విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ ప్రజలు రాజధాని కోరుకోవట్లేదు- ఎంపీ సీటు ఉపఎన్నికకు రెడీనా- అయ్యన్న కామెంట్స్‌ ‌..

|
Google Oneindia TeluguNews

మూడు రాజధానులపై ఉత్తరాంధ్రలో అధికార, విపక్షాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తారా స్ధాయికి చేరుతోంది. మూడు రాజదానులు ఏర్పాటులో భాగంగా విశాఖకు కార్యనిర్వాహక రాజధాని ఇచ్చిన వైసీపీ.. ఇప్పుడు అదే అజెండాగా టీడీపీని టార్గెట్‌ చేస్తోంది. దీంతో ఆ పార్టీ నేతలు కూడా ఇందుకు దీటుగా బదులిస్తున్నారు.

మూడు రాజధానుల అజెండాతో ఉత్తరాంధ్రతో తనపై పోటీ చేసి గెలవాలని డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. దీనిపై స్పందించిన ఆ పార్టీ నేత అయ్యన్నపాత్రుడు, ఎక్కడో ఎందుకు విశాఖ పార్లమెంటు స్ధానంలోనే ఉప ఎన్నికకు సిద్ధం కావాలని వైసీపీకి ప్రతిసవాల్‌ విసిరారు. రాజధాని అంశంపై విశాఖ ఎంపీ సీటులో ఉప ఎన్నిక పెట్టి తేల్చుకుందామని, ఇందుకు మంత్రి ధర్మాన సిద్ధమా అని అయ్యన్న ప్రశ్నించారు. దీంతో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్ధాయికి చేరినట్లయింది.

tdp leader ayyannapatrudu challenges ysrcp to ready for by election in visakha mp seat

గతంలో అమరావతి రాజధానా , విశాఖ రాజధానా అనే అంశంపై అసెంబ్లీ రద్దు చేయాలని చంద్రబాబు కోరితే జగన్ పారిపోయారని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఇప్పుడు విశాఖ లోక్‌సభ స్ధానంలో ఉప ఎన్నికకు వెళ్తే ప్రజల ఉద్దేశమేంటో తెలిసిపోతుందని అయ్యన్న పేర్కొన్నారు. విశాఖ ప్రజలు రాజధాని కోరుకోవడం లేదని, ఇప్పటికే రౌడీయిజం, భూకబ్జాలు, దౌర్జన్యాలు, దందాలతో అక్కడి ప్రజలు బెంబేలెత్తిపోయారని అయ్యన్న తెలిపారు. పత్రికలు రాసేందుకు కూడా సిగ్గుపడేలా మంత్రి ధర్మాన చంద్రబాబుపై అసహ్యంగా మాట్లాడారని, వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలకు బూతులు తిట్టడమే పనా,

Recommended Video

#Watch YS Jagan Claps For AP Grama Sachivalayam Volunteers | Oneindia Telugu

మహిళలు వైకాపా నేతల బూతులు వినలేక టీవీలు కట్టేస్తున్నారని అయ్యన ఆరోపించారు.

English summary
tdp senior leader ayyannapatrudu demands ysrcp to come forward for by election in visakhapatnam parliament seat on three capitals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X