విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ మెట్రో ప‌రుగులు : అయిదు నెల‌ల్లో ప‌నులు ప్రారంభం: రూ.4200 కోట్ల రుణం

|
Google Oneindia TeluguNews

ఏపి వాణిజ్య రాజ‌ధాని విశాఖ‌లో మెట్రో ప‌నులు ప‌రుగులు పెట్టిస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. మూడేళ్ల కాల ప‌రిమ‌తి తో ప‌నులు పూర్తి చేసేలా కార్యాచ‌ర‌ణ సిద్దం చేసారు. ఇందు కోసం ఈ నెల 21న టెండ‌ర్లు ఓపెన్ చేయ‌నున్నారు. ఐదు నెల‌ల్లో ప‌నులు ప్రారంభించాల‌ని డిసైడ్ అయ్యారు. ఇప్ప‌టికే విశాక మెట్రో కోసం ద‌క్షిణ కొరియా బ్యాంకు నుండి రూ. 4200 కోట్ల రుణం సేక‌రించాల‌ని నిర్ణ‌యించారు.

రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత విజ‌య‌వాడ‌- విశాఖ లో మెట్రో ఏర్పాటు కు అప్ప‌ట్లోనే నిర్ణ‌యించారు. అయితే, సాంకేతిక కార ణాల వ‌ల‌న విజ‌య‌వాడ‌లో మెట్రో కు జాప్యం జ‌రుగుతోంది. దీంతో..విశాక‌లో మెట్రో పై అధికారులు దృష్టి సారించారు. పిపిపి విధానంలో నిర్మించే విశాఖ మెట్రోను మూడేళ్ల కాలంలో న‌గ‌ర వాసుల‌కు అందుబాటులోకి తేవాల‌ని కార్యాచ‌ర‌ణ సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా..ఈ నెల 21న దాఖ‌లైన టెండ‌ర్ల‌ను ఓపెన్ చేయ‌నున్నారు.

Visakha metro ready in Three years : works start in three months

అందులో ఫైనాన్స్‌.. టెక్నిక‌ల్ ఆర్హ‌త సాధించిన వారికి ప‌నులు అప్ప‌గించి..అయిదు నెల‌ల కాలంలో ప‌నులు ప్రారంభించేలా చ‌ర్య‌లు తీ సుకుంటామ‌ని అధికారులు చెబుతున్నారు. మొత్తం మూడేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామ‌ని..ఇప్ప‌టికే దీనికి సంబంధించి ద‌క్షిణ కొరియా బ్యాంకు నుండి రూ.4200 కోట్ల రుణం తీసుకుంటున్నారు. తాజాగా, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ విశాఖ లో దీని పై జిల్లా అధికారుల‌తో స‌మీక్షించారు. త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌మైన కార్యాచ‌ర‌ణ విడ‌దుల చేయ‌నున్నారు.

ప్ర‌భుత్వం పై భారం ప‌డ‌కుండా..

ప్రభుత్వంపై ఎటువంటి భారం పడకుండా విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నా రు. మెట్రో కారిడార్లకు ఇరువైపులా ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా వచ్చే లాభాలతో పాటు టికెటింగ్‌, ప్రచార, ఇతర మార్గాల ద్వారా వనరులను సమకూర్చు కోవాలని నిర్ణ‌యించారు. ప్రాజెక్టుకు రూ.8,300 కోట్లు ఖర్చవు తుందని, ఇందులో రూ.4200 కోట్లు వయాడక్ట్‌, ఇతర నిర్మాణాల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఈ పనులను ప్రభుత్వం చేపట్టాల్సి ఉంటుంద‌ని అధికారులు చెబుతున్నారు. మిగిలిన రూ.4100 కోట్లతో ట్రాక్‌ పనులు, విద్యుదీకర ణ, కోచ్‌ల తయారీ ప్రయివేటు వ్యక్తులు చేపట్టాల్సి ఉంటుంది.

భోగాపురం కార‌ణంగా విశాఖ ఏయిర్ పోర్టు మూసేస్తారా: కేంద్ర ప్ర‌భుత్వం ఏం చెబుతోంది.. భోగాపురం కార‌ణంగా విశాఖ ఏయిర్ పోర్టు మూసేస్తారా: కేంద్ర ప్ర‌భుత్వం ఏం చెబుతోంది..

ప్రాజెక్టులో ప్రయివేటు వ్యక్తులను భాగస్వామ్యం చేయ డంతో ప్రభుత్వానికి కొంత భారం తగ్గడంతో పాటు బాధ్యతగా పనిచేసే వ్యక్తులు వస్తారని అంచ‌నా వేస్తున్నారు. నష్టాల ను సాధ్యమైనంత వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 30 ఏళ్లపాటు వారే మెట్రోను నిర్వహిం చుకునే అవకాశం కల్పిస్తున్న ప్ర‌భుత్వం... మధ్యలో వచ్చిన లాభాలను పరిశీలించి 11 ఏళ్ల తరువాత ప్రభుత్వానికి కొంత ఆదాయం వచ్చేలా షేర్‌ తీసుకోనున్నారు.

English summary
Visakha metro may ready in coming three years. metro officials open tenders on 21st of January. Works start in five months. Metro proposed to take loan of rs 4200 cr.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X