విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సస్పెండైన డాక్టర్ సుధాకర్‌కు ఏమైంది?: చొక్కా లేకుండా గుండుతో రోడ్డుపై ఇలా..

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ సర్కారు కనీసం మాస్కులు కూడా ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేసిన నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ సుధాకర్ విశాఖలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పోర్టు ఆస్పత్రి దగ్గర్లో రోడ్డుపై పడుకుని నిరసనకు దిగారు.

శరీరంపై చొక్కా లేకుండా, చేతులు వెనక్కు కట్టేసుకుని ఆయన రోడ్డుపై నిరసన తెలిపారు. తన సస్పెన్షన్‌కు నిరసనగానే ఆయన ఇలా చేసినట్లు తెలుస్తోంది. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు డాక్టర్ సుధాకర్‌ను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 Suspended Doctor Sudhakar protested in visakhapatnam.

నెల రోజుల క్రితం ఆరోగ్యంగా కనిపించిన డాక్టర్ సుధాకర్ ప్రస్తుతం గుండుతో కొంచెం సన్నగా కనిపించారు. కనుబొమ్మలు కూడా లేవు ఆయనకు. మొదట విశాఖ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. ఆ తర్వాత డాక్టర్ సుధాకర్‌ను కేజీహెచ్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం ఆయనకు కౌన్సెలింగ్ అందిస్తారని వైద్యులు తెలిపారు.

కాగా, కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం పోరాడుతున్న వైద్యులకు కనీసం మాస్కులు, పీపీఈ కిట్లు కూడా ఏపీ సర్కారు ఇవ్వడం లేదంటూ సుధాకర్ ఇటీవల ఆరోపించారు. ఏప్రిల్ 7వ తేదీన ఆయన ప్రభుత్వంపై ఆరోపణలు చేయగా.. ఏప్రిల్ 8వ తేదీన ఆయనను సస్పెండ్ చేశారు. టీడీపీ ప్రోద్బలంతోనే ఆ డాక్టర్ సర్కారుపై విమర్శలు చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు.

English summary
Suspended Doctor Sudhakar protested in visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X