విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జీఎన్ రావు కమిటీ సూచనలు ఇవే...విశాఖలోనే సెక్రటేరియట్...సమ్మర్ అసెంబ్లీ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల అభిప్రాయానికి తగ్గట్టుగానే నివేదిక ఇచ్చామని జీఎన్ రావు కమిటీ తెలిపింది. కాగా రాష్ట్రంలో అభివృద్ది వికేంద్రికరణ జరగాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే అభివృద్ది కోసం రెండెంచల విధానాన్ని సూచించామని చెప్పారు. కాగా రాష్ట్రాల్లో ప్రాంతీయ అసమానతలు ఉన్నాయని కమిటీ తెలిపింది. అందుకే అధికారాలను వికేంద్రీకరణ చేయాలని సూచించినట్టు చెప్పారు.

ఏపీ రాజధాని నివేదిక రెఢీ... సీఎం జగన్‌కు అందించిన జీఎన్ రావు కమిటీ ఏపీ రాజధాని నివేదిక రెఢీ... సీఎం జగన్‌కు అందించిన జీఎన్ రావు కమిటీ

నాలుగు రిజియన్‌లుగా రాష్ట్రం

నాలుగు రిజియన్‌లుగా రాష్ట్రం

రాష్ట్రాన్ని మొత్తం నాలుగు రిజీయన్‌లు ఏర్పాటు చేయాలని సూచించినట్టు తెలిపారు. ఇందులో భాగంగానే ఉత్తర కోస్తా రిజియన్, మధ్య, దక్షిణ కోస్తా, రాయలసీమ రిజీయన్‌లుగా విభించాలని కోరినట్టు చెప్పారు. కర్ణాటక తరహాలో ఇక్కడ పరిపాలన ఉండాలని సూచించినట్టు చెప్పారు. ముఖ్యంగా ఉత్తర రిజియన్‌లో విజయనగరం, సెంట్రల్ కోస్టల్ రీజియన్‌లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు క్రిష్ణా జిల్లాలు చేర్చాలని సూచించాయి. సౌత్ కోస్టల్ రీజియన్‌లో గుంటూరు ,ప్రకాశం ,నెల్లూరు జిల్లాలు, రాయలసీమ రీజియన్‌లో చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు ఉండాలని సూచించింది. ఇక తుళ్లురు ప్రాంతంలో కొంత అభివృద్ది జరిగిందని కాని అక్కడ కొన్ని ప్రాంతాల్లో వరదముంపు ప్రాంతాలు ఉన్నాయని వాటిని మినహాయించి మిగతా ప్రాంతాలను అభివృద్ది చెసి పరిపాలన కొరకు ఉపయోగించుకోవాలని సూచించినట్టు చెప్పారు.

 వైజాగ్‌లోనే సెక్రటేరియట్

వైజాగ్‌లోనే సెక్రటేరియట్


వైజాగ్‌లో సెక్రటేరియట్ తోపాటు సమ్మర్ , సీఎం క్యాంప్ ఆఫీసు, వేసవి అసెంబ్లీతో పాటు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సూచించినట్టు చెప్పారు. కాగా తుళ్లురు, వైజాగ్‌లో హైకోర్టు బెంచ్‌లు ఎర్పాటు చేయాలని రికమెండెషన్ చేసినట్టు చెప్పారు. కాగా వైజాగ్‌లో సెక్రటేరియట్‌తో పాటు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా వైజాగ్‌ ప్రాంతం అంతర్జాతియంగా అభివృద్ది చెందే అవకాశాలు ఉన్నాయని చెప్పింది.

 ప్రజాభిప్రాయం మేరకే నివేదిక అంశాలు

ప్రజాభిప్రాయం మేరకే నివేదిక అంశాలు

ఏపీ రాజధానితో పాటు రాష్ట్ర సమగ్ర అభివృద్దిపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి నివేదిక అందించిన జీఎన్ రావు కమీటీ అనంతరం మీడియాతో సమావేశం అయింది. ఈ నేపథ్యంలోనే పలు సూచనలు సలహాలు చేశామని చెప్పారు. మొత్తం మీద సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించినట్టుగా నివేదికలో పలు అంశాలు ఉన్నాయి. ఇదంతా ప్రజాభిప్రాయం ప్రకారమే నివేదిక ఇచ్చామని చెప్పాయి. నివేదికలో భాగంగానే 38వేల మంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారని జీఎన్ రావు చెప్పారు. కాగా నేరుగా వారం రోజుల పాటు వేలాది మంది రైతులను కలిసి వారి అభిప్రాయాలు సేకరించినట్టు ఆయన వివరించారు. మూడు నెలల పాటు అన్ని జిల్లాల్లో పర్యటించిన అభిప్రాయాలు సేకరించామని చెప్పారు.

English summary
The report of the JN Rao Committee said that the report was in line with the public opinion of Andhra Pradesh. The Committee believes that there is need for decentralization of development in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X