• search
 • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీలో రాజ్యాంగం అమలు కావడం లేదు.!డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్.!

|

విశాఖపట్టణం/హైదరాబాద్ : రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దళితులను, దళిత మేధావులను వెంటాడి, వేధించి, చంపేస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్ మండిపడ్డారు. విశాఖ పర్యటనలో భాగంగా లోకేష్ ఇటీవల మరణించిన డాక్టర్ సుధాకర్ కుంటుంబాన్ని పరామర్శించారు. దళిత డాక్టర్ సుధాకర్ ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని, ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఒక గొప్ప డాక్టర్ ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బలి తీసుకుందని ఘాటు వ్యాఖ్యలు చేసారు.

  Narsipatnam Dr Sudhakar Case : CBI's First Move
  లోకేష్ విశాఖ పర్యటన.. డాక్టర్ సుధాకర్ కుటుంబాన్న పరామర్శించిన చినబాబు..

  లోకేష్ విశాఖ పర్యటన.. డాక్టర్ సుధాకర్ కుటుంబాన్న పరామర్శించిన చినబాబు..


  డాక్టర్ సుధాకర్ మాస్క్ ఇవ్వమని అడిగినందుకు ప్రభుత్వం ఆయన పై కక్ష కట్టిందని, నడి రోడ్డు పై పడేసి చేతులు వెనక్కి విరిచి వేధించి పిచ్చోడనే ముద్ర వేసారని లోకేష్ మండిపడ్డారు. ఆసుపత్రిలో ఉన్న లోపాలు బయటపెట్టినందుకే స్థానిక ఎమ్మెల్యే తనని టార్గెట్ చేసారని డాక్టర్ సుధాకర్ చెప్పారని లోకేష్ గుర్తు చేసారు.సుధాకర్ విషయంలో ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుని వివరిస్తూ తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత రాసిన లేఖను హై కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిందని లోకేష్ తెలిపారు.

  దళితుల పై దాడులు ఆపాలి.. డాక్టర్ సుధాకర్ ది ప్రభుత్వ హత్యేనన్న లోకేష్..

  దళితుల పై దాడులు ఆపాలి.. డాక్టర్ సుధాకర్ ది ప్రభుత్వ హత్యేనన్న లోకేష్..


  గాయాలతో పాటు ఆయన మానసిక స్థితిపై ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు నివేదికలపై ఆగ్రహం వ్యక్తం చేసిన హై కోర్టు సీబీఐ దర్యాప్తు కి ఆదేశించింది. అయినా ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ సుధాకర్ ని ప్రశాంతగా ఉండనివ్వలేదని నిప్పులు చెరిగారు లోకేష్. మంత్రులు నేరుగా బెదిరింపులకు దిగారని, తప్పు ఒప్పుకుంటే ఉద్యోగం ఉంటుంది లేకపోతే ఇబ్బందులు తప్పవు అని బెదిరించారని, జూన్ 6, 2020 న సీబీఐ కేసు రిజిస్టర్ చేసిందని, సెప్టెంబర్ 2 ,2020 న డాక్టర్ సుధాకర్ కేసులో కుట్ర కోణం ఉందని సీబీఐ హై కోర్టుకి నివేదిక అందజేసిందని లోకేష్ గుర్తు చేసారు.

  ఏపీలో అంబేడ్కర్ రాజ్యాంగం కాదు.. రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందన్న టీడిపి ఎమ్మెల్సీ..


  కాగా తుది నిర్ణయం వచ్చే లోపే డాక్టర్ సుధాకర్ చనిపోవడం బాధాకరమని లోకేష్ ఆవేదన వ్యక్తం చేసారు. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి టిడిపి అండగా ఉంటుందని, ప్రభుత్వం తక్షణమే ఆయన కుటుంబానికి న్యాయం చెయాలని లోకేష్ డిమాండ్ చేసారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య కాబట్టి కోటి రూపాయిలు ఆర్థిక సహాయం కుటుంబానికి ప్రభుత్వం అందజేయ్యాలని లోకేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నందుకు దళిత యువకుడు వరప్రసాద్ కి పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టించారని, చీరాల లో మాస్క్ పెట్టుకోలేదని దళిత యువకుడు కిరణ్ ని పోలీస్ స్టేషన్ లో కొట్టి చంపారని లోకేష్ అన్నారు.

  దళితులపై దాడులు.. జగన్ ప్రభుత్వంలో సాదారణంగా మారిపోయాయన్న లోకేష్..


  లిక్కర్ మాఫియా గురించి మాట్లాడి జగన్ బ్రాండ్స్ పేరుతో జరుగుతున్న దోపిడీ బయటపెట్టి నందుకు చిత్తూరు జిల్లా లో ఓం ప్రతాప్ ని చంపేశారని, చిత్తూరు జిల్లా లో వైసిపీ నాయకుల అవినీతికి సహకరించలేదని డాక్టర్ అనితా రాణిని వేధించారని, జగన్ రెడ్డి గారి సొంత జిల్లాలో దళిత మహిళ నాగమ్మ ని అత్యంత కిరాతకంగా చంపేస్తే పట్టించుకున్న నాతుడు లేడని ఆవేదన వ్యక్తం చేసారు. దళితులంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత చిన్న చూపో ఈ ఘటనల ద్వారా అర్ధం చేసుకోవచ్చని లోకేష్ వివరించారు.

  English summary
  TDP national general secretary Nara Lokesh alleged that Dalits in the state were left without protection and that AP CM Jaganmohan Reddy was chasing, harassing and killing Dalits and Dalit intellectuals. As part of his visit to Visakhapatnam, Lokesh visited the family of the recently deceased Dr Sudhakar.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X