విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోస్తాకు వాన: రేపు, ఎల్లుండి భారీ వాన.. ఉపరితల ఆవర్తనంతో

|
Google Oneindia TeluguNews

ఈ ఏడాది వర్షాలు బానే కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో మాత్రం వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. వాయుగుండం, ఉపరితల ఆవర్తనాల వల్ల వర్ష ప్రభావం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో వర్ష ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది.

కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. ఈశాన్య బంగాళాఖాతంలోని ఆవర్తనం సోమవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనంలో విలీనం కానుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం ప్రభావంతో ఆదివారం కోస్తాలో ఎక్కువచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి.

 tomorrow and day after tomorrow rain lashes in kosta

ఉత్తరకోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయి. ఈ నెల నాలుగు, ఐదు తేదీల్లో కోస్తాలో అనేక చోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం రాష్ట్రంలో పలుచోట్ల మేఘాలు ఆవరించడంతో ఎండ తీవ్రత తగ్గింది. జంగమహేశ్వరపురంలో 34.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

ఇటు హైదరాబాద్‌లో అయితే వర్ష ప్రభావం ఎక్కవగానే ఉంటుంది. ఈ సారి ఎక్కువ వర్షపాతం కురుస్తోంది. అప్పుడే ఉక్కపోత.. ఆ తర్వాత వర్షం పడుతుంది. గత రెండు, మూడురోజుల నుంచి ముసురు లాంటి వాతావరణం ఉంది.

English summary
tomorrow and day after tomorrow rain lashes in kosta andhra weather officials are said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X