విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎస్ కు ఎస్ఈసీ రాసిన లేఖ టీడీపీ నేతలు రాసినట్టు ఉంది : మంత్రి అవంతి తీవ్ర వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

సీఎస్, ఎస్ఈసీల మధ్య కొనసాగిన లేఖాస్త్రాలపై ఏపీలో దుమారం నెలకొంది. ఏపీ సీఎస్ ఎన్నికలను నిర్వహించాలని లేఖ రాయటంతో ఆ లేఖకు గట్టిగా సమాధానం ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమేష్ కుమార్ ఎన్నికల వాయిదా నిర్ణయమే తుది నిర్ణయమని తేల్చి చెప్పారు. ఇక ఇప్పుడు ఎన్నికల కమీషనర్ రాసిన లేఖపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రాసిన లేఖ టీడీపీ నేతలు రాసిచ్చినట్టు ఉందని మంత్రి అవంతి శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు .

ఎస్ఈసీకి, సీఎస్ నీలం సాహ్ని లేఖ రాయటం సర్వీస్ నిబంధనల ఉల్లంఘనా ? సివిల్ సర్వీస్ నిపుణుల్లో చర్చఎస్ఈసీకి, సీఎస్ నీలం సాహ్ని లేఖ రాయటం సర్వీస్ నిబంధనల ఉల్లంఘనా ? సివిల్ సర్వీస్ నిపుణుల్లో చర్చ

ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ కు చంద్రబాబే బాస్

ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ కు చంద్రబాబే బాస్

ఎన్నికల కమీషనర్ ఎన్నికల వాయిదా నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని చెప్పిన నేపధ్యంలో టీడీపీ నేతలపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు మండిపడ్డారు. సీఎస్‌కు ఎన్నికల కమిషనర్‌ రాసిన లేఖ టీడీపీ నాయకులు రాసినట్లుందని పేర్కొన్న మంత్రి ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ కు చంద్రబాబే బాస్ అన్నట్టు ఉన్నారని మండిపడ్డారు. రమేష్‌కుమార్ ఇప్పటికైనా యధార్దంలోకి రావాలని, వాస్తవాలను గ్రహించాలని పాత బాస్ అయిన చంద్రబాబుని ఇప్పటికీ ఆయనే బాస్ అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత లేదా ?

ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత లేదా ?

ఇక ఎన్నికలు వాయిదా వేసే ముందు ఒకసారి ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించిన అవంతి శ్రీనివాస్ ఎవరిని అడిగి ఎన్నికలను వాయిదా వేశారు? అని నిలదీశారు . ఎన్నికలు ఆపటం వల్ల ఏపీలో ప్రజలకు అందించాల్సిన సేవలు అందకుండా పోయాయని అన్నారు . 3 రోజులు ఆగితే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వచ్చే వాళ్లని, స్థానిక గ్రామాల్లో అన్ని సేవలు అందించేవారని అవంతి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

 కేంద్రం నుండి రావాల్సిన నిధులకు హామీ ఇవ్వండన్న మంత్రి అవంతి

కేంద్రం నుండి రావాల్సిన నిధులకు హామీ ఇవ్వండన్న మంత్రి అవంతి

ఇక కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని అడ్డుకుని స్థానిక సంస్థలను బలోపేతం కాకుండా చేస్తున్నారని అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. వీటికి చంద్రబాబు సమాధానం చెప్పాలని, బీజేపీ, జనసేన మాకు ఒక క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ నిధులు ఇప్పిస్తామని హామీ ఇవ్వండి చూద్దామని అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఆ డబ్బులు వస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. కావాలని అభివృద్ధిని అడ్డుకున్నారని మండిపడ్డారు. కేంద్రం నుండి నిధులు రాకుండా చేసిన కుట్ర అని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
AP CS wrote a letter to the election commissioner to conduct local body elections and need not to postpone . Replying to CS Neelam Sahni's letter, state election chief Ramesh Kumar wrote a reply letter that the postponement of the election is final. with this reply ycp minister avanti srinivas fired on state election commissioner. He alleged that tdp leaders wrote the letter and gave to election commissioner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X