పిదం ఉన్నట్లు పేర్కొంది ఈ కమిటీ. భద్రతా ప్రమాణాల వైఫల్యం, సంస్థ నిర్లక్ష్యం ప్రమాదానికి దారి తీసినట్లు స్పష్టం చేసింది. ఈ నివేదిక పై అభ్యంతరాలను స్వీకరించడానికి కంపెనీ యాజమన్యాన్ని సంప్రదించబోతోంది. దీనికి అనుగుణంగా ఎన్జీటి తదుపరి ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది.

అవుట్ డేటెడ్ ట్యాంక్

అవుట్ డేటెడ్ ట్యాంక్

స్టైరీన్ గ్యాస్‌ను నిల్వ ఉంచడానికి ఉపయోగించిన ట్యాంకు కాలం చెల్లిందని ఈ కమిటీ గుర్తించింది. 12 మీటర్ల ఎత్తు ఉన్న ఈ ట్యాంకులో గ్యాస్ ఏ స్థాయిలో నిల్వ ఉన్నదో, ఉష్ణోగ్రత ఎంతమేర నమోదు అవుతున్నదో గుర్తించడానికి ఎలాంటి పరికరాలు గానీ, సెన్సార్లు గానీ అందుబాటులో లేవని ఎన్జీటీ నిపుణుల కమిటీ గుర్తించింది. వాటిని సరిచేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అభిప్రాయపడింది.

 మ్యానువల్ అలారం..

మ్యానువల్ అలారం..

స్టోరేజీ ట్యాంకుల నుంచి గ్యాస్ లీక్ అయిన వెంటనే హెచ్చరించడానికి ఎలాంటి ఆధునిక పరికరాలు కూడా అందుబాటులో లేవని ఎన్జీటీ నిపుణుల కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఉన్న ఒక్క అలారం కూడా మనుషుల ద్వారానే ఆపరేట్ చేయాల్సి ఉంటుందని గుర్తించింది. గ్యాస్ లీక్ అయిన వెంటనే దాన్ని మోగించడానికి అనుకూల ప్రదేశంలో అది లేదని పేర్కొంది. గ్యాస్ వెలువడిన వెంటనే దాని ప్రభావాన్ని నియంత్రించడానికి నీటిని చల్లే పరికరాలు కూడా అందుబాటులో లేవని స్పష్టం చేసింది ఈ కమిటీ.

ఎన్జీటీ వద్ద వాదనలు..

ఎన్జీటీ వద్ద వాదనలు..

ఎల్జీ పాలిమర్స్ తరపున ఎన్టీజీ వద్ద సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా తన వాదనలను వినిపించారు. గ్యాస్ లీకేజీ ఘటనను సుమోటోగా విచారణ చేపట్టే అధికారం ఎన్జీటికీ లేదని వాదించారు. అయినప్పటికీ.. దీనికి భిన్నంగా సుమోటోగా కేసు స్వీకరించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున అది తేలేంత వరకూ ఎన్జీటీ తన దర్యాప్తును నిలిపివేయాలని కోరారు. దీనిపై ఎన్జీటీ తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించాల్సి ఉంది.

English summary
New Delhi: A committee appointed by India’s top environmental court has blamed “gross human failure” and lack of basic safety norms for a gas leak in a South Korean-owned chemical factory in Visakhapatnam that killed 13 people and sickened hundreds. The committee said the tanks from which the gas leaked on 7 May at the LG Polymers plant in Vishakhapatnam, a port city in Andhra Pradesh state, were outdated and lacked temperature sensors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more