విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైమ్.. పోలీసులు చెయ్యేశారన్న చంద్రబాబు.. ఎన్‌కౌంటర్‌ చేయండంటూ..

|
Google Oneindia TeluguNews

''14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను.. 25 ఏళ్లుగా ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను.. 11 ఏళ్లపాటు ప్రతిపక్ష నేతగా పోరాడుతున్నాను.. 40 ఏళ్ల నా రాజకీయ జీవితంలో 11 మంది ముఖ్యమంత్రుల్ని చూశాను.. కానీ వైఎస్ జగన్ లాంటి దుర్మార్గుడిని మాత్రం ఎక్కడా చూడలేదు.. ఆయన ఆదేశాలతో పోలీసులు దారుణంగా ప్రవర్తించారు.. నా ఒంటిపై చేయేసి లాగే ప్రయత్నం చేశారు.. మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఈడ్చిపారేశారు.. '' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రఆవేదన వ్యక్తం చేశారు.

మూడేళ్ల పగ తీర్చుకున్న సీఎం జగన్.. విశాఖలో చంద్రబాబుకు అవమానం.. పెట్రోల్ బాటిళ్లతో వైసీపీ కలకలం..మూడేళ్ల పగ తీర్చుకున్న సీఎం జగన్.. విశాఖలో చంద్రబాబుకు అవమానం.. పెట్రోల్ బాటిళ్లతో వైసీపీ కలకలం..

నన్ను షూట్ చేయండి..

నన్ను షూట్ చేయండి..

రెండ్రోజుల ఉత్తరాంధ్ర పర్యటన కోసం గురువారం విశాఖ ఎయిర్ పోర్టకు వచ్చిన ఆయనను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఎయిర్ పోర్టు నుంచి బాబు కాన్వాయ్ ని కదలనీయకుండా దిగ్బంధించారు. నాలుగు గంటలు హైడ్రామా తర్వాత.. వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు రిక్వెస్ట్ చేయడంతో బాబు నో చెప్పారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా వెనక్కి వెళ్లమనడమేంటని పోలీసులపై మండిపడ్డారు. ‘‘అవసరమైతే నన్ను షూట్ చేయండి.. ఎన్‌కౌంటర్ చేయండి.. కానీ చట్టప్రకారం అనుమతించి.. ఇప్పుడు వెళ్లిపోమంటే మాత్రం కుదరదు..''అని చంద్రబాబు ఫైరయ్యారు.

సైకోలుగా మార్చుతున్నారు..

సైకోలుగా మార్చుతున్నారు..


‘‘జగన్ అందరినీ సైకోలుగా మార్చుతున్నాడు. పోలీసులు పర్మిషన్ ఇవ్వకుంటే నేను వైజాగ్ వచ్చేవాడినే కాదు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మళ్లీ డ్రామాలాడుతున్నారు. వైసీపీవాళ్లు డబ్బులిచ్చి కొంతమందిని తీసుకొచ్చారు. వాళ్లు.. కోడిగుడ్లు, రాళ్లు, చెప్పులు, వాటర్ బాటిళ్లతో మాపై దాడి చేశారు. అరగంట తర్వాత పంపుతాం.. గంట తర్వాత పంపుతాం.. అని టైం వేస్టు చేసిన పోలీసులు.. చివరికి వెనక్కి వెళ్లిపోవాని అన్నారు. చట్టానికి ఎప్పుడూ సహకరించే నేను.. ఏ చట్టం ప్రకారం వెనక్కి వెళ్లమంటున్నారో రాసిస్తే వెళ్లిపోతానని చెప్పాను''అని చంద్రబాబు మీడియాకు వివరించారు. అనంతరం ఆయనను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి..

హైటెన్షన్.. పోలీసుల వలయం..

హైటెన్షన్.. పోలీసుల వలయం..

విశాఖ ఎయిర్ పోర్టు బయటి నుంచి చంద్రబాబును మళ్లీ లోపలికి పంపేందుకు పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. ఏ చట్టం ప్రకారం వెనక్కి పంపుతారో చెప్పాలని ఆయన భీష్మించడంతో తరలింపు ప్రక్రియ ఉద్రిక్తంగా మారింది. తీవ్ర వాగ్వాదం, హెచ్చరికల తర్వాత బాబు ఎట్టకేలకు కారు ఎక్కడంతో.. ఆయన చుట్టూ వలయంగా ఏర్పడిన పోలీసులు.. ఎయిర్ పోర్టు లాబీలోకి తీసుకెళ్లారు.

Recommended Video

Go Back Chandrababu Slogans By Activists At Visakhapatnam | Oneindia Telugu

తిరుగుబాటు తప్పదు..

సీఎం జగన్ పాలనపై జనం అసంతృప్తిగా ఉన్నారని, రాబోయే రోజుల్లో వైసీపీ సర్కారు చేయబోయే ఆగడాలు చూసిన తర్వాత ప్రజలే తిరుగుబాటు చేస్తారని చంద్రబాబు అన్నారు. ‘‘సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నన్నే ఇంత దారుణంగా ఇబ్బంది పెడుతున్నారంటే సామాన్యుల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఆలోంచండి.. అడిగేవాడే లేరన్నట్లుగా వైసీపీ దౌర్జర్యాలు చేస్తున్నది.. వీళ్లకు ప్రజలే బుద్ధి చెబుతారు''అని బాబు హెచ్చరించారు.

English summary
tdp chief chandrababu slams cm jagan for stopping him at Visakhapatnam Airport on Thursday. he accused that jagan is making everyone as psychos
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X