• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపిలో తెలంగాణ పోలీసులు : ఏపి పోలీసుల నామ్ కే వాస్తే : ఏం జ‌రుగుతోంది..!

|

ఏపిలో తెలంగాణ పోలీసులు. ఏ రాష్ట్రంలోకి విఐపిలు వ‌చ్చినా..ప్ర‌ముఖులు వ‌చ్చినా..వారి వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా సిబ్బంది మాత్ర‌మే వ‌స్తారు. మిగిలిన భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాలు..వారి ప్రోటోకాల్ అంశాలు స్థానిక ప్ర‌భుత్వాలే చూసుకుంటాయి. వ‌చ్చి న ప్ర‌ముఖులు భ‌ద్ర‌త కూడా స్థానిక ప్ర‌భుత్వానిదే. అయితే, తెలంగాణ పోలీసులు ఏపి వ‌చ్చి..త‌మ నేత భ‌ద్ర‌త తామే చూసుకుంటామ‌నేలా వ్య‌వ‌హ‌రిస్తే..ఏపి పోలీసులు నామ మాత్రంగా ప‌రిమ‌త‌మ‌వుతే.. ఏం జ‌రుగుతోంది..

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏపిలో విశాఖ కు వ‌చ్చారు. న‌గ‌రంలోని శార‌దా పీఠంకు చేరుకొని అక్క‌డ ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. అయితే, తెలంగాణ ముఖ్య‌మంత్రి విశాఖ ప‌ర్య‌ట‌న కోసం తెలంగాణ నుండి ఇంట‌లిజెన్స్ వ్య‌వ‌స్థ తో పాటుగా లా అండ్ ఆర్డ‌ర్ పోలీసులు సైతం ముందుగానే విశాఖ వ‌చ్చారు. శార‌దా పీఠం వ‌ద్ద తెలంగాణ పోలీ సులే బందోబ‌స్తును ప‌ర్య‌వేక్షించారు. కేసీఆర్ ను ఎవ‌రెవ‌రు క‌ల‌వాల‌నేదీ తెలంగాన పోలీసులే చూసుకున్నారు.

Telangana Police in Visakha .. KCR tour under T.S Police..

వారు అనుమ‌తి ఇచ్చిన త‌రువాత‌నే ఏపీ పోలీసులు లోప‌లికి పంప‌డం జ‌రిగింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. ఏపి కి వ‌చ్చిన తెలంగాణ ముఖ్య‌మంత్రికి ఏపి పోలీసులు నిర్వ‌హించాల్సిన బాధ్య‌త‌ల్లో తెలంగాణ పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నార‌నేదే ఇప్పుడు ప్ర‌శ్న‌. స‌హ‌జంగా ఏ ముఖ్య‌మంత్రి మ‌రే రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వెళ్లినా..పర్స‌న‌ల్ సెక్యూరిటీ మిన‌హా..మిగిలిన భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాలు స్థానిక ప్ర‌భుత్వాలే చూసుకుంటాయి. కానీ, కేసీర్ విష‌యంలో మాత్రం విశాఖ లో మొత్తం తెలంగాణ పోలీసులే అంతా తామై వ్య‌వ‌హ‌రించారు.

రైతన్నను విస్మరించిన ముఖ్యమంత్రులు.. నేతలందరిదీ అదే దారి..!

ఎందుకిలా జ‌రిగింది..జ‌గ‌న్ పై దాడే కార‌ణ‌మా..

విశాఖ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేసీఆర్ కు మొత్తం తెలంగాణ పోలీసులే భ‌ద్ర‌తా ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌టానికి ఏపి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిందా అనేదే ప్ర‌శ్న‌. ఇస్తే అలా ఎందుకు ఇవ్వాల్సి వ‌చ్చింది. సాధార‌ణంగా ఇంట‌లిజెన్స్ విభాగం త‌మ‌కు కావాల్సిన స‌మ‌చారం కోసం వ‌స్తూ ఉంటారు. అందులో ఇబ్బంది లేదు. కానీ, ఏపి భూ భాగంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు బాధ్య‌తలు నిర్వ‌హించ‌ట‌మే ఆశ్చ‌ర్యంగా క‌నిపిస్తోంది. విశాఖ లో కొద్ది రోజుల క్రితం వైసిపి అధినేత జ‌గ‌న్ పై జ‌రిగిన దాడిని దృష్టిలో ఉంచుకొనే తెలంగాణ పోలీసులు ఇంత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించారా అనే సందేహాలు మొద‌ల‌య్యాయి.

మ‌రి..ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తెలంగాన ప్రాంతానికి వెళ్లినా..అక్క‌డ ఏవైనా స‌మావేశాలు ఏర్పాటు చేసినా..అక్క‌డి పోలీసులే భ‌ద్ర‌తా ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. మ‌రి..విశాఖ లో మాత్రం ఎందుకిలా జ‌రిగింది...ఇప్పుడు కేసీఆర్ విష‌యంలో జ‌రిగిన విధంగా..ఇత‌ర ముఖ్య‌మంత్రులు సైతం ఏపి లో కి వ‌చ్చే స‌మ‌యంలో త‌మ రాష్ట్ర సిబ్బందిని తెచ్చుకుంటామ‌ని చెబితే..ఇలాగే అంగీక‌రిస్తారా..ఏపి ప్ర‌భుత్వం అధికారి కంగా అనుమ‌తి ఇచ్చినా..కూడా ఈ ర‌క‌మైన వ్య‌వ‌హార శైలి మాత్రం భ‌ద్ర‌త కోసం ప‌ని చేసే వ్య‌వ‌స్థల మీద కొత్త త‌ర‌హా అనుమానాల‌కు ఆస్కారం ఇచ్చిన‌ట్ల‌వుతోంద‌నే ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది..

English summary
Telangana Police duty in AP. In Telangana C.M tour of visakha Totally Telangana Police taken are of KCR. AP Police only done traffic duty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X