• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆ పెద్ద నేతకు తీవ్రమైన కష్టాలు -జగన్, కేసీఆర్ జాతకాలు ఇలా -ఉగాది వేళ స్వరూపానంద బాంబు -ప్లవ అంటే

|

శార్వారీ నామ సంవత్సరానికి వీడ్కోలు పలికిన తెలుగు ప్రజలంతా శ్రీ ప్లవ నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఉగాది పండుగను జరుపుకొంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంగళవారం ఉగాది వేడుకలు, పంచాగ శ్రవణాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా రాజకీయ పార్టీల కార్యాలయాల్లో పంచాంగ శ్రావణాలు వారివారికి అనుకూలంగా సాగాయి. ప్రజాదరణ పొందిన పలువురు స్వాముల పంచాంగ పఠనాలకూ ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అత్యంత ప్రీతిపాత్రుడిగా, ఆంధ్రా, తెలంగాణ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా కొనసాగే స్వరూపానందేంద్ర స్వామి పంచాంగ పఠనంలో ఈసారి అనూహ్య విషయాలు చెప్పారు.

సిగ్గుందా.. వాలంటీర్లు జగన్ సైన్యాలా? -షర్మిల పార్టీకి విజయమ్మ అధ్యక్షురాలా? -వైసీపీ ఎంపీ రఘురామ ఫైర్సిగ్గుందా.. వాలంటీర్లు జగన్ సైన్యాలా? -షర్మిల పార్టీకి విజయమ్మ అధ్యక్షురాలా? -వైసీపీ ఎంపీ రఘురామ ఫైర్

ప్లవ అంటే అర్థమిదే..

ప్లవ అంటే అర్థమిదే..


నేటి ఉగాది పండుగతో ప్రవేశించిన ప్లవ నామ సంవత్సరం శుభప్రదమైన సంవత్సరమని పండితులు చెబుతున్నారు. ప్లవ అంటే, దాటించునది అని అర్థం. ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుందని, అంటే చీకటి నుంచి వెలుగు లోకి నడిపిస్తుందని అంటున్నారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర మంగళవారం గంటల పంచాంగాన్ని ఆవిష్కరించారు. ప్లవ అంటే చీకటిని పారద్రోలి వెలుగులు నింపడమని స్వామి స్వరూపానందేంద్ర అన్నారు.

మర్కజ్ మసీదుపై సంచలన తీర్పు -మిగతా మతాలకు లేని నిషేధం దానిపై ఎందుకు? -రంజాన్ వేళ తెరవండిమర్కజ్ మసీదుపై సంచలన తీర్పు -మిగతా మతాలకు లేని నిషేధం దానిపై ఎందుకు? -రంజాన్ వేళ తెరవండి

పెద్ద నేతకు ఇబ్బందులు..

పెద్ద నేతకు ఇబ్బందులు..


ఉగాది వేళ పంచాంగాన్ని ఆవిష్కరించిన స్వరూపానంద.. శార్వరి, వికారిలా కాకుండా ప్లవ నామ సంవత్సరంలో శుభాలు కలగాలని కోరుకుందామన్నారు. ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని స్వామి వెల్లడించారు. ఈ ఏడాది ఓ పెద్ద నేతకు తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోబోతున్నారని స్వరూపానంద సెలవిచ్చారు. గ్రహాల అనుకూలత లేనప్పటికీ తెలుగు రాష్ట్రాలకు మంచి జరుగుతుందని ఆకాంక్షించారు.

జగన్, కేసీఆర్ జాతకాలు ఇలా..

జగన్, కేసీఆర్ జాతకాలు ఇలా..

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ జాతకాలు బాగున్నాయని.. ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవన్నారు స్వరూపానందేంద్ర. రాష్ట్రానికి మంచి జరుగుతుందని భావిస్తున్నాను అన్నారు. విశాఖ శారదాపీఠంలో మంగళవారం నుంచి భగవంతుడ్ని, రాజశ్యామల ఆరాధనను విశేష అర్చనలు నిర్వహిస్తామన్నారు. ప్రజలు, పాలన బావుండాలి, పచ్చని పంట పొలాలతో రైతులు బావుండాలని దేవుడ్ని కోరుకుంటున్నానని స్వామి చెప్పారు. కాగా,

జాతకం బాగోలేని ఆ నేత ఎవరు?

జాతకం బాగోలేని ఆ నేత ఎవరు?

ప్లవ నామ ఉగాది వేడుకల్లో స్వరూపానందేంద్ర స్వామి చెప్పిన కష్ట జాతకం ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జగన్, కేసీఆర్ జాతకాలు బావుంటే.. మరి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోబోతున్న ఆ నేత ఎవరనేదానిపై చర్చ జరుగుతోంది. ఆ పెద్ద నేత తెలుగు రాష్ట్రాలకు చెందినవారా, జాతీయ స్థాయి నేతా అనేది స్వరూపానంద స్పష్టంగా చెప్పలేదు. అయితే ఆయనా మాట చెప్పిన తీవ్రతను బట్టి కచ్చితంగా టాప్ నేతలను ఉద్దేశించే అన్నారనే వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే...

తెలుగులో మోదీ విషెస్, జగన్, కేసీఆర్ ఇలా

తెలుగులో మోదీ విషెస్, జగన్, కేసీఆర్ ఇలా


ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలకు తెలుగు భాషలోనే శుభాకాంక్షలు చెప్పారు ప్రధాని మోదీ. ‘‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను'' అని మోదీ ట్వీట్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు విషెస్ చెప్పినప్పటికీ వేడుకలకు దూరంగా ఉన్నారు. కరోనా నేపథ్యంలో తెలంగాణలో ఈసారి ఉగాది వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు.

English summary
Vishaka Sri Sarada Peetham head swaroopanandendra swamy alias swaroopananda made sensational predictions during ugadi panchangam 2021. speaking at ugadi event on tuesday, swami told that a top leader of country will face huge troubles this year. ap cm ys jagan and telangana cm kcr has good time ahead, swaroopananda added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X