విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శిరోముండనం కేసు .. నూతన్ నాయుడిపై మరిన్ని కేసులు .. రౌడీ షీట్ తెరిచే ఛాన్స్

|
Google Oneindia TeluguNews

శిరోముండనం కేసులో అరెస్ట్ అయిన నూతన్ నాయుడుపై మరిన్ని కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధమైంది. దళిత యువకుడికి తన ఇంట్లో శిరోముండనం చేయించిన ఘటనలో నూతన్ నాయుడు భార్య మధుప్రియతో పాటుగా ఆ ఘటనలో ఉన్న వారందరినీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదే కేసు విషయంలో నూతన్ నాయుడును కూడా అరెస్ట్ చేసిన పోలీసులు శిరోముండనం కేసుకు సంబంధించి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.

శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్ .. ముంబై పారిపోయే క్రమంలో పట్టుకున్న పోలీసులు శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్ .. ముంబై పారిపోయే క్రమంలో పట్టుకున్న పోలీసులు

నూతన్ నాయుడిపై పలు స్టేషన్ లలో చీటింగ్ కేసులు

నూతన్ నాయుడిపై పలు స్టేషన్ లలో చీటింగ్ కేసులు

రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ పేరును దుర్వినియోగం చేసిన మోసానికి పాల్పడినట్లుగా గుర్తించిన వ్యవహారంలో నూతన్ నాయుడు పై ఇప్పటివరకు విశాఖ నగరంలోని పెందుర్తి, కంచరపాలెం, గాజువాక ,మహారాణిపేట స్టేషన్లలో 8 కేసులు నమోదయ్యాయి.

నూతన్ నాయుడు వేరొక సెల్ ఫోన్ నెంబర్ తో పీవీ రమేష్ పేరు ను ఉపయోగించి ఎంత మందిని మోసం చేసి ఉంటారనే దానిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. నూతన్ నాయుడు బారినపడి మోసపోయిన వారి వివరాలను సేకరిస్తున్నారు. నూతన్ నాయుడు ఇప్పటి వరకు 30 మంది అధికారులతో మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తించారు.

మొబైల్ ఫోన్ కాల్స్ డేటా పరిశీలన .. రౌడీ షీట్ తెరిచే ఆలోచన

మొబైల్ ఫోన్ కాల్స్ డేటా పరిశీలన .. రౌడీ షీట్ తెరిచే ఆలోచన

వారందరి నుంచి ఫిర్యాదులు తీసుకుని నూతన్ నాయుడు పై కేసులు నమోదు చేయనున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న నూతన్ నాయుడుకు సంబంధించి ఆయన వినియోగించిన మొబైల్ నెంబర్ ఫోన్ కాల్స్ జాబితాను పోలీసులు విశ్లేషిస్తున్నారు.
ఇప్పటి వరకూ ఆయనపై ఎనిమిది కేసులు నమోదు కావడంతో ఆయన పై రౌడీషీట్ తెరిచే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ఇక మరో మారు కోర్టు అనుమతిస్తే నూతన్ నాయుడు భార్య మధుప్రియ తో పాటు మరో ఐదుగురిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారణ జరపాలని నిర్ణయం తీసుకున్నారు .

మరో మారు విచారణకు కోర్టు అనుమతి కోరిన పోలీసులు

మరో మారు విచారణకు కోర్టు అనుమతి కోరిన పోలీసులు


దీని కోసం కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతిస్తే మరోమారు విచారించి ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు.

మొత్తానికి ఏపీలో సంచలనం సృష్టించిన దళిత యువకుడి శిరోముండనం కేసులో ప్రధాన పాత్రధారి అయిన నూతన్ నాయుడు భార్యతో పాటుగా, ఆ రోజు ఘటన సమయంలో ఉన్న వారందరినీ, ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా గుర్తించిన నూతన్ నాయుడుని పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Recommended Video

SSR case: Rhea Chakraborty reaches NCB office for questioning | Oneindia Telugu
 శిరోముండనం కేసులో కొత్త కోణాలు

శిరోముండనం కేసులో కొత్త కోణాలు


ఏపీలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని సీఎం జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతున్న నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఉడిపి నుండి ముంబై పారిపోతున్న నూతన్ నాయుడు ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్న క్రమంలో ఈ కేసులో మరిన్ని కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.
నూతన్ నాయుడు చేసిన మరిన్ని మోసాల గుట్టు రట్టవుతుంది .

English summary
So far, eight cases have been registered against Nutan Naidu at Pendurthi, Kancharapalem, Gajuwaka and Maharanipeta stations in Visakhapatnam in connection with the case of retired IAS PV Ramesh, who was found guilty of misusing his name. police are planning to open a rowdy sheet on Naidu.Police are currently investigating how many people were cheated by Nutan Naidu using the name of PV Ramesh with a different cell phone number. Police found that he had spoken to about 30 officers so far.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X