విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ మంత్రులకు సీఎం టాస్క్: టీడీపీ నేతకు ట్రాప్: వైసీపీలోకి వస్తే మేయర్ పదవి..!

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసీపీ విశాఖ నగరం మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇప్పుడు ఏకంగా విశాఖ నగరాన్ని పరిపాలనా రాజధానిగా చేయటానికి వేగంగా అడగులు వేస్తోంది. 2019 ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటును గెలవటంతో పాటుగా అధిక స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అక్కడే టీడీపీ సైతం నాలుగు అసెంబ్లీ సీట్లు దక్కించుకుంది. ఇక, గాజువాక నుండి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోయారు.

దీంతో..ఇక ఇప్పుడు విశాఖ మేయర్ స్థానం దక్కించుకోవాలని వైసీపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా..టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే...రాజకీయ కుటుంబానికి చెందిన నేతను వైసీపీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ విశాఖ జిల్లా మంత్రితో పాటుగా ఇన్ ఛార్జ్ మంత్రికి ఆ బాధ్యతలు అప్పగించారు. ఆయన వైసీపీలోకి వస్తే మేయర్ పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన పార్టీ మారకుండా టీడీపీ ముఖ్య నేతలు జాగ్రత్త పడుతున్నా..ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఆయన వైసీపీలో చేరటం ఖాయమని తెలుస్తోంది.

గాజువాక టీడీపీ మాజీ పల్లా శ్రీనివాస్‌కు గాలం

గాజువాక టీడీపీ మాజీ పల్లా శ్రీనివాస్‌కు గాలం

విశాఖ నగరపాలక సంస్థకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా అక్కడ వైసీపీ జెండా ఎగరాలని పార్టీ ముఖ్యులు పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగా.. మేయర్‌ స్థానాన్ని బీసీలకు, అందులోనూ యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి ఇవ్వాలని యోచిస్తోంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును పార్టీలోకి తీసుకువచ్చి, మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించాలని అధిష్ఠానం భావిస్తోంది. సౌమ్యుడిగా, వివాదరహితునిగా పేరున్న పల్లా శ్రీనివాస్‌ను గత ఎన్నికలు ముగిసిన నాటి నుంచే వైసీపీలోకి లాగాలని ఆ పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలోనే పల్లాతో చర్చలు సాగాయి. వైసీపీలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. గాజువాక నుండి ఓడిన పల్లా టీడీపీ అధినేత అక్కడ ప్రచారానికి రాకుండా..పవన్ కళ్యాణ్ కు పరోక్షంగా సహకరించారనే ప్రచారం పైన ఓపెన్ గా మాట్లాడకపోయినా..ఆ ప్రభావం ఉందనే భావనతో ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఇద్దరు మంత్రులకు బాధ్యతలు..

ఇద్దరు మంత్రులకు బాధ్యతలు..

విశాఖ వ్యవహారాల పైన సీఎం జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు. అందులో భాగంగా..ఈ నెల ఒకటో తేదీన సీఎం పేషీకి రావాలని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబుకు ఆ ముందురోజు సమాచారం వచ్చింది. అత్యవసరమని చెప్పడంతో వారిద్దరూ వెళ్లగా వారితో పాటు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌ జీవీఎంసీ ఎన్నికల గురించి వారితో చర్చించారు. టీడీపీ నాయకుడు, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ను పార్టీలోకి తీసుకురావాలని, ఇదంతా వారం రోజుల్లో పూర్తి కావాలని వారికి బాధ్యత అప్పగించారు.

విశాఖ మేయర్ అభ్యర్థి పల్లా శ్రీనివాసే: జగన్

విశాఖ మేయర్ అభ్యర్థి పల్లా శ్రీనివాసే: జగన్

ఆయనే విశాఖ మేయర్‌ అభ్యర్థి అని, ముగ్గురూ కలిసి ఈ పని పూర్తిచేయాలని సూచించినట్లుగా సమాచారం. పల్లా శ్రీనివాస్‌ను పార్టీలోకి తీసుకువస్తానంటూ మంత్రి అవంతి నేరుగా సీఎంకు మాట ఇచ్చారు. వెంటనే విశాఖ వచ్చిన ఆయన పల్లా శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. స్వయంగా ముఖ్యమంత్రే ఆహ్వానిస్తున్నారని, మంచి అవకాశం వదులుకోవద్దని, వెంటనే పార్టీలో చేరాలని కోరారు. పల్లా శ్రీనివాస్‌ భార్య ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌. విద్యాపరమైన పరిచయాలు వుండడంతో మంత్రి దీనిపై ఆమెతో కూడా చర్చించారు. చాలా మంచి అవకాశమని వదులుకోవద్దని సూచించారు.

Recommended Video

Botsa Satyanarayana Reacts On Chandrababu's Vizag Airport Issue | Oneindia Telugu
 రంగంలోకి చంద్రబాబు..అడ్డుకొనేందుకు

రంగంలోకి చంద్రబాబు..అడ్డుకొనేందుకు

పల్లా శ్రీనివాస్‌ను వైసీపీలోకి తీసుకువెళ్లాలని గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వెంటనే రంగంలోకి దిగారు. జిల్లాలో పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడుతూ, బీసీల రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టులో పార్టీ తరపున కేసు వేస్తున్నామని, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కొల్లు రవీంద్ర తదితరులు ఢిల్లీలో వున్నారని..వారితో కలిసి అందులో పాల్గొనాలంటూ స్వయంగా చంద్రబాబు సూచించటంతో పల్లా శ్రీనివాస్‌ బయలుదేరి ఢిల్లీకి వెళ్లారు. అయితే, విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే లోగానే..పల్లా వైసీపీలోకి వస్తారంటూ అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

English summary
Amid the attempts in making visakhapatnam as executive capital, YCP had focused on the TDP leaders. On the other hand YCP had eyed on the Mayor seat as well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X