Visakhapatnam Steel Plant telangana letter nirmala sitaraman pm modi ap government parliament session తెలంగాణ లేఖ కేంద్ర ఆర్థిక మంత్రి పిఎం మోడీ ఏపీ ప్రభుత్వం
ఉధృతమైన విశాఖ ఉక్కు ఉద్యమం : తెలంగాణా మావోయిస్టుల మద్దతు , ఉక్కు పరిపాలనా భవనం ముట్టడి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ చేసిన వ్యాఖ్యలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ 100% ప్రైవేటీకరణ చేస్తామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈక్విటీ షేర్ లేదని నిర్మల సీతారామన్ తేల్చిచెప్పారు. దీంతో విశాఖలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి.
పార్లమెంట్ వేదికగా మరోమారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను100 శాతం ప్రైవేటీకరిస్తాం, ఏపీకి ఈక్విటీ షేర్ లేదంటూ కేంద్రం షాక్

విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పరిపాలన భవనాన్ని ముట్టడించాలని నిర్ణయం
స్టీల్ ప్లాంట్ అమ్మకంపై నిర్మల సీతారామన్ చేసిన ప్రకటన నేపథ్యంలో విశాఖలో ఉక్కు కార్మికులు ఉద్యమాన్ని ఉదృతం చేయాలని నిర్ణయించారు. నిర్మలమ్మ ప్రకటనతో ఒక్కసారిగా ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడింది . నిన్న రాత్రి నుండే ఆందోళనలు మిన్ను ముట్టాయి. అందులో భాగంగా నేడు కేంద్రం తీరుకు నిరసనగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పరిపాలన భవనాన్ని ముట్టడించాలని నిర్ణయించారు. మరోవైపు జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం కూడలి ఉక్కు స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.

ఉక్కు ఉద్యమానికి తెలంగాణా మావోయిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేంద్రం ప్రకటన ఉన్న ప్రతులను దగ్ధం చేశారు ఆందోళనకారులు. కార్మికుల ఆందోళనల నేపథ్యంలో విశాఖ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
ఇదిలా ఉంటే ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించడం కోసం పోరాటం సాగిస్తున్న ఉద్యమకారులకు మావోయిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ ఒక లేఖ విడుదల చేశారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మావోయిస్ట్ పార్టీ నాయకుడు జగన్ లేఖ
ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ కాకుండా రక్షించేందుకు తెలంగాణ ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు .దేశ సంపదను సామ్రాజ్యవాదులు పెట్టుబడిదారులకు కేంద్రం ధారాదత్తం చేస్తోందని జగన్ లేఖలో మండిపడ్డారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని జగన్ తన లేఖ ద్వారా స్పష్టం చేశారు. ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా వెల్లడించారు.
ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం మరోమారు ప్రకటన చెయ్యటంతో రాజకీయ పార్టీలకు పెద్ద తలనొప్పి తయారైంది. ఎమ్మెల్యేలు , ఎంపీలను ఘెరావ్ చేస్తున్న కార్మిక సంఘాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.