విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైతుల పోరాటానికి బాసటగా .. కేంద్రం అన్నదాతల సూచనలు తీసుకోవాలన్న టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

|
Google Oneindia TeluguNews

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై దేశ వ్యాప్త ఆందోళనలు కొనసాగాయి. 13 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు ఈరోజు భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగింది. ఊహించని విధంగా రైతులకు మద్దతుగా పలు రాజకీయ పార్టీలు భారత్ బంద్ ను కొనసాగించాయి. రైతులు కోరుకున్నట్లుగానే భారత్ బంద్ సామాన్యులకు ఇబ్బందులు కలిగించకుండా ప్రశాంతంగా ముగిసింది.

 వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చెయ్యాలన్న ఎంపీ

వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చెయ్యాలన్న ఎంపీ


కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చిన రైతులకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టిడిపి ఎంపీలు ఉన్నతాధికారులకు వినతి పత్రాలను ఇచ్చారు. ఈ రోజు భారత్ బంద్ సందర్భంగా రైతులకు సంబంధించిన అంశం పై మాట్లాడిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు
వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు దేశ వ్యాప్తంగా రైతులు తమ నిరసన గళం వినిపిస్తున్న నేపథ్యంలో, రైతుల ఆందోళనలు అర్థం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

శ్రీకాకుళం డిఆర్ వో కు వినతి పత్రం.. చట్టాలపై స్పష్టంగా ప్రకటన చెయ్యాలని విజ్ఞప్తి

శ్రీకాకుళం డిఆర్ వో కు వినతి పత్రం.. చట్టాలపై స్పష్టంగా ప్రకటన చెయ్యాలని విజ్ఞప్తి

తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు గుండా లక్ష్మీదేవి , బగ్గు రమణమూర్తి తో కలిసి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం డిఆర్ వో కు వినతి పత్రం అందజేశారు. మార్కెట్ కమిటీ యార్డులపై కేంద్ర ప్రభుత్వం సూచనలు చేయకపోతే నిర్వీర్యం అయ్యే పరిస్థితి తలెత్తుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాల్లో స్పష్టత లేదని, చట్టాల పై పలు అనుమానాలు ఉన్నాయని, రైతుల భయాలు ఉన్నాయని, వాటిని తొలగించేలా ప్రభుత్వం ప్రకటన చేయాలని కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్రాన్ని కోరారు.

పార్లమెంట్ లో మాట్లాడటానికి వైసీపీ సభ్యులకు భయం

పార్లమెంట్ లో మాట్లాడటానికి వైసీపీ సభ్యులకు భయం


ఇదే సమయంలో పార్లమెంట్లో కేంద్రంపై మాట్లాడడానికి వైసిపి సభ్యులు భయపడుతున్నారని విమర్శించారు. కానీ టిడిపి సభ్యులు రాజీలేకుండా టీడీపీ వాణిని పార్లమెంట్లో వినిపిస్తామని ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, రైతులతో జరుపుతున్న సంప్రదింపుల్లో అన్నదాతల సూచనలు తీసుకుంటే బాగుంటుందని, త్వరితగతిన రైతుల సమస్యలు పరిష్కరిస్తే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు.

English summary
TDP MP Rammohan Naidu spoke on the issue of farmers during the Bharat Bandh. He appealed to the central government to reconsider the issue of agricultural laws. The central government is of the view that it would be better to take the suggestions of farmers in talks with the farmers and resolve the problems of the farmers expeditiously.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X