విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెగించిన టీడీపీ..విశాఖలో దూకుడు: వైసీపీ కంటే రెండడుగులు ముందే: ఏరికోరి మేయర్ అభ్యర్థి ఖరారు..

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖపట్నం నగరం పరిధిలో తెలుగుదేశం పార్టీ తెగింపు ధోరణిని ప్రదర్శిస్తోంది. దూకుడును కొనసాగిస్తోంది. విశాఖలో మొన్నటిదాకా వలసలను ఎదుర్కొన్నప్పటికీ.. తమ పార్టీలో నాయకత్వ లోటుకు, నాయకులకు కొరత లేదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే రెండడుగులు ముందే ఉంటోంది. ఆ పార్టీ కంటే ముందే మేయర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఆయన పేరును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

జగన్ ఆధునిక హిట్లర్..అమిత్ షా..అభినవ సర్దార్: బలం ఉందనే భౌతికదాడులు పవన్ కల్యాణ్..!జగన్ ఆధునిక హిట్లర్..అమిత్ షా..అభినవ సర్దార్: బలం ఉందనే భౌతికదాడులు పవన్ కల్యాణ్..!

మేయర్ అభ్యర్థిగా గండి బాబ్జీ..

మేయర్ అభ్యర్థిగా గండి బాబ్జీ..

పార్టీ సీనియర్ నాయకుడు గండి బాబ్జీని మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసింది. వలసలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నాయకుల పేర్లను వడబోసి మరీ.. గండి బాబ్జీ పేరును ఖరారు చేసింది. ఇదివరకు పీలా శ్రీనివాస్, గండి బాబ్జీ, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, తిప్పల గురుమూర్తి రెడ్డి పేర్లను పరిశీలించింది. వారిలో తిప్పల గురుమూర్తి రెడ్డి అనూహ్యంగా అధికార పార్టీ కండువాను కప్పుకొన్నారు. పల్లా శ్రీనివాస్ ఎమ్మెల్యేగా శాసనసభకు ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నందున ఆయన పేరుపై పెద్దగా ఆసక్తి చూపలేదు.

పీలా శ్రీనివాస్, గండి బాబ్జీల్లో

పీలా శ్రీనివాస్, గండి బాబ్జీల్లో

ఇక పీలా శ్రీనివాస్, గండి బాబ్జీల పేర్లపై కొందరు పార్టీ సీనియర్ నాయకుల అభిప్రాయాలను సేకరించింది. మెజారిటీ నాయకులు గండి బాబ్జీ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీనితో ఆయన పేరును ఖరారు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో మేయర్ అభ్యర్థిగా గండి బాబ్జీ పేరును ప్రకటించిన తరువాతే ప్రచార కార్యక్రమాలను దిగబోతోంది. గండి బాబ్జీ శుక్రవారమే తన నామినేషన్‌ను దాఖలు చేశారు. విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టారు.

గండి బాబ్జీ మీదే ప్రచార బాధ్యతలు..

గండి బాబ్జీ మీదే ప్రచార బాధ్యతలు..


మేయర్ అభ్యర్థిగా తన పేరును ప్రకటించడంతో ఆయన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలో పార్టీని గెలిపించే బాధ్యతను భుజాల మీద వేసుకున్నారు. జీవీఎంసీ పరిధిలో అత్యధిక స్థానాలను గెలుచుకోవడానికి ఆయన కసరత్తు చేస్తున్నారు. దీనికోసం పార్టీలో నెలకొన్న విభేదాలను తొలగించడంపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణబాబులతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని వినియోగించుకుంటున్నారు.

ఎమ్మెల్యేలతో ప్రచారం..

ఎమ్మెల్యేలతో ప్రచారం..

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సీనియర్ నేతలతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాస్ వర్గం సహకారాన్ని తీసుకుంటున్నారు. గంటా శ్రీనివాస్ ఈ ప్రచారానికి దూరంగా ఉండొచ్చని తెలుస్తోంది. చాలాకాలంగా గంటా శ్రీనివాస్.. టీడీపీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన వర్గాన్ని తన వైపు గండి బాబ్జీ ఎలా తిప్పుకోగలరనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గంలో మెజారిటీ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అంటున్నారు.

English summary
Telugu Desam Party senior leader Gandi Babji is likely to be Mayor Candidate of Visakhapatnam. TDP top cadre leaders including former Chief Minister Chandrababu may soon announced his candidature.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X